Guppedantha Manasu May 2nd: ఒక్కటైన మను, అనుపమ.. బతికే ఉన్న రాజీవ్, దేవయాని ఆట కట్టించిన వసు!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వసు, అనుపమలు.. అనుపమ పెద్దమ్మ వద్దకు వెళ్తారు. అక్కడే మను ఈ హత్య చేసుండడు అంటూ మాట్లాడుకుంటుండగా. మహేంద్ర వస్తాడు. మను ఏ తప్పూ చేయలేదని, అతడిని బయటకు తీసుకు వచ్చే పని నాదంటూ వివరిస్తాడు. అంతోలనే అనుపమ పెద్దమ్మ.. మనుది, నీది రక్త సంబంధం అంటూ చెప్పగా.. అంతా షాక్ అవుతారు. రక్త సంబంధం లేకపోయినా తండ్రీ కొడుకుల బంధం ఏర్పరుచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొస్తాడు. అయినా అంత మంచి వ్యక్తికి తండ్రి స్థానంలోకి వెళ్లాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలని అంటాడు. ఆ తర్వాత వసు తన ఇంటికి వెళ్లి రిషి ఫొటో చూస్తూ మాట్లాడుతుంది.
ముఖ్యంగా మామయ్యే రిషికి కూడా తండ్రి అని చెబుతుంది. మనుకు ఈ విషయం తెలిస్తే ఏం జరగుతుందో అని అయినా మనుకు అనుపమ పెంచిన తల్లా, కన్న తల్లా అని ఫైర్ అవుతుంది. ఆ తర్వాత వసు పడుకోగా.. రాజీవ్ అక్కడకు వచ్చినట్లు చూపిస్తారు. ముఖయంగా అతడి నీడను మాత్రమే చూపిస్తారు. ఎవరో వచ్చినట్లు అనిపించిందని.. అంటూ చెబుతుంది. మహేంద్ర మాత్రం డోర్స్ పెట్టి ఉన్నాయని ఇంకెలా వస్తారని అంటాడు. ఆ తర్వాత అనుపమను తోడుగా వెళ్లి వసుతో పడుకోమనగా వెళ్తుంది. ఇలా తెల్లారినట్లు చూపిస్తారు. ఆ తర్వాత మనును జైలు నుంచి బయటకు తీసుకు వస్తూ కనిపిస్తారు. అక్కడకు అనుపమ, వసు, మహేంద్ర వస్తారు.

లాయర్ ను కూడా తీసుకువచ్చి మనుకు చూపిస్తారు. ఇంతలోనే పోలీస్ మీరు ఈ కేసు పూర్తిగా చూశారా అనగానే.. చూశానంటూ, మనుకు బెయిల్ వచ్చే అవకాశమే లేదని లాయర్ అంటాడు. పోలీస్ కూడా గుచ్చి గుచ్చి ఇదే వివరిస్తాడు. బెయిల్ రాదని అనగానే అనుపమ వెళ్లి మను చేతులు పట్టుకుంటుంది. ప్రేమగా దగ్గరకు తీసుకోవాలనుకుంటుంది. అంతలోనే పోలీసులు కోర్టుకు ఆలస్యం అవుతుందంటూ తీసుకు వెళ్తారు. అక్కడే ఉన్న మహేంద్ర అనుపమకు భరోసా ఇస్తాడు. కచ్చితంగా మనును బయటకు తీసుకు వస్తానని అంటాడు. అంతలోనే వసుకు రాజీవ్ కనిపిస్తాడు. అదే విషయాన్ని మహేంద్రకు చెప్పగా మళ్లీ కనిపించడు. ఆ తర్వాత వీళ్లు ఇంటికి వస్తారు. వసు, అనుపమలు ఒక్కచోట ఉండగా.. దేవయాని వస్తుంది.
నీ కొడుక్కు బెయిల్ రాదంట కదా అంటుంది. మను తండ్రి ఎవరో తెలియక ఇన్నాళ్లు ఇబ్బంది పడ్డాడని, అది చూడలేకే మహేంద్ర దత్తత తీసుకోవాలనుకున్నాడని.. కానీ అంతకు ముందే పోలీసులు వచ్చారని అంటుంది. నీ కొడుకుకు ఈ జీవితంలో నాన్న అని పిలిచే యోగ్యత లేదంటూ అనగా.. అనుపమ ఆపుతుంది. ఫైర్ అవుతుంది. అంతలోనే వసు అందుకుని మను హత్య చేసే అవకాశం లేదని అంటుంది. కానీ దేవయాని మాత్రం నీకోసమే మను, రాజీవ్ ల మధ్య గొడవ జరిగి ఉంటుందని అంటుంది. మాటా మాటా పెరిగి హత్య జరిగి ఉంటుందని చెబుతాడు. రాజీవ్ కు వసు అంటే ప్రాణం అని, మనుయే కాపాడాడని కోపంతో ఇలా చేసుంటాడని అనగా.. అనుపమ దేవయానికి పైకి చేతు లేపుతుంది.

వసు ఆపి.. ఆమెను కొడితే మన స్థాయే తగ్గుతుంది అంటుంది. ఆ తర్వాత అనుపమ కూడా దేవయానికి వార్నింగ్ ఇస్తుంది. నీవేం నా మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని, నీ పలకరింపు కూడా అవసరం లేదంటూ ఫైర్ అవుతుంది. దీంతో దేవయాని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఫణీంద్ర, శైలేంద్రలు కోపంగా ఉండగా.. ధరణి కూడా అక్కడే ఉంటుంది. అంతలోనే దేవయాని అక్కడకు రాగా.. ఏమైందని అడుగుతుంది. ఎక్కడికెళ్లావ్ అని ఫణీంద్ర అనగా.. చిన్న పని ఉందని వెళ్లానంటుంది.
ఆ తర్వతా నువ్వు ఎవర్ని ఇబ్బంది పెట్టేందుక వెళ్లావంటూ చెప్పి.. ఓ వీడియో చూపిస్తాడు. వసు ఇంట్లో జరిగిందంతా చూపిస్తాడు. ఆ తర్వాత అక్కడికి ఎందుకెళ్లావ్, ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నావంటూ ఫైర్ అవుతాడు. ఎదుటి వాళ్ల సిట్యువేషన్ చూసి మాట్లాడాలని, ఇలా ఇబ్బంది పెట్టకూడదని అంటాడు. చెప్పు శైలేంద్ర అంటూ కొడుకును అడగ్గా.. ఫణీంద్ర అతడి చెంప పుగలగొడతాడు. ఇంతటితో సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











