Guppedantha Manasu May 6th: ఎండీగా శైలేంద్ర.. కానీ ఓ షరతు.. వసుకు సాయంగా ధరణి!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఈక్రమంలోనే అందరూ కలిసి శైలేంద్రకు ఎండీ బాధ్యతలు అప్పగించాలని చూస్తారు. అయితే వసు మాత్రం మను వస్తేనే ఆయన అనుమతి ఉంటేనే ఇది జరుగుతుందని.. కాలేజీకి ఆయన మొత్తం 50 కోట్ల అప్పు ఉందని చెబుతుంది. ఫణీంద్ర కూడా మను వస్తేనే శైలేంద్రకు ఎండీ పదవి దక్కుతుందని అంటాడు. మరి జైల్లో ఉన్న అతడు ఎలా బయటకు వస్తాడని శైలేంద్ర అనగా.. వసు మేడమ్ అతడిని ఎలాగోలా బయటకు తీసుకు వస్తారని బోర్డు మెంబర్ చెప్పగా మీటింగ్ అయిపోయిందని చెప్పి వసు వెళ్లిపోతుంది.
ఇక ఆ తర్వాత అనుపమ, మహేంద్ర, వసులు కనిపిస్తారు. ఏంజెల్ ఫోన్ చేసి అనుపమను రమ్మంటుందని.. వెళ్తే బాగుంటుందని కూడా వసు అంటుంది. కానీ అనుపమ మాత్రం ఎక్కడున్నా అంతే, ఒంటరిదాన్నే కదా అంటుంది. వెళ్లనని చెబుతుంది. మనును బయటకు తీసుకువచ్చే వరకు మీరు ఇక్కడ ఉండడమే బెటర అని అంటుంది. అలాగే మహేంద్రతో కూడా మీ కొడుకును మీరే బయటకు తీసుకు రావాలి మామయ్యా.. మనును బయటకు తీసుకు వచ్చేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవన్నీ మనం వెతకాలని అంటుంది. ఇక ఆ తర్వాత శైలేంద్ర, దేవయానిలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. నన్ను ఎండీ చేయడం మాత్రం నాకు డౌట్ గా అనిపిస్తుందని శైలేంద్ర అనగా.. దేవయాని మనలా వాళ్లు అబద్ధాలు చెప్పరని అంటుంది.

మహేంద్ర, వసులు మాట ఇస్తే కచ్చితంగా చేస్తారని.. ముఖ్యంగా బోర్డు మీటింగ్ కూడా పెట్టి చెప్పారంటే అది నిజమేనని అంటుంది. కానీ మనును బయటకు ఎలా తీసుకురావాలి అంటూ అనగా.. వాడిని తీసుకురావడం చాలా సులువు అంటూ అంటుంది. వాడేమైనా బతికే ఉన్నాడా అంటూ దేవయాని అడగ్గా.. లేదంటూనే చెప్పుకొచ్చాడు శైలేంద్ర. అయితే వాళ్లు వెళ్లగానే ధరణి అక్కడకు వచ్చి వారి మాటలను రికార్డు చేస్తుంది. ముఖ్యంగా.. దాన్ని వసుకు కూడా పంపుతుంది. ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్లు మాట్లాడుకున్నప్పుడు రాజీవ్ బతికి ఉన్నాడనే మాట మాత్రం బయటకు రాలేదని అంటుంది. అదంతా విన్న వసుధార శేలంద్రకు రాజీవ్ గురించి తెలిసే ఉంటుందని అంటుంది.
అంతోలనే శైలేంద్ర వచ్చి ధరణిని గమనిస్తాడు. పిలుస్తాడు. వసుతో ఫోన్ మాట్లాడుతున్న.. ధరణి భయంతో వణికిపోతుంది. ఏమైందని అనగా ఏంలేదని కాఫీ పెడుతున్నానని చెబుతుంది. ఫోన్ మాట్లాడుతున్నావా అంటే లేదని చెప్పగానే శైలేంద్ర వెళ్లిపోతాడు. ఈ విషయం వసుకు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ధరణి. ఆ తర్వాత శైలేంద్రను మహేంద్ర ఫాలో అవుతూ కనిపిస్తాడు. అది గుర్తించిన శైలేంద్ర.. మహేంద్రను ఆపి నన్ను ఫాలో చేస్తున్నారా అంటాడు. కారులో వచ్చే మీరు ఇలా బండిపై ఏంటని అడుగుతాడు. నా ఇష్టం.. ప్రకృతి అందాలు చూసేందుకు వచ్చానంటూ వివరిస్తాడు. రాజీవ్ బతికే ఉన్నాడని అనిపిస్తుందని.. అయినా ఈ రాత్రి పూట నువ్వు ఇక్కడ ఏంటంటూ ప్రశ్నిస్తాడు.

అంతలోనే రాజీవ్ అక్కడకు రావడం చూసి శైలేంద్ర వణికిపోతాడు. అది గుర్తించిన మహేంద్ర ఏమైందని అంటాడు. రాజీవ్ ను చూస్తున్నావా అంటూ అడుగుతాడు. అంతలోనే రాజీవ్ దాక్కోవడం.. మహేంద్ర వెతికి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత శైలేంద్ర రాజీవ్ ను వెతుక్కుంటూ రాగా.. రాజీవ్ వచ్చి అతడిపై చేయి వేస్తాడు. నిన్ను చంపేస్తే అయిపోయేదని.. నిన్ను బయట తిరగొద్దని చెబితే ఇలా ఎందుకు తిరుగుతున్నావంటూ ప్రశ్నిస్తాడు. అయినా మీ బాబాయ్ వచ్చాడంటే నీ మీద అనుమానం వచ్చే వచ్చి ఉంటాడని రాజీవ్ అంటాడు. కొన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా ఉంటే బాగుండేది కదా అనగా.. వసును చూడకుండా అస్సలే ఉండలేనని అంటాడు. నువ్విలాగే చేస్తే వసు నీకు శాశ్వతంగా దూరం అవుతుంది.. కొన్నాళ్లు దూరంగా ఉండు అంటూ చెప్పుకొస్తాడు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications











