Bigg Boss Telugu 6: షోలో షాకింగ్ సీన్.. నన్ను అక్కడ టచ్ చేసి నొక్కాడు.. వాసంతి సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని షో ఇది. అంతలా ఇది దాదాపు ఆరేళ్లుగా మన టెలివిజన్‌పై సంచలనాలకే కేరాఫ్ అడ్రెస్‌గా నిలవడంతో పాటు ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఎన్నో సర్‌ప్రైజ్‌లతో సాగింది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో వాసంతి ఓ కంటెస్టెంట్‌పై ఆరోపణలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

అనుకుందొకటి.. అయింది మరోటి
బిగ్ బాస్‌కు తెలుగులో దక్కేంత ఆదరణ మరే దానికీ రావడం లేదు. గతంలో వచ్చిన అన్ని భారీ రేటింగ్‌తో సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సాగుతోన్న ఆరో సీజన్‌లో సరికొత్త టాస్కులు, రొమాన్స్, లవ్, ఎమోషన్స్, గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, దీనికి ఆదరణ దక్కక రేటింగ్ దారుణంగా వస్తోంది.

21మంది ఎంట్రీ.. ఆమె స్పెషల్‌గా
గత సీజన్ల కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపారు. అందులో తెలుగు భామ వాసంతి కృష్ణన్ బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిలో పడింది.

ఆటలేదని విమర్శ.. ప్రయత్నిస్తూ
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై చాలా ఏళ్లుగా తెగ సందడి చేస్తున్నా.. వాసంతి కృష్ణన్ మాత్రం పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేదు. దీంతో ఆమెకు పెద్దగా క్రేజ్ కూడా దక్కలేదు. అలాగే, ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆమె ఆట పరంగా విమర్శలను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో తనను తాను నిరూపించుకునేందుకు బాగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.

సర్వైవ్ అవడానికి పోరాటం చేసి
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఏడో వారంలో 'సెలెబ్రిటీ గేమింగ్ లీగ్' ఫెయిల్ అవడంతో కంటెస్టెంట్లు అందరికీ బిగ్ షాక్ తగిలింది. దీంతో అన్నీ సదుపాయలూ బంద్ చేసిన బాస్.. ఆ తర్వాత కంటెస్టెంట్లకు 'బ్యాటిల్ ఫర్ సర్వైవర్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో వాసంతి కృష్ణన్ తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా మేల్ కంటెస్టెంట్లతో సమానంగా ఆడింది.

రేవంత్‌ను కొట్టడంతో హాట్ టాపిక్
'బ్యాటిల్ ఫర్ సర్వైవర్' టాస్కులో పూలు, బొమ్మలను తీసుకు వచ్చేందుకు కంటెస్టెంట్లు అందరూ తెగ పోటీ పడ్డారు. దీంతో పలువురి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే బ్లూ టీమ్ తరపున ఆడిన వాసంతి కృష్ణన్ ఓ దశలో రెడ్ టీమ్ సభ్యుడైన రేవంత్‌ను కొట్టింది. దీంతో ఆ జట్టు వాళ్లందరూ దీన్ని హైలైట్ చేశారు. ఫలితంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది.

వాసంతిని టార్గెట్ చేసిన సభ్యులు
శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో 'మోస్ట్ డిజాస్టరస్' ఎవరు అనే టాస్కును నిర్వహించారు. ఇందులో సొంత టీమ్ సభ్యుడైన సూర్య.. వాసంతి పేరు చెప్పి.. ఆమె రేవంత్‌ను కొట్టడం నచ్చలేదని చెప్పింది. ఆ తర్వాత ఆది రెడ్డితో పాటు రేవంత్ కూడా అదే కారణం చెప్పి ఆమెను డిజాస్టర్ అన్నారు. దీంతో వాసంతికి ఎక్కువ ఓట్లు పడడంతో ఆమె జైలు పాలు అయింది.

అక్కడ టచ్ చేయబట్టే కొట్టానంటూ
రేవంత్‌ను కొట్టిందని అందరూ ఆరోపిస్తుండగా వాసంతి దీనిపై క్లారిటీ ఇచ్చింది. 'బజర్ మోగకముందే రేవంత్ నన్ను తోసేసి ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో అతడు నా కడుపుపై చేతితో నొక్కాడు (అనుకోకుండానే). అప్పుడు నాకు బాగా పెయిన్ వచ్చింది. అందుకే ఆటోమేటిక్‌గా చేతితో కొట్టాల్సి వచ్చింది. ఎవరి పెయిన్ వాళ్లకే తెలుస్తుంది' అంటూ ఆరోపణలు చేసింది.


Click it and Unblock the Notifications











