బిగ్ బాస్ అర్జున్ కల్యాణ్‌కు శ్రీ సత్య-వాసంతి పోటా పోటీ ముద్దులు.. ఏం అదృష్టం సామీ!

అర్జున్ కల్యాణ్.. ఈ పేరు వింటే తెలియని బిగ్ బాస్ లవర్స్ ఉండరు. గతేడాది వచ్చిన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో కంటెస్టెంట్లలో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కల్యాణ్ ఆటపై కంటే ఎక్కువగా బ్యూటిఫుల్ శ్రీ సత్యపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. హౌజ్ లో ప్రతీసారి శ్రీ సత్య జపం చేయడంతో లవ్ యాంగిల్ కంటెంట్ వచ్చింది కానీ కొంతవర్గం ప్రేక్షకులకు మాత్రం అంతగా రుచించలేదు. అందులోనూ శ్రీ సత్య దూరం పెడుతున్న అర్జున్ మాత్రం ఆమె వెంటే పడటంతో నెగెటివిటీ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే అర్జున్ ను దూరం పెట్టిన శ్రీ సత్యే తాజాగా అతనికి ముద్దు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

బాగా వాడుకుందని : బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో 21 మంది కంటెస్టెంట్స్ లో శ్రీసత్య, అర్జున్ కల్యాణ్, వాసంతి కృష్ణన్ ఒకరు. సీజన్ ప్రారంభంలో సైలెంట్ గా ఉన్న శ్రీ సత్య తర్వాత తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆమె వెంట అర్జున్ కల్యాణ్ ఎంత పడినా తను మాత్రం హద్దుల్లో ఉంది. కానీ అతన్ని హౌజ్ లో గేమ్ పరంగా శ్రీసత్య బాగా వాడుకుందని విమర్శలు తెగ వినిపించిన విషయం తెలిసిందే. అది ఆమెకు తీవ్రమైన నెగెటివిటీని తీసుకొచ్చింది.

Omkar Sixth Sense 5

ఏడ్చేసిన శ్రీ సత్య : అలాగే శ్రీ సత్య పట్టించుకోకున్న అర్జున్ కల్యాణ్ అలా వెంటపడటం, ఆటపై శ్రద్ధ పెట్టకపోవడంతో అతనికి కూడా మైనస్ అయింది. దీంతో అర్జున్ కల్యాణ్ వెంటనే ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్ ను వీడి బయటకు వెళ్లేటప్పుడు కేవలం శ్రీ సత్య కోసమే బిగ్ బాస్ కు వచ్చినట్లు చెప్పాడు అర్జున్ కల్యాణ్. అతను వెళ్లేటప్పుడు శ్రీ సత్య కూడా ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఇదిలా ఉంటే వీళ్లిద్దరూ బీబీ జోడీలో కూడా పాల్గొన్నారు.

మూడో రన్నరప్ గా : మరో బ్యూటిఫుల్ వాసంతి కృష్ణన్ తో అర్జున్ కల్యాణ్ జత కట్టి బీబీ జోడీలో పాల్గొంటే.. మెహబూబ్ తో శ్రీ సత్య జంటగా ఆడింది. ఈ రెండు జంటలు బీబీ జోడీలో మంచి పెర్ఫామెన్స్ తో అలరించారు. బిగ్ బాస్ హౌజ్ లో నెగెటివిటీ తెచ్చుకున్న అర్జున్ కల్యాణ్ బీబీ జోడీలో మాత్రం తన డ్యాన్సుతో జడ్జ్ లు, ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఫైనల్ గా మూడో రన్నరప్ గా నిలిచారు.

సంయుక్త మీనన్ ఎంట్రీ : ఇదిలా ఉంటే వాసంతి కృష్ణన్-అర్జున్ కల్యాణ్, శ్రీ సత్య-మెహబూబ్ జోడీలు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్త్స్ సెన్స్ 5వ సీజన్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఈ జోడీలతో పాటు విరూపాక్ష హీరో హీరోయిన్స్ సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, ప్రియాంక సింగ్, రవి కూడా సందడి చేశారు. ప్రోమోలో ముందుగా సార్ అనే పాట పాడుతూ సంయుక్త ఎంట్రీ ఇచ్చింది.

అర్జున్ తలకు గన్ : సంయుక్త తర్వాత సాయి ధరమ్ తేజ్, రవి, ప్రియాంక సింగ్ వచ్చారు. వీరు కొద్దిసేపు సందడి చేశాక అర్జున్, వాసంతి, శ్రీ సత్య, మెహబూబ్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అర్జున్ కల్యాణ్ కు గన్ తో గురి పెట్టింది శ్రీ సత్య. అప్పుడు అర్జున్ మరింత దగ్గరకు వచ్చి తన తలకు గన్ ను పెట్టుకున్నాడు. అనంతరం శ్రీ సత్యను ఎత్తుకుని మెహబూబ్ గుప్పెడంత ప్రేమకు అనే ఆర్య 2లోని సాంగ్ కు డ్యాన్స్ చేశాడు.

ఇప్పుడేం లేవా : మెహబూబ్ డ్యాన్స్ తర్వాత ఏమైందో తెలియదు గానీ వాసంతి వచ్చి అర్జున్ కల్యాణ్ బుగ్గపై ముద్దు పెట్టింది. దీంతో ఆ వెంటనే పోటీ పడినట్లుగా శ్రీ సత్య కూడా వచ్చి అర్జున్ చెంపపై ముద్దు పెట్టి నవ్వుతూ వెళ్లిపోయింది. తర్వాత అర్జున్ వైపు చూస్తూ "ఏమైనా ఇచ్చెయొచ్చు కదా ఇప్పుడేం లేవా" అని శ్రీ సత్య అంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇద్దరు అమ్మాయిలతో ముద్దు పెట్టించుకున్న అర్జున్ కల్యాణ్ ది ఏం అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X