Guppedantha Manasu March 24th: మను కుంతీపుత్రుడా.. రాజీవ్, శైలేంద్రలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన మను!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో మహేంద్ర అనుపమతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంత దగ్గరి వాళ్లు అయినా, ఎంత క్లోజ్ గా ఉన్నా వాళ్లతో కూడా చెప్పుకోలేము అంటూ అనుప వివరిస్తుంది. నీకు తెలిసిన అనుపమ వేరు, మనుకు తెలిసిన అనుపమ వేరు, నాలో ఉన్న అనుపమ వేరు అంటూ వివరిస్తుంది. కాబట్టి నా గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదని అంటుంది. కానీ మహేంద్ర మాత్రం ఆమెను అసలు విషయం చెప్పమని అడుగుతూనే ఉంటాడు. అనుపమ చెప్పను అని అంటుంది.

తల్లివి నువ్వే అయిన తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తాడు. అసలు అతడు ఎవరు, నీ గతం ఏంటి, నువ్వు జగతికి డెలివరీ కాగానే వెళ్లిపోయావు.. ఆ తర్వాత నీ లైఫ్ లో ఏం జరిగిందో నాకు తెలియాలి అంటూ గొడవ చేస్తాడు. అప్పుడే ఏంజెల్ వస్తుంది. మా అత్తయ్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. ఆ తర్వాత నాకు అత్తయ్య ఉందనే విషయమే పాతికేళ్ల తర్వాత తెలిసిందని.. ఇప్పుడే ఆమెకు కొడుకు ఉన్నాడని తెలిసిందని వివరించింది. కానీ ఇంతగా దాస్తూ వస్తుందంటే.. ఏందో పెద్ద సీక్రెటే అయి ఉంటుందని అంటుంది.

Vasudhara Learns The Secrets of Anupama From Manu on Guppedantha Manasu March 24th 2024 Episode 1033

మహేంద్ర మాత్రం పరిష్కారం వెతుకుదాం సమస్య చెప్పు అంటూ అనుపమను అడుగుతూనే ఉంటాడు. అలాగే నువ్వు అబద్ధం చెప్పవు.. నీకు పెళ్లి కాలేదన్నావు.. మరి మను ఎలా అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో అనుపమ ప్లీజ్ దీని గురించి వదిలెయ్ అంటూ చెబుతుంది. ఆ తర్వాత ఏంజెల్ కల్గజేసుకుని పాపం మా అత్తయ్యను వదిలేయండి, రెస్ట్ తీసుకోనివ్వండి అంటూ అంటుంది. మీరే అన్నారుగా ఏదో ఒక రోజు నిజం తెలుస్తుందని.. ఆరోజు కోసం వేచి చూద్దామని చెప్పి మనం బయటకు వెళ్దాం అంటూ వెళ్లబోతుండగా.. అనుపమ ఈ ప్రశ్నలు నన్ను అడిగావు కానీ మనును మాత్రం అస్సలే అడగకు అంటుంది. అంతటితో సీరియల్ అయిపోతుంది.

ఆ తర్వాత వసు... మను ఎంందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదోనని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మీరు కాలేజీకి వస్తున్నారా అని అడగ్గా... రాను మీరు మర్చిపోయారా అంటాడు. అనుపమ మేడమ్ రావొద్దని చెప్పారుగా, నేను రానని అంటాడు. ఆ తప్పు మీరు చేయలేదని తెల్సిందిగా రావొచ్చుగా అంటూ అనగానే ఆ మాట అనుపమ చెబితే బాగుంటుందని మను అంటాడు. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అనగానే గతంలో కూడా ఓసారి ఇలాగే చేశారు.. తీరా వచ్చాకా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు అంటాడు.

అప్పుడు వేరు ఇప్పుడు వేరు.. నాతో మాట్లాడేందుకు రాకపోయినా, మీ అమ్మకోసం అయినా ఇంటికి రావాలని.. సాయంత్రం వచ్చేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆతర్వాత శైలేంద్ర, రాజీవ్ లు ఓచోట మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అనుపమకు ఇప్పడెలా ఉందని అనగా.. నీకెందుకు అంటూ శైలేంద్ర అంటాడు. అప్పుడే మను అక్కడకు వచ్చి గన్ వారి తల మీద పెడతాడు. మీలో మా అమ్మ మీద ఎవరు అటాక్ చేశారంటూ అడుగుతాడు. రాజీవ్ మాత్రం మీ అమ్మ ఎవరు అనగా, శైలేంద్ర మాట్లాడుతూ.. అనుపమే వీళ్ల అమ్మ అని అంటాడు. ఆ తర్వాత అనుపమ ఎలా ఉందంటూ ప్రశ్నిస్తాడు శైలేంద్ర.

Vasudhara Learns The Secrets of Anupama From Manu on Guppedantha Manasu March 24th 2024 Episode 1033

ఆ తర్వాత రాజీవ్, శైలేంద్రలు తమకు ఏం తెలియనట్లుగా మాట్లాడతారు. నీకు తప్ప మా అమ్మ మీద అటాక్ చేసే అవరం మరెవరికీ లేదని అంటాడు. నన్ను టార్గెట్ చేస్తే అమ్మ అడ్డుగా రాగా తనకు తగిలిందని అంటాడు. వాళ్లు మాత్రం మాకు తెలీదని... నిన్ను టార్గెట్ చేస్తే ఇప్పుడు నివ్విలా మాట్లాడవు అంటూ రాజీవ్ అంటాడు. మీరు మగాళ్లు అయితే నాతోనే పెట్టుకోండి.. నా తల్లి జోలికి రావద్దని మను వాళ్లకు వార్నింగ్ ఇస్తాడు. గతంలో జరిగిన ఈ ఘటన గుర్తు చేసిమ మరీ.. పొడిచిన వాడెవడో, వాడికి సుపారీ ఇచ్చింది మరెవరో తెలుసుకుంటానంటూ చెప్పుకొస్తాడు. ముఖ్యంగా నా కళ్లు మొత్తం మీ ఇద్దరి మీదే ఉంటాయంటూ చెప్పి వెళ్లిపోతాడు.

మను వెళ్లగానే వీడిని చంపేయాలంటూ శైలేంద్ర రాజీవ్ తో చెబుతాడు. ఆ తర్వాత దేవయాని అనుపమ కోసం వస్తుంది. ఏంజెల్ కనిపించగా.. అసలు అనుపమకు ఇలా జరగడం ఏంటంటూ ప్రశ్నించి ఆమె వద్దకు వెళ్తుంది. ఎలా ఉంది అంటూ అడిగి.. నీకిలా ఎలా జరిగిందని అంటుంది. ఆ తర్వాత ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్న ఆమె కాఫీ తీసుకు రా అంటూ ఏంజెల్ ను బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత మను నీ కొడుకే అంట కదా అడుగుతుంది. మరి మీ భర్త ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. కొంపదీసి మను కుంతీ పుత్రుడా ఏంటి అని అడగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X