Guppedantha Manasu March 8th: మను చెంప పగులగొట్టి, ఎండీ పదవికి రిజైన్ చేసిన వసు.. భలే ట్విస్ట్!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో రాజీవ్.. వసుధార, మను ఫొటోలను కాలేజీ మొత్తం అతికించగా.. అందరూ వాటిని చూస్తారు. మహేంద్ర, అనుపమ, వసుధార, శైలేంద్ర, ధరణిలు కూడా వస్తారు. మను రాగానే.. అనపమ ఇదేంటని ప్రశ్నిస్తుంది. నాకేం తెలియదు మేడం అంటూ మను చెప్పగా మీకు తెలియకుండా ఈ ఫొటోలు ఎలా వస్తాయని అంతా ప్రశ్నిస్తారు. ఈక్రమంలోనే.. లెక్చరర్లు అంతా మీ మధ్య ఏదో బంధం ఉందంటూ మాట్లడగా.. వసు ఫైర్ అవుతుంది.
మేము మిషన్ ఎడ్యుకేషన్ గురించి వెళ్లినప్పుడు ఎవరో ఫొటోలు తీసి ఇలా చేశారని వసుధార అంటుంది. ఇలా తప్పుగా మాట్లాడితే ఊరుకోనని అనగా.. లెక్చరర్లు మాత్రం మీదే తప్పంటూ వసు, మనులపై కోప్పడతారు. మీరు విద్యార్థి దశ నుంచి ఎండీగా ఎంత కష్టపడి వచ్చారో మాకు తెలుసంటూనే.. మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటని ఫైర్ అవుతారు. అప్పుడు వసు ఇదంతా అబద్ధం అని చెబుతుంది. కానీ వాళ్లు మాత్రం నమ్మరు. రిషి సార్ సంతాప సభ కూడా జరపనివ్వలేరు.. రిషి మీ ప్రాణం అయితే ఈ బంధం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

ఆ తర్వాత మహేంద్ర... వసుకు రిషి అంటే చచ్చేంత ప్రేమ అని చెబుతాడు. కానీ అంతలోపే లెక్చరర్లు.. రిషి మీద ప్రేమ చచ్చిపోయిందా.. దారి తప్పిందా అంటూ అడుగుతారు. ఆ తర్వాత వసును కార్నర్ చేసి.. మీరు ఈ పొజిషన్ లో ఉండి ఇలా ఎలా చేయగలిగారంటూ అడుగుతారు. ఆ తర్వాత మహేంద్ర అందుకుని.. ఇలా చేసిన వాడిని తీసుకువచ్చి మీ ముందు నిలబెడతాను.. ఇదంతా అబద్ధం అని అంటాడు. కానీ లెక్చరర్లు మాత్రం మేము ఇదే నమ్ముతాం అంచూ చెప్పుకొస్తారు. కష్టాల్లో ఉన్న కాలేజీకి ఆయన సాయం చేయడం చూస్తుంటేనే ఇదంతా నిజం అని అర్థమవుతుందంటూ అంటారు.
రిషి గౌరవాన్ని పోగొట్టి, కాలేజీ కీర్తి ప్రతిష్టలకు భంగం కల్పించారు కదా.. మీరు ఎండీ పదివికి అర్హురాలు కాదంటూ గొడవ చేస్తారు. వెంటనే ఆ పోస్టు నుంచి తప్పుకోవాలని అంటారు. ఆ తర్వాత శైలేంద్ర కూడా మనును తప్పు పడతాడు. చూడు వసు ఎంత బాధపడుతుందో, తనను ఎంతమంది తిడుతున్నారో అంటూ చెప్పుకొస్తాడు. వసు నిప్పు అంటూ వివరిస్తాడు. ఆ తర్వాత నమ్మకాలతో పని లేదని.. అంతా ఈ పోస్టర్ల గురించే మాట్లాడుకుంటున్నారంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత విద్యార్థులు.. ఇది నిజమో కాదో కానీ.. మేడం మీద మచ్చ పడిందంటూ కామెంట్లు చేస్తారు. మను వెంటనే వసుకు సారీ చెబుతాడు.
ఆ తర్వాత వసు కూడా మనుదే తప్పు అనుకుని.. మీరిలా నమ్మకద్రోహం చేస్తారనుకోలేదు అంటూ చెంప పగులగొడుతుంది. ఆ తర్వాత ఎండీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తుంది. మహేంద్ర వద్దని చెప్పినా వినకుండా.. రిషి సార్ గౌరవం కాపాడాలంటే నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అంటూ వివరిస్తుంది. అలాగే ఇంత అవమానం జరిగిన ఈ కాలేజీలో ఒక్క క్షణం కూడా ఉండనంటూ తేల్చి చెబుతుంది. ఇక ఎప్పటికీ అడుగు కూడా పెట్టనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత మను.. శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ధరణి శైలేంద్రపై కోప్పడుతుంది. ఛీ ఇలా చేశారేంటి అనగా... పంతులు వేచి చూస్తున్నారంటూ తీసుకొస్తారు. ఆలోపే శైలేంద్రుకు ఎండీ బాధ్యతలు అప్పగించేందుకు కుర్చీకి పూజలు చేస్తుండగా.. అంతా కోపంగా ఉంటారు. కానీ మంచి జరగాలని కోరుకుని ఈ కుర్చీలో కూర్చో అనగానే శైలేంద్ర నేను సాధించాను సాధించాను అంటూ చెబుతాడు. కానీ ఇదంతా కళగా చూపిస్తారు. అదంతా కళ అని గుర్తించిన శైలేంద్ర కారు ఎందుకు ఆగింది అంటాడు. ఆ తర్వాత పంతులుకు ఫోన్ చేసి ఎండీ సీట్లో కూర్చోవడానికి ముహూర్తం పెట్టమంటూ చెబుతాడు.
ఇంతలోనే ధరణి వసుధారకు ఫోన్ చేయబోతుండాగా.. ఫోన్ లాక్కుంటాడు శైలేంద్ర. ఇక ఆ తర్వాత మహేంద్ర, అనుపమలు పోస్టర్లు చూస్తూ నిలబడతారు. అప్పుడే వసు కూడా వచ్చి ఈ ఆ పోస్టర్లు చూస్తుంది. వెంటనే షాక్ అవుతుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications











