Guppedantha Manasu March 9th: రాత్రికి రాత్రే మారిపోయిన పోస్టర్లు.. ఇదంతా చేసిందెవరంటే?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో అదిరిపోటే ట్విస్ట్ లు ఇస్తున్నారు. నిన్నటి వరకు వసు, మనుల పోస్టర్ లు అతికించారనుకోగా.. ఈరోజు మాత్రం వసు హ్యాపీ బర్త్ డే పోస్టర్లను చూపించారు. ముఖ్యంగా అక్కడకు వసుధార వెళ్లే సరికి తనకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అంటూ రాసుకొచ్చిన పోస్టర్లను చూపిస్తారు. ఇక ఆ తర్వాత ధరణి, శైలేంద్రలు కాలేజీ వద్దకు వస్తారు. ముఖ్యంగా నువ్వు వళ్లి చూడుపో.. అక్కడో పెద్ద సర్ ప్రైజ్ ఉందంటూ శైలేంద్ర పంపిస్తాడు.

కొత్త ప్రేమజంట నుంచి హ్యాపీ బర్త్ డే..

ముఖ్యంగా అక్కడకు వెళ్లి చూసే సరికి వసుధార అందమైన ఫొటోతో పాటు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే వసుధార అంటూ రాసుకొచ్చిన పోస్టర్ కనిపిస్తుంది. అది చూసి ధరణి చాలా సంతోషంగా ఫీల్ అయి శైలేంద్రను చూడగా.. ఇదేంటీ ఎలాంటి ఎక్స్ ప్రెషన్లు ఇవ్వట్లేదని లోపలికి వచ్చి పోస్ట్రలు చూస్తాడు. కానీ అవి చూసి షాక్ కు గురవుతాడు. అంతోలనే విద్యార్థులు అంతా అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే మేడమ్ అంటూ చెప్పుకొస్తారు. అంతలోనే మహేంద్ర వసు నీకిలాంటి నచ్చవని తెలుసు.. ఇదంతా ఎవరు చేశారో నేను తెలుసుకుంటానని చెప్పగానే అంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Vasudhara And Manu Big Shock to Shailendra on Guppedantha Manasu March 9th 2024 Episode 1020

రాత్రికి రాత్రే మారిపోయిన పోస్టర్లు..

ఆ తర్వాత శైలేంద్ర.. రాజీవ్ కు ఫోన్ చేస్తాడు. ఇంతలోనే వసు పరువు పోయిందా.. మను ఫేస్ మాడిపోయిందా అంటూ అడగ్గగా.. శైలేంద్ర ఫుల్ ఫైర్ అవుతాడు. ముఖ్యంగా ఇక్కడ నువ్వు వేసిన పోస్టర్లు లేవని.. వేరే పోస్టర్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ మారిపోయాయి అంటూ చెప్పుకొస్తాడు. లోపలికి వస్తాను ఉండు అంటూ రాజీవ్ లోపలికి వస్తాడు. ఆలోపు మనును చూపిస్తారు. మీరే ఆ పోస్టర్లు వేశారని తెలిస్తే వసు మేడమ్ కోప్పడతారు అంటూ అక్కడి లెక్చరర్ అనగా.. మనం ఏం తప్పు చేయలేదుగా ఎందుకు అంటాడు.

మనుకు వసుధార వార్నింగ్..

ఇదంతా విన్న వసుధార వెంటనే వచ్చి వెళ్తున్న మనును ఆపుతుంది. పోస్టర్లు ఎందుకు అతికించారు.. మీ ఇష్టం అనుకుంటున్నారా అంటూ ఫైర్ అవుతుంది. మంచి చేయడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా మేడమ్ అంటూ అనగానే.. బర్త్ డే చేయాల్సిన అవసరం ఏంటని అంటుంది. పోస్టర్లు అంటించడం లీగల్ గా కంప్లైంట్ చేయొచ్చని చెబుతుంది. దానికి నేను కూడా సిద్ధమేనని అనగా.. మీ తప్పు మీరు తెలుసుకోవాలి అంటూ చెప్పుకొస్తాడు. మీ బర్త్ డే, గొప్పతనం, మంచితనం అందరికీ తెలియాలనే ఇలా చేశానంటూ వివరిస్తాడు. మన గురించి మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని అంటుంది.

Vasudhara And Manu Big Shock to Shailendra on Guppedantha Manasu March 9th 2024 Episode 1020

ఇదంతా ఎందుకు చేశారని అనగానే.. మను రిషి సార్ కోసం అని అంటాడు. అది విన్న వసు షాక్ అవుతుంది. రిషి సార్ ఉంటే చేయరా అందుకే నేను కూడా చేశానంటూ మను అంటాడు. దానికి వసు ఫైర్ అయి ఆ పోస్టర్లు తీసేయించండి.. ఇది నా ఆర్డర్ అంటూ చెప్పి వెళ్లిపోతుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మహేంద్ర, అనుపమలు కూడా అలాగే వెళ్లిపోతారు. ఆ తర్వాత శైలేంద్ర.. రాజీవ్ ను పట్టి లాక్కొని వస్తాడు. పోస్టర్లు చూపించి ఇదేంటని ప్రశ్నించగా.. ఏమో భయ్యా నాకు అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొస్తాడు. మంత్రశక్తులు, దుష్టశక్తులు ఏమైనా ఇలా మార్పులు చేశాయా అంటూ అడుగుతాడు.

ఎవరు చేసి ఉంటారు భయ్యయా ఇదంతా అనుకునేలోపే మన వచ్చి.. నేనే చేశాను అంటాడు. దీంతో వీరిద్దరూ షాక్ అయి అటువైపు చూస్తారు. ఇంతలోనే మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటూ శైలేంద్ర అడగ్గా... అబ్బా ఏం యాక్టింగ్, మరీ ఇంత చీప్ ఏంటి మీరు అంటూ ఫైర్ అవుతాడు. అంతలోనే రాజీవ్ నేనే ఫొటోలు తీసి పెట్టాను, పోస్టర్లు అతికించాను... అయితే ఏంటి నీకెలా తెలిసిందంటూ అడుగుతాడు. దానికి నేనేదో వసు బర్త్ డే పోస్టర్ల కోసం షాప్ కు వెళ్లగా.. మీరు కనిపించారు అలా నాకు అంతా మంచే జరిగిందంటూ చెప్పుకొస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X