Guppedantha Manasu March 29th: అనుపమ సీక్రెట్స్ తెలుసుకున్న దేవయాని.. అందరికీ తెలిసేలా చేస్తారా?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో.. మహేంద్ర అనుపమను.. మను ఉన్నాడనే నీకు ఆకలి లేదా అని అడుగుతాడు. తనేం చప్పుడు చేయకపోగా మౌనం అంగీకారం అంటారు మామయ్యా.. మను మనతో తింటే ఆమెకు ఏం ప్రాబ్లమ్ లేదని వసు అంటుంది. ఆ తర్వాత మీరు ఫ్రెష్ అయి రండి మేడమ్ అని చెప్పి వాళ్లంతా వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత అంతా తినేందుకు కూర్చుంటారు. మను వచ్చి కూర్చోబోతుండగా.. ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అని ఏంజెల్ అంటుంది. అక్కడ కూర్చోనివ్వదు. అలాగే పక్క ఛైర్ లో కూర్చునేందుకు వెళ్తే అనుపమ పక్క ఛైర్ లో కూర్చోమని చెబుతుంది.

అలా మను వచ్చి తల్లి పక్కనున్న కుర్చీలో కూర్చుంటాడు. ఇక ఆ తర్వాత వసు, ఏంజెల్ కూడా కార్చోగా.. అనుపమకు ఆ కర్రీ వడ్డించండి అని వసు చెబుతుంది. అలా కర్రీ వేయగానే ఆమె తినడం ప్రారంభిస్తుంది. అలా అంతా కలిసి భోజనం చేస్తారు. అత్తయ్యా కర్రీస్ చాలా బాగున్నాయ్ కదా అని అడగుతుంది ఏంజెల్. బాగున్నా మీరిప్పుడు ఏం చెప్పలేరులే అంటూ అనేస్తుంది. ఆ తర్వాత మను నీ ఫేవరెట్ కర్రీ ఏంటని అనగా.. అనుపమ గుత్తి వంకాయ అని చెబుతుంది. పప్పుచారు, ఆలు ఫ్రై కూడా ఇష్టమేనని అంటుంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు చెప్పాడు కదా అని అనుపమ అనగానే.. మహేంద్ర అప్పుడు కూడా నువ్వే చెప్పావని అంటుంది.

Vasudhara Fight With Anupama For Manu on Guppedantha Manasu March 29th 2024 Episode 1037

ఇక ఆ తర్వాత నీకిష్టమైన కర్రీస్ ఏంటి అత్తయ్యా అనగా.. మను కాకరకాయ ఫ్రై, బీరకాయ, పప్పుచారు, వీటితో పాటు అప్పడాలు అని చెబుతాడు. ఇది చూసి వసు, మహేంద్ర, ఏంజెల్ లు నవ్వుకుంటారు. కొంతమంది మాత్రం పాపం ఒంటరిగా తింటారు, మరికొంత మందికి మాత్రం అందరూ ఉన్నా ఒంటరిగా తినాల్సి వస్తుందని చెబుతాడు. ఇదంతా విన్న అనుపమ బాధ పడుతుంది. ఆ తర్వాత ఏంజెల్ వసును మనం ఒక ఫొటో తీసుకుందామా అని అడుగుతుంది. అనుపమ వద్దు అనగా.. వదిలెయ్ ఏంజెల్ అని మను అంటాడు. కానీ మహేంద్ర మాత్రం ఎందుకిష్టం లేదని చెప్పి, నువ్వు సరిగ్గా రెడీ అవ్వలేదనా అంటాడు.

ఆ తర్వాత ఏంజెల్ ప్లీజ్ అత్తయ్యా అంటూ సెల్ఫీ తీస్తుంది. కాస్త నవ్వు అంటూ అనగా.. అనుపమ నవ్వుతుంది. ఫొటోలో మీరు కట్ అవుతున్నారు అత్తయ్య పక్కగా జరగండి అనగా.. తల్లికి దగ్గరగా జరుగుతాడు మను. ఇలా ఫొటో తీసుకుంటారు. ఆ తర్వాత అనుపమకు పొలమారగా.. మను తలపై కొడుతూ నీళ్లు తాగిస్తాడు. ఇలా అంతా కలిసి భోజనం చేశాకా ఓ చోట కూర్చుంటారు. అప్పుడే మను వచ్చి నేను వెళ్తాననగా.. ఈరోజు ఇక్కడే ఉండమని మహేంద్ర అంటాడు. నేను వెళ్తానని అనగా.. వద్దని అంటారు. కానీ మను మాత్రం కచ్చితంగా వెళ్తాననగానే.. నీకు రావాలనిపించినప్పుడు రా, ఎవరో ఏదో అనుకుంటారని రాకుండా ఉండొద్దు అంటూ చెబుతాడు.

Vasudhara Fight With Anupama For Manu on Guppedantha Manasu March 29th 2024 Episode 1037

ఆ తర్వాత వెళ్తాను అంటూ మను అనగా.. వెళ్తాను కాదు వెళ్లొస్తాను అనాలి అంటూ ఏంజెల్ అంటుంది. ఆ తర్వాత మీ అత్తయ్యను రూంలోకి తీసుకెళ్లు, మెడిసిన్స్ అవీ ఇవ్వాలి కదా అంటాడు. అక్కడే ఉండి ఇదంతా విన్న మను ఒక్కసారిగా అక్కడే ఆగిపోతాడు. అలాగే వసు తనకు ఫోన్ చేసిన విషయం గుర్తుకు వచ్చి మళ్లీ ఇంట్లోకి వస్తాడు. ఏంటి మేడమ్ ఫోన్ చేశారు ఏదో మాట్లాడాలని అనగా.. అవును మాట్లాడాలి కచ్చితంగా అంటుంది. మీరు కాలేజీకి రండి అని వసు అడుగుతుంది. కానీ మను మాత్రం నా మనసుకు గాయం అయింది నేను రాలేనంటాడు. ఇప్పుడు కూడా మీరు నన్ను అపార్ధం చేసుకోరని అర్థం ఏంటని అంటాడు.

నేను కాలేజీకి రావొద్దని చెప్పింది అనుపమ మేడమ్.. ఆమె చెప్పిన పని ఏది నేను పాటించకుండా ఉండనని అంటాడు. అంటే మేడమ్ ను ఒప్పిస్తే వస్తారా అనగా.. ఆమెకు ఇష్టం లేకుండా, బలవంతంగా చేస్తే నేను సరిగ్గా పని చేసుకోలేనని చెబుతాడు. పదే పదే నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోలేనని, ఆ అవసరం కూడా నాకు లేదంటూ వివరిస్తాడు. మరోవైపు దేవయానిని చూపిస్తారు. తాను అనుపమతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శైలేంద్ర రాగా.. ఏం ఆలోచిస్తున్నావ్ అమ్మా అంటాడు. నా లెక్క ప్రకారం మనుకు ఆయన తండ్రి ఎవరో తెలియదని.. అందుకే వారిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని చెబుతుంది.

తండ్రి గురించి కొడుక్కి తెలిస్తే ఏదైనా పెద్ద సమస్య వస్తుందని అనుపమ చెప్పకుండా ఉండి ఉంటుందని.. దేవయాని అంటుంది. తండ్రి గురించి మను చిన్నప్పుడు అడక్కుండా ఉండడంతో వారిద్దరూ అప్పుడు కలిసి ఉండొచ్చని.. కానీ ఇప్పుడు మను తండ్రి గురించి తెలుసుకోవాలని అడగ్గా.. ఆమె గొడవపడొచ్చు అని అంచనా వేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X