Guppedantha Manasu May 23rd: రాజీవ్ తో కాళ్ల బేరానికి శైలేంద్ర.. మరదలితో మను ప్రేమాయణం, నిజం చెప్పనున్న అనుపమ!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర.. కోపంగా తల్లి దేవయాని వద్దకు వచ్చి వసు, మహేంద్ర, మనులు కలిసి తనను మోసం చేశారని చెబుతాడు. ఎండీ సీటు అనే నా బలహీనతను అడ్డం పెట్టుకుని.. రాజీవ్ గాడిని బయటకు రప్పించేలా చేశారని అంటాడు. అలాగే వాడిని నా చేతులతో నేనే పోలీసులకు అప్పగించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు నీవు వాళ్లని ఎలా నమ్మావురా అంటూ దేవయాని అనగా.. గతంలో జరిగిన విషయాన్ని చెబుతాడు. తనను వాళ్లు ఎలా ఏమార్చారనేది చెప్పుకొస్తాడు. ముఖ్యంగా రాజీవ్ వద్దకు వెళ్లడం, పోలీసులకు అప్పగించడం, వసు, మనులు తనను మోసం చేయడం వరకు చక్కగా వివరిస్తాడు. ఇదంతా విన్న దేవయాని ఫైర్ అవుతుంది.
ముఖ్యంగా నువ్వేంట్రా నా కడుపున చెడ పుట్టావంటూ.. వాళ్లను దెబ్బ కొట్టాల్సిన నువ్వు, వాళ్లచేత నువ్వు దెబ్బ కొట్టించుకోవడం ఏంటంటూ మరింత ఫైర్ అవుతుంది. ఇంత జరుగుతున్నా నాకు ఒక్క విషయం కూడా ఎందుకు చెప్పలేదని నిలదీస్తుంది. సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుని నీకు చెప్పలేదనగా.. షాక్ ఇచ్చావని దేవయాని అంటుంది. అప్పుడే ధరణి ఎంట్రీ ఇచ్చి షాక్ ఏంటని అడుగుతుంది. ఏదో జరిగింది చెప్పండి అంటూ పదే పదే అడుగుతుంది. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావని ఫణీంద్ర అనగా.. కాఫీ, టీ కావాలా అని అడిగేందుకు వచ్చానంటుంది. అయితే ఏదో నాకు కాఫీ, అమ్మకు టీ తీసుకురా అనగా.. ఇద్దరికీ ఒకటే తెస్తానంటాడు. అలా కుదరదనగా.. నీ ఇష్టం వచ్చింది తేవచ్చుగా అనగా.. అసలు తేవాలా వద్దా అని అడగడానికి వచ్చినట్లు వివరిస్తాడు.

ఆ తర్వాత దేవయాని.. రాజీవ్ ను నువ్వే పంపించినట్లు వాడికి తెలుసా అని అడుగుతుంది. ఏమో నాకు తెలియదు అనగానే.. త్వరగా వెళ్లి తెలుసుకో.. వాడి చాలా డేంజరస్ అని అంటుంది. వాడు నీపై పగ పడితే చాలా కష్టం అవుతుందంటూ వివరిస్తుంది. ఇక ఆ తర్వాత ఏంజెల్ మనుకు ఫోన్ చేస్తుంది. హలో అనగానే మీరెవరు అని అంటాడు. నా నంబర్ గుర్తు పట్టలేదా, నా వాయిస్ గుర్తు పట్టలేదా అంటూ అంటుంది. దీంతో మను ఫోన్ పెట్టేస్తాడు. నువ్వు కట్ చేస్తే నేను వదులుతానా అంటూ ఏంజెల్ మరోసారి ఫోన్ చేస్తుంది. దీంతో వెంటనే మీకేం కావాలి అనగా.. మీరే కావాలి అని అంటుంది. మీరు నన్ను గుర్తు పట్టలేదా.. అలిగాను, బుంగమూతి పెట్టానంటూ చెప్పుకొస్తుంది. మీరెవరో తెలియకుండా.. నాపై కోప్పడడం ఏంటంటూ మను అనగా.. నేను ఏంజెల్ అని చెబుతుంది.
ఓ నువ్వా ఎందుకు ఫోన్ చేశావని మను అంటాడు. ఎెవరైనా ఫోన్ చేస్తే క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు గానీ.. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావంటూ ఫైర్ అవుతుంది. అయినా మను మాత్రం ఏంటి చెప్పు అంటాడు. కలుద్దాం అనగా.. వద్దని ఫోన్ కట్ చేస్తాడు. కానీ ఏంజెల్ మెసేజ్ పెడుతుంది. నువ్వేమైనా చేసుకో నేను నీతో మాట్లాడాలి, కలవాలి రా.. వెయిట్ చేస్తున్నానంటూ మెసేజ్ పెట్టగా.. మను చూస్తాడు. ఆ తర్వాత వసు అనుపమ వద్దకు వస్తుంది. మను తన తండ్రి గురించి అస్సలు మర్చిపోయే రకం కాదని అంటుంది. అప్పుడే అనుపమ నేనేం చేయాలంటుంది. కానీ వసు మాత్రం మీ బాధ నేను అర్థం చేసుకోగలను.. మను తన తండ్రి ఎవరో తెలుసుకుంటే సమస్య వస్తుందని.. మీరే చెబితే ఎలాంటి సమస్య రాదని చెప్పుకొస్తుంది.

నేను సమాధానం చెప్పడం వల్ల మను మనసులో తండ్రిపై ఏమైనా కోపం పోతుందా అని అడుగుతుంది. పోతుంది అయితే చెప్పాల్సిన రీతిలో చెప్పాలని, పూర్తిగా విషయం అర్థం అయ్యేలా వివరించాలని అంటుంది. ఎందుకు మీరు నిజాన్ని దాచి అందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నారని అంటుంది. అప్పుడే అటు వైపు నుంచి వచ్చిన మహేంద్ర.. ఏంటా నిజం అని అడుగుతాడు. ఏ నిజం వసుధార అంటూ ప్రశ్నిస్తాడు. మను తండ్రి గురించి చెప్పమంటున్నాననగా.. మహేంద్ర అని కూడా మాట్లాడారు ఏంటని అంటాడు. లేదు మీకలా ఎలా వినిపిస్తుందని వసు అంటుంది. అయినా నువ్వు అడిగినంత మాత్రానా ఏమైనా చెప్పిందా అంటూ మహేంద్ర అంటాడు. మనం ఎంత అడిగినా, మను ఎంత ఏడ్చినా ఈమె సమాధానం చెప్పదని అంటాడు. అనుపమ మనసు మారదు, ఆమె నిజం చెప్పదంటూ వివరిస్తాడు.

అన్నింటిని మనసులో దాచుకున్న బాధ పడుతుందే తప్ప నిజం మాత్రం చెప్పదని అంటాడు. మనునే ఏదో ఒక రోజు కనుక్కుంటాడు లే అంటూ మహేంద్ర చెబుతాడు. మనుకు తండ్రిపై ఉన్న కోపం, ద్వేషం నాకు తెలుసని.. తనలో ఓ అగ్ని పర్వతం ఉందని.. తన తండ్రి ఎవరో తెలుసుకున్న రోజున వాడిని మను చంపేస్తాడంటూ మహేంద్ర అంటాడు. ఇదంతా విన్న వసు, అనుపమలు.... వద్దు ఆగు అంటారు. అలా మాట్లాడొద్దని చెబుతారు. వాడెవడో చస్తే మీకేంటి సమస్య అంటూ మహేంద్ర అంటాడు. అయినా తల్లి, కొడుకులను వదిలి ఎక్కడికో దూరంగా వెళ్లిపోయిన వాడి గురించి మీరెందుకు టెన్షన్ పడుతున్నారంటూ చెప్పుకొస్తాడు. కానీ నువ్వు మాత్రం అనుపమను ఎంత అడిగినా వేస్ట్ అంటూ వివరిస్తాడు. వసు మాత్రం మనుకు మీరే నిజం చెప్పడం మంచిదని.. వివరిస్తుంది.

ఇక ఆ తర్వాత మను ఓ చోట కారు ఆపుకుని నిలబడతాడు. అప్పుడే అక్కడకు ఏంజెల్ వస్తుంది. బౌ అనగా.. మను సీరియస్ గా చూస్తాడు. అయినా నీకు రంగు, రుచి, వాసన, భయం వంటివి ఏం ఉండవా అని అడుగుతుంది. ఏంటో చెప్పు నేను వెళ్లాలి అంటూ ఫైర్ అవుతాడు. కానీ ఏంజెల్ మాత్రం నీకెందుకు అంత కోపం అని అనగా.. మాములుగానే ఇలా ఉన్నానంటూ చెప్పుకొస్తాడు. ఏసలు నీ బాధ ఏంటనగా.. నువ్వే నా బాధ అంటూ ఏంజెల్ కామెంట్లు చేస్తుంది.


Click it and Unblock the Notifications











