Guppedantha Manasu April 24th: మహేంద్రను కాల్చేసిన మను.. భయంలో వసు, అనుపమ!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వసు.. మనుయే తన మామయ్య కొడుకు అయితే అనుపమ, మహేంద్రల మధ్య బంధం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. అంతోలనే ఏంజెల్ ఫోన్ చేయగా.. మాట్లాడుతుంది. మనును మహేంద్ర దత్తత తీసుకోవడం ఏంటని అనగా.. ఇంటికి రా మాట్లాడుకుందామని వసు చెబుతుంది. కానీ ఏంజెల్ మాత్రం తన తాతయ్య విశ్వానికి అదంతా ఇష్టం లేదని అందుకే తాను కూడా రానని చెప్పేస్తుంది. ఏమున్నా తర్వాతే మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేస్తుంది. అంతోలనే వసు తన ఫోన్ లో రిషి ఫొటో చూస్తూ... తన మామయ్యకు అసలు విషయం చెప్పే ధైర్యం ఇవ్వమని అడుగుతుంది.

అలాగే మనుకు కూడా మహేంద్రే తన కన్న కొడుకు అనే విషయాన్ని చెప్పాలనుకుంటుంది. ఇక ఆ తర్వాత మహేంద్ర వెళ్లి శైలేంద్రను కలుస్తాడు. ఎందుకు పిలిచావని అంటాడు. మీరు మనును దత్తత తీసుకుంటాని అన్నారుగా.. డాడీ చాలా కష్టపడుతున్నారు, బాధ పడుతున్నారని చెబుతాడు. దీనికి మహేంద్ర మీ డాడీ ఏమో కానీ నువ్వు అయితే ఇంకా ఎక్కువగా బాధ పడుతున్నావు కదా అంటాడు. ఈక్రమంలోనే శైలేంద్ర మనును దత్తత తీసుకుని, మన సామ్రాజ్యానికి రారాజును చేస్తానంటే అస్సలే ఊరుకోనని చెబుతాడు. దీనికి మహేంద్ర ఏంటో టోన్ మార్చావు, అందితే జుట్టు లేదంటే కాళ్లు.. నీ బిహేవియర్ గురించి నాకు బాగా తెలుసంటూ చెప్పుకొస్తాడు.

Vasudhara is going to know how Anupama became Manuku s mother on Guppedantha Manasu April 24th 2024 Episode 1058

ఆ తర్వాత శైలేంద్ర దత్తత ఆపమని బెదిరిస్తాడు. ఆపేదే లేదని, ఆపకపోతే ఏం చేస్తావని అంటాడు. ఇక ఆ తర్వాత శైలేంద్ర రాజీవ్ కు ఫోన్ చేస్తాడు. ఆ మను గాడిని అంటూ శైలేంద్ర అనగానే.. రాజీవ్ దత్తత తీసుకుంటున్నాడా అంటాడు రాజీవ్. ఇది నీకెలా తెలుసని శైలేంద్ర అనగా.. వసును ఫాలో అవుతూ వెళ్తే తెలిసిందని చెబుతాడు. అలాగే ఇంత జరుగుతుంటే నీవేం చేయట్లేదని అనగానే.. శైలేంద్ర నువ్వైతే ఏం చేసే వాడివని అంటాడు. వెంటనే రాజీవ్ ముందు మీ బాబాయిని లేపేసి ఆ తర్వాత మనుకు స్పాట్ పెట్టేవాడినని అంటాడు. అయితే ఇప్పుడు అదే చెయ్ అని చెబుతాడు శైలేంద్ర. మరి మీరేం చేస్తారంటే ముందు చెప్పిందని చెయ్యమని ఫోన్ పెట్టేస్తాడు.

ఇక ఆ తర్వాత వసు మనుతో మాట్లాడుతూ కనిపిస్తాడు. మీ తండ్రి ఎవరో నాకు తెలిసిందని కానీ చెప్పేందుకు చాలా భయం వేస్తుందని అంటుంది. మీ తండ్రి మరెవరో కాదు మహేంద్ర గారే అని అంటుంది. అప్పుడే మహేంద్ర కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అది వింటాడు. ఇది విన్న మనుతో పాటు మహేంద్ర కూడా షాక్ అవుతాడు. ముఖ్యంగా మను అయితో కోపంతో రగిలిపోతాడు. మహేంద్ర అమ్మా వసుధార అంటూ లోపలికి వస్తాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, నేను మను తండ్రినా, మను నా కన్నకొడుకా అంటూ అంటాడు. నువ్వు నిజమే చెబుతున్నావా, ఈ విషయం నీకెలా తెలుసని అనగా.. అనుపమ చెప్పిందా అంటాడు. అనుపమ మేడమ్ వాళ్ల పెద్దమ్మ చెప్పిందని వసు వివరిస్తుంది.

Vasudhara is going to know how Anupama became Manuku s mother on Guppedantha Manasu April 24th 2024 Episode 1058

ఆ తర్వాత మహేంద్ర మాట్లాడుతూ.. నువ్వు ఇంత కాలం నాకు ఎందుకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యావో నాకిప్పుడు అర్థం అవుతుందని అంటాడు. కానీ మను మాత్రం కోపంతో ఊగిపోతూనే ఉంటాడు. కౌగిలించుకునేందుకు రాగానే మహేంద్రను నెట్టేస్తాడు. నువ్వు నున్న ముట్టుకోవడానికి వీళ్లేదని, నువ్వు ఇన్నాళ్లు నాకు చూపించిన ప్రేమ అబద్ధం అనిపిస్తుందని అంటాడు. తండ్రి మొహం తెలియక, పేరేంటో కూడా తెలియక చాలా ఇబ్బంది పడ్డానని అంటాడు. నేను చెప్పేది విను అంటూ మహేంద్ర అనగా.. నీ వల్ల మా అమ్మ ఎంత క్షోభ అనుభవించిందో తెలుసా, అంతా వేలెత్తి చూపించారని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అన్ని అవమానాలు, అన్ని చీత్కారాలు నీ వల్లే కదా అంటూ ఫైర్ అవుతాడు.

అప్పుడే వసు గతం మర్చిపోయి ఇప్పుడు అంతా సంతోషంగా ఉండండి అని అంటుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయని చెబుతుంది. మా బతుకులు ఇలా ఎందుకు చేశారని అడిగేందుకు మాత్రమే తన తండ్రి ఎవరని తెలుసోకోవాలనుకున్నానని.. లోకంలో గొప్ప గొప్ప తండ్రులే కాదు, నీలాంటి కీచక తండ్రులు కూడా ఉంటారని తెలుసుకోవడానికి అంటూ చెబుతాడు. నువ్వు నన్ను ప్రేమగా పిలవద్దంటూ, మహేంద్రను కనీసం ముట్టుకోనివ్వడు. అలాగే గన్ తీసి మరీ మహేంద్రను షూట్ చేస్తానంటాడు. అయినా సరే నేను నిన్ను కౌగిలించుకుంటానంటాడు దగ్గరకు వస్తుంటాడు. అప్పుడే మను మహేంద్రను కాల్చేస్తాడు. ఇదంతా అనుపమ కల అని చూపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X