Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన వాసంతి.. సంచలనంగా మారిన వీడియో.. ప్రేమలో బిగ్ బాస్ కొత్త జంట!
తెలుగు బుల్లితెరపై సంచలనంగా మారిన షో బిగ్ బాస్. అత్యధిక రేటింగ్‌తో సాగిపోతోన్న ఈ కార్యక్రమం సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడపుకుంటోంది. ఇక, దీని ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో తెలుగు హీరోయిన్ వాసంతి కృష్ణన్ ఒకరు. ఈ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. తాజాగా జరిగిన ఓ షోలో తోటి కంటెస్టెంట్‌కు ముద్దు పెట్టేసింది. దీంతో ఇప్పుడు అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరిగిందో మీరే చూడండి!

ఎవరీ వాసంతి... ఏం చేసింది?
తెలుగులో వాసంతి కృష్ణన్ సుదీర్ఘ కాలంగా తనదైన యాక్టింగ్‌తో అలరిస్తోంది. 'సిరిసిరి మువ్వలు' అనే సీరియల్ ద్వారా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 'గోరింటాకు', 'గుప్పెడంత మనసు' సహా ఎన్నో సీరియళ్లలో నటించింది. అలాగే కొన్ని చిత్రాల్లోనూ ఈ అమ్మడు సందడి చేసింది. ఇక, సంపూర్ణేష్ బాబు 'క్యాలీ ఫ్లవర్' మూవీలో హీరోయిన్‌గా నటించింది.

21 మందిలో వాసంతి స్పెషల్
గత సీజన్ల కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపారు. అందులో తెలుగు భామ వాసంతి కృష్ణన్ బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిలో పడింది.

ఆటలేదని విమర్శ... గట్టిగానే
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై చాలా ఏళ్లుగా తెగ సందడి చేస్తున్నా.. వాసంతి కృష్ణన్ మాత్రం పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేదు. దీంతో ఆమెకు పెద్దగా క్రేజ్ కూడా దక్కలేదు. అలాగే, ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆమె ఆట పరంగా విమర్శలను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో తనను తాను నిరూపించుకునేందుకు బాగా ప్రయత్నించి సత్తా చాటుకుంది.

ఎలిమినేట్... వరుస ఆఫర్లతో
బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరు, అందంతో ఆకట్టుకుని.. వివాదరహితురాలిగా పేరు తెచ్చుకుంది వాసంతి కృష్ణన్. అయినప్పటికీ ఫాలోయింగ్ ఎక్కువగా లేని కారణంగా షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇక, షో నుంచి బయటకు వచ్చిన వెంటనే వాసంతి కృష్ణన్ 'ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' అనే సీరియల్‌లో ఆఫర్ అందుకుంది. అలాగే, పలు చిత్రాలు కూడా ఓకే చేసింది.

వాళ్లతో కలిసి స్టార్ మా షోలో
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న వాసంతి కృష్ణన్.. తాజాగా స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' అనే షోలో పాల్గొంది. ఇందులో ఆరోహి, గీతూ రాయల్, అభినయశ్రీ, నేహా చౌదరి, చలాకీ చంటి, ఆర్జే సూర్య, అర్జున్ కల్యాణ్, బాలాదిత్య, షానీ సాల్మన్‌లు కూడా వచ్చారు. దీన్ని శ్రీముఖి హోస్ట్ చేసింది.
ఎన్నో హైలైట్లు.. ఆమె కోసం
ఈ సండే ఉదయం 11 గంటలకు ప్రసారం కాబోతున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎపిసోడ్‌లో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు కనిపించాయి. ముఖ్యంగా సూర్య - ఆరోహి ట్రాక్‌ను బాగా హైలైట్ చేశారు. అలాగే, సూర్య.. గీతూకు ప్రపోజ్ చేయడం, కంటెస్టెంట్లు అందరూ డ్యాన్స్ చేయడం, ఆటలు ఆడడం వంటి వాటితో ఇది సరదాగా సాగింది.

అర్జున్‌కు లాంగ్ కిస్.. డౌట్లు
ఈ షోలో భాగంగా వాసంతి కోసం అర్జున్ కల్యాణ్ కరేలా జ్యూస్ తాగాడు. దీనికి ఇంప్రెస్ అయిన ఆ బ్యూటీ వెంటనే అతడి బుగ్గపై సుదీర్ఘంగా ముద్దు పెట్టేసింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయిపోయారు. ఆ తర్వాత అర్జున్ బుగ్గపై వాసంతి లిప్ మార్కును చూపిస్తూ అందరూ గోల చేశారు. ఇక, ఈ ఘటనతో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా అని చాలా మంది అనుమానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











