Guppedantha Manasu March 12th : గ్రాండ్‌గా వసు బర్త్ డే.. మనుకు మళ్లీ అవమానం.. మహేంద్ర ఏం చేయబోతున్నాడు?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో అదిరిపోటే ట్విస్ట్ లు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వసుధార రిషి ఫొటో చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అందరూ నేను చేసేది తప్పంటున్నారు.. ఆఖరకు మామయ్య కూడా నేనే తప్పు చేశానంటున్నారంటూ చెప్పొకొస్తుంది. రిషి ఫొటోను తదేకంగా చూస్తూ... మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనుంది సార్ అంటూ తెలుపుతుంది. మీరు మాట్లాడుతుంటే నా మనసు తేలికంగా ఉంటుందని.. మీరు నవ్వినా, కోప్పడినా చాలా అందంగా ఉంటారు సార్ అంటూ వివరిస్తుంది. మీరు నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్నే జయించినట్లు ఉంటుందని వసు చెప్పొకొస్తుంది.

మీరే నా యాంగ్రీ టైగర్, మీరు నా పక్కన లేకుండా నేను నా పుట్టిన రోజు ఎలా చేసుకుంటాను సార్.. మీరు ఎక్కడున్నా త్వరగా రండి సార్, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ చెబుతుంది. ఆ తర్వాత మహేంద్రను చూపిస్తారు. ఆయన తన అన్నయ్యకు ఫోన్ చేసి నీకో విషయం చెప్పాలని అంటాడు. ఏంటని అడగ్గా.. రేపు వసు బర్త్ డే, రేపు కాలేజీలో వసు బర్త్ డేకు మను ఏర్పాట్లు చేస్తున్నాడని అంటాడు. మరి వసు ఒప్పుకుందా అని అనగానే.. లేదు ఒప్పించాలి, కానీ అంతా తన సంతోషం కోసమే అంటాడు. నువ్వు రావాలి అన్నయ్యా అనగానే కచ్చితంగా వస్తాను, నువ్వు చెప్పాక రాకుండా ఉంటానా అంటాడు.

Vasudhara Birth Day Grand Celebrations on Guppedantha Manasu March 12th 2024 Episode 1022

తాను మాత్రమే కాకుండా.. భార్య దేవయాని, శైలేంద్ర, ధరణిలను కూడా తీసుకు వస్తానని చెబుతాడు. ఆ తర్వత దేవయాణితో పాటు కొడుకు, కోడల్ని పిలిచి.. దేవయానిక ఓ విషయం చెబుతాడు. నీకు మను తెలుసు కదా.. ఆయన రేపు వసు బర్త్ డేను కాలేజీలో సెలబ్రేట్ చేస్తున్నాడట అంటాడు. శైలేంద్ర షాక్ అవ్వగా... మను మంచి పని చేస్తున్నాడు కదా మామయ్యా అంటూ ధరణి అంటుంది. ఆ తర్వాత మనందరం రేపు వసు పుట్టిన రోజు కోసం త్వరగా కాలేజీకి వెళ్లాలని అంటాడు. శైలేంద్ర, దేవయానిలు రామని అంటారు. ఎందుకు రారు కారణం చెప్పండి అంటాడు.

ఏంటి నోరు విప్పరు.. కాలేజీలో ఏ ఫంక్షన్ ఉన్నా వెంటనే పరిగెత్తుకొస్తానంటావు కానీ దీనికి ఎందుకు రారని నిలదీస్తాడు. ఆ తర్వాత దేవయాని.. రిషి కనిపించట్లేదు వసు బర్త్ డే ఎలా జరుపుకుంటుందని అంటుంది. తల్లీ, కొడుకుల ఇద్దరిపై ఆయన ఫైర్ అవుతాడు. దగ్గరుండి నీవు చేయాల్సిన బర్త్ డేను అతను చేస్తున్నాడు... రేపు మనం కచ్చితంగా వెళ్లాలి, రానంటే నేను ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు. అత్తయ్య గారు మామయ్య గారు చెప్పారుగా.. మీరు రేపు కచ్చితంగా కాలేజీకి రావాల్సిందేనని ధరణి అనగా.. నువ్వు కిచెన్ కు వెళ్లి నీ పని చూస్కో ఉంటుంది.

ఆ తర్వాత కాలేజీకి వసు వస్తూ కనిపిస్తుంది. ఈక్రమంలోనే ఓ విద్యార్థి పరిగెత్తుకుంటూ వచ్చి క్లాస్ రూంలో స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారని చెప్పగా... వసు పరిగెత్తుకుంటూ వస్తుంది. కొట్టుకునే వాళ్లను ఆగండి అంటూ చెప్పగా.. బర్త్ డే సర్ ప్రైజ్ ఇస్తారు. హ్యాపీ బర్త్ డే, హ్యాపీ బర్త్ డే అని చెబుతారు. కానీ వసు మాత్రం స్టాపిడ్ అంటూ ఫైర్ అవుతుంది. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఇవన్నీ అంటూ తిడుతుంది. విద్యార్థులు మాత్రం నోరు మెదపరు. మీరు చెప్పకపోయినా ఎరు ఇలా చేయించారో నాకు తెల్సంటూ బయటకు వస్తుంది.

ఈలోగానే మను ఫోన్ మాట్లాడుతూ కనిపించగా.. వసు ఫైర్ అవుతుంది. ఎందుకు నాకు బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నారు, సర్ ప్రైజ్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారంటూ అంటుంది. ఆ తర్వాత మీరు చేసే పనులు చూస్తే మీతో మాట్లాడాలంటేనే చిరాకేస్తుందని.. నతకు ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగినా.. రిషి సార్ సమక్షంలో మాత్రమే జరగాలంటూ చెప్పుకొచ్చింది. స్టూడెంట్స్ తో బర్త్ డే సెలబ్రేట్ చేయించారని అంటుంది. మీలో ఏదో దురుద్దేశం ఉంది అందుకే ఈ కాలేజీకి వచ్చారంటూ చెప్పుకొస్తుంది. నా గురించి తెలియకే పోస్టర్లు వేయించారనుకున్నాను.. కానీ చెప్పాకా కూడా ఇలా చేస్తున్నారంటే ఎండీ సీట్ కోసమే ఇలా చేస్తున్నారని నాకర్థం అవుతుందంటూ చెప్పుకొస్తుంది.

ఆ తర్వాత అనుపమ మహేంద్రతో మాట్లాడుతూ.. మనుకు అవమానం జరిగిందని వివిరిస్తుంది. ఈక్రమంలోనే మీరిద్దరి మధ్య బంధం ఏంటని.. మనుకు నీకేం సంబంధం ఉందని అంటాడు. కానీ ఆ తర్వాత వసు గురించి చెబుతూ... జగతి చనిపోయాకా ఆ బాధ నుంచి నన్ను బయటకు తీసుకు వచ్చేందుకు రిషి, వసు ఇలాగే చేశారని, ఇప్పుడు మనుతో నేను చేయిస్తున్నానంటూ తెలిపింది. వసు మనసు మారి మనుకు థాంక్స్ కూడా చెబుతుందని అంటాడు.

ఆ తర్వాత వసును చూపిస్తారు. వెంటనే విద్యార్థులు వచ్చి సారీ మేడమ్ అనగా.. ఇది మా ప్లాన్ మేడమ్ అంటూ చెప్పుకొస్తారు. మేమే సోషల్ మీడియాలో రీల్స్ చూసి కావాలని మేమే చేశామని అంటారు. ఆ తర్వాత నేనే తప్పుగా చేశానా అంటూ మనుకు సారీ చెప్పాలనుకుంటుంది. వెంటనే అతడి వద్దకు వచ్చి సారీ చెబుతుంది. మీకు తెలియకుండా అన్నారుగా పర్లేదని అంటాడు. రిషి సార్ చేసే పనులు నేను చేస్తున్నానని మీకు కోపం వస్తుంది... కానీనాకు మీ వల్ల ఎలాంటి సమస్యా రాదంటూ వివరిస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X