Guppedantha Manasu May 4th: మను కోసం ఎండీ పదవిని వదులుకున్న వసు.. నెరవేరిన శైలేంద్ర కళ!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర, రాజీవ్ లు కలిసి కనిపిస్తారు. వారి దృష్టిలో నువ్వు చనిపోయావు కాబట్టి కొన్నాళ్లకు వారికి దూరంగా ఉండమని శైలేంద్ర చెబుతాడు. కానీ రాజీవ్ మాత్రం తన మరదలిని చూడకుండా ఉండలేనని చెబుతాడు. నిజంగానే చనిపోతే దెయ్యం అయి వస్తానని అలాంటిది బతికుండగా దూరంగా ఎలా ఉండగలనంటూ అంటాడు. వాళ్లకు ఎందుకు కనిపిస్తున్నావంటూ శైలేంద్ర ఫైర్ అవ్వగా.. ఫర్వాలేదు బ్రో ఏం కాదంటూ చెబుతాడు. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే మన జీవితాలే పాడవుతాయని అంటాడు. భయపడకు అంటూ రాజీవ్ చెప్పగా.. కొన్నాళ్లు ఓపిక పట్టు బయట ఉంటే ఎవరైనా పట్టుకుంటారని చెబుతాడు. నువ్వు బయటకు వస్తే ఏం చేస్తానో నాకే తెలియదిన అంటాడు.
నువ్వు అండర్ గ్రౌండ్ లోనే ఉండాలంటే ఏం కావాలి అనగా.. నా మరదలు అంటూ చెబుతాడు రాజీవ్. అంతలోనే వసు శైలేంద్రకు ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయమని రాజీవ్ చెప్పగా.. వెంనటే ఆన్ చేస్తాడు. ఎక్కడున్నావు అని వసు అడగ్గా నేను చెప్పను అంటాడు. రెస్పెక్ట్ తగ్గిందని మళ్లీ అడగాలనగా.. శైలేంద్రగారు ఎక్కడున్నారు అని అంటుంది. శైలేంద్ర మాత్రం ఎక్కడున్నాడో చెప్పాడు. కాలేజీకి రమ్మని, డైరెక్ర్ గా మాట్లాడాలని అంటుంది. వెంటనే ఫోన్ కట్ చేయగా.. ఏమైందని శైలేంద్ర భయపడతాడు. ఈ డిస్కషన్ వల్ల ఏం యూజ్ లేదని.. వెంటనే నువ్వు కాలేజీకి వెళ్లు అని రాజీవ్ చెబుతాడు.

అలా కాలేజీకి వస్తాడు శైలేంద్ర. అంతలోనే వసు, మహేంద్రలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. కావాలనే మహేంద్ర బోర్డు మెంబర్ పదవి నుంచి తప్పుకుంటానని అంటాడు. అలాగే అసలు ఈ మను అలా చేస్తాడని అనుకోలేదని, అయినా ఓ మనిషిని చంపడం ఏంటంటూ వసుతో మాట్లాడతాడు. అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని... 50 కోట్ల చెక్ ఇస్తే మంచోడనుకున్నా, మంచిగా ఉంటే నా కొడుకుగా దత్తత తీసుకోవాలనుకున్నానని అంటాడు. ఆ తర్వాత వసు కూడా నేను ఎండీ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అంటుంది. ఆ సమస్యల మధ్య కాలేజీని చూసుకోలేనని అంటుంది. పక్కనే ఉండి ఇదంతా వింటున్న శైలేంద్ర.. నిజంగానే ఇలా చేస్తున్నారా, నన్ను ట్రాప్ చేస్తున్నారా అంటూ అనుకుంటాడు.
అంతలోనే వసు మరోసారి ఫోన్ చేసి అడగ్గా.. వస్తున్నానంటాడు. లోపలికి రమ్మని వసు చెబుతుంది. మీరు కూడా ఇక్కడే ఉన్నారా బాబాయ్ అంటూ శేలేంద్ర అనగా అవనంటాడు. ఆ తర్వాత వసు ఎండీ పదవి నుంచి తాను తప్పుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది. నిజమేనా, జోకా అంటూ అనగా.. నిజమేనని అంటుంది. అలాగే మనును బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని.. అందుకే ఈ పదవికి న్యాయం చేయలేకపోతున్నామంటూ వివరిస్తుంది. ఇదంతా విన్న శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నమ్మాడా అని వసు తన మామయ్య మహేంద్రను అడడ్గా.. నమ్మే ఉంటాడని.. ఇక నుంచి మన ఫోకస్ అంతా వీడిపైనే ఉండాలని చెబుతాడు.

ఆ తర్వాత బయటకు వచ్చిన శైలేంద్ర ఇదంతా నిజమా, అబద్ధమా అని అనుకుంటాడు. నిజమేనని చెబుతాడు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ ఉందని అటెండర్ వచ్చి చెప్పగా.. శైలేంద్ర మీటింగ్ కు వెళ్తాడు. అప్పటికే ఫణీంద్ర సహా అనేక మంది అకక్డ ఉంటారు. ఈక్రమంలోనే వసు మాట్లాడుతూ.. తాను ఈ ఎండీ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నట్లు చెబుతుంది. ఫణీంద్ర షాక్ అవుతాడు. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అంటూనే ఏదైనా సమస్య ఉంటే చెప్పమని అంటాడు. ఏం లేదని చెబుతూనే.. ఎండీ సీట్లో కూర్చోనని వసు తేల్చి చెబుతుంది. నువ్వు కూడా ఈ పదవి నుంచి తప్పుకుంటే ఆ సీట్లో ఎవరు కూర్చుంటారని ఫణీంద్ర అడగ్గా.. ఓ వ్యక్తి శైలేంద్ర సార్ ఉన్నాడు కదా అంటారు.
శైలేంద్ర సార్ ను ఎండీ సీట్లోనా అంటూ వసు అనగా.. మరో వ్యక్తి మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లనే కూర్చోబెట్టాలి కదా అంటూ శైలేంద్రనే మిగిలారంటూ వివరిస్తాడు. ఇక చేసేదేం లేదు కదా అలాగే కానివ్వండి అంటూ ఫణీంద్ర చెబుతాడు. దీంతో శైలేంద్ర లోలోపలే తెగ మురిసోపాతాడు. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











