Guppedantha Manasu March 19th: మను సేఫ్.. అనుపమ ఆస్పత్రిలో.. వీరిద్దరి బంధం రివీల్!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో వసు, అనపమలు మనును తప్పుగా అర్థం చేసుకుంటారు. రాజీవ్ అంటించిన పోస్టర్లు మను గదిలో ఉండడం చూసి షాకై గొడవ పడతారు. అతడిని కాలేజీ నుంచి వెళ్లిపోమని.. నువ్వేంటి ఇలా చేస్తున్నావంటూ వసు, అనుపమలు ఇద్దరూ చెబుతారు. దీంతో మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అనుపమ వసుకు సారీ చెబుతుంది. నువ్వు వాడి గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు కదమ్మా అందుకు సారీ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత శైలేంద్రను చూపిస్తారు. అనుపమ చింపేసిన పోస్టర్లు తెచ్చి మనును చూస్తూ ఉంటాడు.
ఆ తర్వాత రాజీవ్ కు ఫోన్ చేయగా.. పార్టీ చేసుకుందామా బ్రో మను వెళ్లిపోతున్నాడు కదా అంటాడు. నీకెలా తెలుసని శైలేంద్ర అనగా నా పనే అది కదా అన్నీ తెలుసుకుంటానంటూ వివరిస్తాడు. అలాగే కాలేజీకి ఎంటర్ అయినంత త్వరగా వసు మనసులోకి ఎంటర్ అయ్యాడని భయపడ్డాడని కానీ ఇప్పుడు మాత్రం అతడు వెళ్లిపోతున్నాడనంటూ తెగ సంబురపడిపోతారు. వెంటనే శైలేంద్ర.. తాను సుపారీ ఇచ్చిన రౌడీకి ఫోన్ చేస్తాడు. నేను ఫొటో పంపిన వాడిని వదిలెయ్ అంటూ వివరిస్తాడు. కానీ వాడు మాత్రం నేను ప్రొఫెషనల్ చెప్పినట్లు అస్సలే వినను అంటూ చెబుతాడు. ఆ తర్వాత మను బాధ పడుతూ కాలేజీ నుంచి బయటకు వస్తూ ఉంటాడు.

అప్పుడే మహేంద్ర వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా.. ఎక్కడికీ లేదు సార్ అనగా.... మహేంద్ర కడియం తీసి మనుకు చూపిస్తాడు. నేనిది రిషి కోసం చేయించాను, చాలా ఏళ్లుగా వాడి చేయికి తొడగాలని చూస్తున్నాను... అడక్కపోయినా ఓ కొడుకులా నా కుటుంబాన్ని కాపాడుతున్నావు, తండ్రికి వెన్నుదన్నులా ఉండే వాడినే కొడుకు అంటారు.. కాబట్టి నేనీ కంకణాన్ని నీకు తొడగాలనుకుంటున్నానని అంటాడు. కానీ మను మాత్రం వద్ద సార్ అంటాడు. సంతోషంగా ఇస్తుంటే వద్దంటున్నావ్ ఎందుకు, అయినా నీ మాటలు మాత్రమే ఇలా ఉన్నాయ్.. నీ మనసుకు ఇది ఇష్టమేనని అంటాడు.
నువ్వొదిలిపెట్టినా.. నేనొదిలి పెట్టను అంటూ మహేంద్ర చెబుతుండగా.. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థాంక్స్ అంటూ మను వివరిస్తాడు. ఆ తర్వాత తన అసిస్టెంట్ ను పిలిచి రూంలో నా వస్తువులు ఏమైనా ఉంటే ప్యాక్ చేయి అనగా.. తను వెళ్తాడు. ఇదేంటని మహేంద్ర అనగా.. నేను ఇక్కడ ఉండడం చాలా మందికి ఇష్టం లేదు నేను వెళ్లిపోతున్నాను అంటూ బయలుదేరుతాడు. ఏమైందో చెప్పమని అడిగినా మహేంద్రకు దండం పెట్టి వెళ్లిపోతాడు మను. ఇక ఆ తర్వాత కాలేజీ బయట రౌడీని చూపిస్తారు. మరోవైపు మహేంద్ర వెళ్లి ఏమైంది అనుపమ అంటూ అడుగుతాడు. తనే వచ్చాడు.. వెళ్లాలి అనుకుంటున్నాడు.. అందుకే వెళ్లిపోతున్నాడని అంటుంది.

ఆ తర్వాత వసు నీకేమైనా తెలిస్తే చెప్పు. ఎవరో ఒకరు అసలు విషయం చెప్పండి అంటూ అడుగుతారు. మరోవైపు రౌడీ కత్తి పట్టుకుని వచ్చి మనును చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ విషయాన్ని అనుపమ గమనిస్తుంది. వెంటనే మను మను అంటూ పరిగెట్టుకెళ్తుంది. దీంతో అనుపమను పొడుస్తాడు ఆ రౌడీ. అప్పుడే అమ్మా అంటూ మను పిలుస్తాడు. అప్పుడే రౌడీ కారు ఎక్కి పారిపోగా... మను మాత్రం అనుపమను పట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత మామయ్య కారు తీసుకు రండి అనగానే మహేంద్ర కారు తెస్తాడు. అప్పుడే మను తల్లిని కార్లో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి వెళ్తాడు. ఇదంతా చూస్తున్న శైలేంద్ర మను, అనుపమ కొడుకు అనే విషయాన్ని తెలుసుకుంటాడు.
ఆ తర్వాత ఐసీయూ బయట ఉండి వసు, మహేంద్ర, మనులు ఎదురు చూస్తుంటారు. లోపల అనుపమకు ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మను.. తన గతాన్ని తలుచుకుంటాడు. ముఖ్యంగా అనుపమతో జరిగిన గొడవను చూపిస్తారు. ఆమె తనను తల్లి అని పిలవొద్దంటూ చెప్పిన మాటలు చూపిస్తారు. ఇంకోసారి నన్ను అమ్మా... అని పిలిచావంటే నేను చచ్చినంత ఒట్టు అని అంటుంది. అలాగే ఇంకెప్పుడు నాకు కనిపించకు అంటూ చెబుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఏడుస్తూ కనిపిస్తారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రిని చూపిస్తారు. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











