Guppedantha Manasu March 21st: అసలు విషయం చెప్పేసిన మను.. షాక్‌లో మహేంద్ర, వసుధారలు!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో ఆస్పత్రిలో అనుపమ ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. మహేంద్ర, వసు, ఏంజెల్ లు అనుపమ తల్లి అని ఎందుకు చెప్పలేదని అడుగుతారు. అనుపమే నీ తల్లి అని, నీ తల్లే అనుపమ అని ఎందుకు చెప్పట్లేదని అడుగుతారు. అలాగే వసు మాట్లాడుతూ.. మీరు తప్పు చేయలేదని, ఆ ఫొటో వేరే వాళ్లు చేయించారని తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మౌనం పాటించాల్సిన సమయంలో మౌనం పాటించాలి.. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి లేదంటే చాలా అనార్థాలు జరిగిపోతాయని వసుధార అంటుంది. ఆ తర్వాత అనుపమ గురించి అడగ్గా.. మను ఒక్కసారిగా లేచి నిలబడతాడు.

అనుపమ నా తల్లి, నేను ఆమె కొడుకునే అంటూ గట్టిగా చెబుతాడు. అలాగే తనకు నేనో మాట ఇచ్చానని.. మాట ఇచ్చాను అనడం కంటే కూడా తనే బలవంతంగా నా దగ్గగర ఒట్టు తీసుకుంది అని చెప్పడం కరెక్టు అంటూ చెప్పుకొస్తాడు. కానీ ఈరోజు అమ్మా అని పిలవగా.. ఇలా ఆస్పత్రి పాలై నన్ను ఇబ్బంది పెడుతోందని అంటాడు. నా పరిస్థితిలో ఎవరు ఉన్నా ఇలాగే చేసే వాళ్లు అంటూ మను అంటాడు. అలాగే తనకు ఊహ తెలిసిన తర్వాత తెలిసిన ఒకే ఒక్క పదం అమ్మా అని.. తనకోసం అనుపమ ఎన్నో వదులుకుందని చెబుతాడు. కానీ తనను వేదించే ఓ ప్రశ్నను అడిగి అనుపమను చాలా ఇబ్బంది పెట్టానని అప్పటి నుంచి తనతో మాట్లాడడం మానేసిందని వివరిస్తాడు.

Vasu And Mahendra Shocked About Manu Past Issues on Guppedantha Manasu March 21st 2024 Episode 1030

ఆ తర్వాత ఏంజెల్ వచ్చి... మను బాధ పడకు అంటూ చెప్పుకొస్తుంది. అలాగే డాక్టర్ రాగానే మహేంద్ర అనుపమ ఎలా ఉందనగా.. ఆమె స్పృహలోకి వచ్చింది వెళ్లి మాట్లాడండి అంటుంది. ఇక వెంటనే మహేంద్ర, ఏంజెల్, వసులు వెళ్లగా.. మను అక్కడే ఉంటాడు. రమ్మంటే తర్వాత వస్తానని అనగా.. వారు వెళ్లి మాట్లాడతారు. ఏంజెల్ అత్తయ్యా ఇప్పుడెలా ఉందని అడుగుతుంది. నొప్పి ఎక్కువగా ఉందా అని అడగ్గా.. ఇట్స్ ఓకే అంటుంది. నువ్వు త్వరలోనే కోలుకుంటావని నాకు తెలుసు అంటూనే.. నువ్వు ప్రాణాలకు తెగించి నీ కొడుకును కాపాడుకున్నావని అంటాడు. నిజమైన తల్లివి అనిపించుకున్నావు అంటూ వివరిస్తాడు.

నిజాన్ని ఎందుకు దాచావాని అడగ్గా.. చప్పుడు చేయదు. ఆ తర్వాత వసు మాట్లాడుతూ.. కొడుకు అనే విషయాన్ని దాచారు కానీ మీ ప్రేమను దాచలేకపోయారంటూ చెబుతుంది. ఆ తర్వాత ఏంజెల్ మాట్లాడుతూ... ఇప్పుడు మీ కళ్లు అతడినే వెతుకుతున్నాయంటూ చెప్పుకొస్తుంది. ఆ తర్వాత మహేంద్ర.. మీరు వెళ్లి మనును తీసుకు రండి అని చెబుతాడు. వాళ్లు వెళ్లి మను అత్తయ్య స్పృహలోకి వచ్చింది.. నిన్ను రమ్మంటుంది అనగా.. చప్పుడు చేయడు. అత్తయ్య బానే ఉంది వెళ్లు అని అనగా... నేను వెళ్లలేను, వెళ్లకూడదు అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత వసు మాట్లాడుతూ.. ఆవిడ మిమ్మల్ని పిలిచారని చెప్పినా మీరు వెళ్లరా అంటూ చెబుతుంది.

Vasu And Mahendra Shocked About Manu Past Issues on Guppedantha Manasu March 21st 2024 Episode 1030

తన కళ్లు మీ కోసమే వెతుకున్నాయని.. మిమ్మల్ని తీసుకు వస్తామని చెప్పే మేమిక్కడికి వచ్చామంటూ వసు, ఏంజెల్ చెబుతారు. ఆ తర్వాత మహేంద్ర కూర్చుని.. ఆ రౌడీని చూడగానే ఎందుకు పరిగెత్తావు, అతడిని ఎప్పుడైనా చూశావా అంటూ అడుగుతాడు.. కానీ వీటేవిటికీ ఆమె సమాధామం చెప్పదు. అప్పుడు మను లోపలికి వస్తాడు. అనుపమ అతడినే చూస్తూ ఉంటుంది. ఏడుస్తూనే ఉంటుంది. వెంటనే మను వచ్చి మీరు త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటూ చెప్పుకొస్తాడు. మహేంద్ర మాటలు తడబడుతున్నాయని, అంతగా ఎమోషనల్ అవ్వకు అంటూ చెబుతాడు. తన విషయంలో బ్యాలెన్స్ తప్పుతున్నావని అనిపిస్తుందంటాడు.

ఆ తర్వాత మీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడారు చాలా థాంక్స్ అంటూ చెప్పుకొస్తుంది. మీరు రాకుండా ఉండి ఉంటే నా మీదే అటాక్ జరిగేది.. పోతే నేనే పోయుండే వాడిని కదా అంటూ మను అనగానే.. అనుపమ ఏడుస్తుంది. ఆ టైంలో మీకిచ్చిన మాట తప్పినందుకు సారీ అని, మిమ్మల్ని ఇంకెప్పుడు అలా పిలవను అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. వెంటనే మను అతడిని ఓదార్చి ఇలా చిన్న పిల్లాడిలా చేయడం ఏంటని అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర అన్నయ్య ఫోన్ చేసి అనుపమకు ఎలా ఉందని అడుగుతాడు. అసలు అటాక్ చేసింది ఎవరు, ఏమైనా తెలిసిందా అంటూ అడుగుతాడు.

Vasu And Mahendra Shocked About Manu Past Issues on Guppedantha Manasu March 21st 2024 Episode 1030

ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని.. మనుపై అటాక్ జరగడం ఏంటని ప్రశ్నిస్తాడు. మంచి చేసినా కొందరు జీర్ణించుకోలేక ఇలా అటాక్ చేసి ఉండవచ్చని అంటాడు. త్వరలోనే ఈ విషయాలన్నిటినీ తేల్చేస్తానని.. నువ్వు భయపడకు అన్నయ్యా అంటూ చెప్పుకొస్తాడు. అలాగే మను అనుపమ కొడుకు ఏంటి.. నాక్కూడా ఇప్పుడే తెలిసిందని మహేంద్ర అంటాడు. మహేంద్ర అనుపమ ట్యాబ్లెట్స్ వేసుకుందా, జ్యూస్ ఏమైనా తాగింది.. మాట్లాడుతుందా అంటూ ఆరా తీస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X