Guppedantha Manasu April 29th: రాజీవ్ డెడ్ బాడీ వెలుగులోకి.. శైలేంద్రపై దేవయానికి అనుమానం.. హంతకుడు ఎవరంటే?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ఆ రాజీవ్ ను బెదిరించాలనే ఉద్దేశంతోనే తాను మిస్ ఫైర్ చేశానని ము పోలీసులతో చెబుతాడు. కానీ ఇదంతా విన్న పోలీస్ మాత్రం నువ్వే హత్యే చేశావు.. ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు కోర్టులో చెప్పుకోండి అంటాడు. ఇంతలోనే వసుధార.. మరి రాజీవ్ డెడ్ బాడీ ఎక్కడ అంటే హత్య చేసినోడు డెడ్ బాడీ మాయం చేయలేడా అంటూ ఫైర్ అవుతాడు. మీరు ఇతడిపై ఇంతగా నమ్మకం పెట్టుకోవడం తప్పు అని.. అతడి డెడ్ బాడీ దొరికితే మరిన్ని ఆధారాలు దొరుకుతాయని చెబుతాడు. ఆ తర్వాత నేను పలు విషయాలు తెలుసుకుంటానంటూ మహేంద్ర వచ్చేస్తాడు.
ఇక ఆ తర్వాత దేవయాని.. శైలేంద్రను పిలుస్తూ వస్తుంది. రాజీవ్ మనం ఏది చెబితే అది చేస్తాడని, డీఆర్ఎస్ అనే పేరు పెట్టుకుని మనం అనేక పనులు చేశామని అంటుంది. అలాగే వాడు, నీవు నాకు రెండు కళ్లు అనుకున్నాను.. నిజంగానే రాజీవ్ చనిపోయాడా అంటూ శైలేంద్రను అడుగుతుంది. వాడు చచ్చాడనే కదా మనును పోలీసులు అరెస్ట్ చేసింది.. వాడు చనిపోయాడు అనేది నిజం అంటూ చెప్పుకొస్తాడు. దేవయాని మాత్రం వాడు చనిపోతే నీకు కాస్త కూడా బాధగా లేదా అంటూ అడుగుతుంది. వాడు మనకు చాలా కావాల్సిన వాడు, నాకెలాంటి బాధ లేదని శైలేంద్ర అనగా నీదేమైనా హస్తం ఉందని అని దేవయాని అంటుంది.

అలాగే వాడు చచ్చాడంటే నాకు నమ్మాలనిపించట్లేదని, మను చంపలేదేమో అనగా.. మరి నేను చంపానా అంటూ శైలేంద్ర ఫైర్ అవుతాడు. ఓ రెండు నిమిషాలు మౌనం పాటించి మన బాధను తీర్చుకుందామని అంటాడు. ఇలా వీరిద్దరూ కాసేపు మౌనం పాటిస్తారు. ఆ తర్వాత అనుపమను చూపిస్తారు. ఆ తర్వాత మహేంద్ర ఆమె వద్దకు వచ్చి మను హత్య చేయడని, త్వరలోనే బయటకు వస్తాడంటూ చెప్పుకొస్తాడు. అనుపమ కూడా అదే చెబుతుంది. మను మీద మనకు నమ్మకం ఉందని అంటాడు. కానీ అక్కడ దొరకిన బుల్లెట్స్, మను గన్ లో మిస్ అయిన బుల్లెట్స్ మ్యాచ్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అలాగే సీసీటీవీ ఫుటేజీలో గన్ పేల్చినట్లు ఉందని.. కావాలనే తను మిస్ ఫైర్ చేసినట్లు మను చెప్పాడు. అలాగే మను పీఏ వచ్చి మను బుల్లెట్లు పేల్చినట్లు తెలిపాడు.
అలాగే మను పీఏ చాలా మంచివాడు కదా అని అతడు అని అనుపమ అనగా.. అవును కానీ తను కూడా చూసింది మాత్రమే చెప్పాడని అంటాడు. ఆ తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుపమ అంటూ బాధ పడతాడు. నా కొడుకులా స్వీకరించి తండ్రి స్థానాన్ని ఇవ్వాలనుకుంటే ఇలా అయ్యిందేంటంటూ మహేంద్ర అనగా..అమ్మ అనే పిలుపుకు దూరం చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టాను.. మళ్లీ ఈ సమస్య ఏంటంటూ అనుపమ బాధ పడుతుంది. అంతలోనే ఏంజెల్ పోలీస్ స్టేషన్ కు వస్తుంది. మను ఏంటి ఇది.. అంటూ అడుగుతుంది. తనకేం అర్థం కావట్లేదని, మహేంద్ర సార్ ఫోన్ చేసి దత్తత అన్నారు, అది నచ్చక మేం రాకపోతే మళ్లీ ఫోన్ చేసి నువ్వు జైల్లో ఉన్నావని చెప్పాడు.

ఆ రాజీవ్ సంగతి నీకు తెలుసు కదా.. నువ్వెందుకు అలా చేశావంటూ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు చూడు ఎవరు సఫర్ అవుతున్నారో, లైఫ్ స్పాయిల్ అయిపోతుందంటూ అనగా.. వసు మాట్లాడుతూ నువ్వు ఇది నమ్ముతున్నావా అంటుంది. అందుకేగా పోలీసులు అరెస్ట్ చేశారని అనగా.. తప్పు చేయకపోయినా జైల్లో ఉండాల్సి వస్తుంది, అలా అని తప్పు చేసినట్లు కాదని అంటుంది. మను ఏ తప్పూ చేయకపోయినా ఇలా కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందని వివరిస్తుంది. ఆ తర్వాత వసు అసలు విషయం చెబుతుంది. నిన్న రాత్రి మనుకు ఫోన్ చేసి రాజీవ్ పిలవగా అక్కడకు వెళ్లినట్లు చెప్పుకొస్తుంది. ఆ తర్వాత జరిగినదంతా పూస గుచ్చినట్లు వివరిస్తుంది.
నిజంగానే మను ఈ హత్య చేయలేదని, అదే విషయాన్ని పోలీసులకు చెప్పారని అంటుంది. ఆ తర్వాత ఏంజెల్ మాట్లాడుతూ.. మను నువ్వు నిజంగానే ఈ హత్య చేయలేదు కదా అంటుంది. ఆ తర్వాత చెప్పు నువ్వు ఈ హత్య చేశావా లేదా అంటూ ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత మను లేదని చెప్పగా నీ మీద నాకు నమ్మకం ఉందని, నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పుకొస్తుంది. నేను దీన్ని అస్సలే లైట్ తీసుకోనని.. విశ్వంకు చెప్పి పెద్ద పెద్ద లాయర్లను పిలిపిస్తానని అంటుంది. ఆ తర్వాత వసు మాట్లాడుతూ.. ఇంకా రాజీవ్ డెడ్ బాడీ దొరకలేదని, మా బావ రాజీవే కావాలని డ్రామాలు చేసి ఉంటాడని అంటుంది. మను కూడా కాల్చాకా నేను వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చానని అంటాడు.
ఆ తర్వాత పోలీస్ ఎంట్రీ ఇచ్చి ఏంటి మేడమ్ ఇంకా డిస్కషన్లు చేస్తున్నారా అంటాడు. ఇంకా అతడు తప్పు చేయలేదని అనుకుంటున్నారా అంటాడు. డెడ్ బాడీ దొరకలేదని ఆ తప్పు మను చేయలేదన్నారుగా కానీ ఇప్పుడు ఆ మృతదేహం దొరికిందని అంచాడు. అలాగే దాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని కాల్చి బూడిద చేసే ప్రయత్నం చేశారని... అతడి డీఎన్ఏ టెస్ట్ కూడా చేస్తున్నామని అంటాడు. ఇందాక చూపించిన ఆధారాలతో పాటు మరిన్ని ఆధారాలు సేకరించి ఇతడిని కోర్టుకు తీసుకెళ్తానని అంటాడు. ఇక బయటకు వచ్చిన మహేంద్ర ఆ విషయాన్ని అనుపమకు చెబుతాడు. ఏంజెల్ మాట్లాడుతూ.. విశ్వంకు చెప్పి మనును బయటకు తీసుకు వస్తానని అంటుంది. కానీ అనుపమ వద్దని నాన్న చాలా బాధ పడతాడని అంటుంది. ఇంతటితో సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











