Guppedantha Manasu June 4th: జగతిని చంపింది తానేనన్న శైలేంద్ర, రిషి రీఎంట్రీతో 6 సమస్యలకు చెక్!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో దేవయాని మనును చాలా బాధ పెడుతుంది. ముఖ్యంగా నీలాంటి బాధ మరెవరికీ రాదని, అసలు తండ్రి ఎవరో కూడా తెలియని వాడివి నువ్వొక్కడివే అంటూ చెప్పుకొస్తుంది. అసలు నీ తండ్రి ఎవరో మీ అమ్మను చెప్పమను అంటూ పదే పదే అంటుంది. యే ఆమె సమాధానం చెప్పదా.. చెప్పదు కదా అలా అయితే ఎలా నాన్నా అంటూ కామెంట్లు చేస్తూనే ఉంటుంది. అలాగే నీవు బతికినంత కాలం అలా నీ తండ్రి ఎవరో తెలియకుండా బతకాల్సిందేనా అంటుంది. అవసరం లేదు వదినగారు, అనుపమ చెప్పకపోయినా మను తండ్రి ఎవరో నేను కనుక్కుంటాను అంటాడు. అసలు నీకేంటి అంత అవసరం అని దేవయాని అంటుంది. మంచి వాళ్లకు సాయం చేస్తున్నాను అనగా.. అసలు నీకు వీళ్ల మీద అంత ప్రేమ ఎందుకు అంటుంది.

మేము వద్దని చెబుతున్నా అతడిని దత్తత తీసుకోవాలనుకున్నావు, నీ ఉద్దేశం ఏంటి.. అసలు నీ మనసులో ఏముందో చెప్పు అంటూ మహేంద్రను పదే పదే అడుగుతుంది. నేను తిట్టాను అనే ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చావా లేదా అనుపమ వస్తుందని నాతో గొడవ పడి ఇక్కడకు వచ్చావా అని ప్రశ్నిస్తుంది. దీంతో మహేంద్ర చాలా ఫైర్ అవుతాడు. ఆపమంటాడు. అప్పుడే అనుపమ మీరిలా మాట్లాడడం తప్పు, భర్త, ప్రేమ, స్నేహానికి మీకు తేడా తెలియదా అంటూ అంటుంది. దీనికి దేవయాని వెటకారంగా నవ్వుతూ గ్రేట్, చాలా గ్రేట్ అంటూ చెప్పుకొస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవాలా, ఏం అర్థం చేసుకోవాలంటూ అడుగుతుంది. నీకు పెళ్లి కాలేదు కానీ కొడుకున్నాడు, ఆ కొడుక్కు తండ్రెవరో చెప్పవు, కన్న కొడుకును దూరం పెడతావు, వేరే వాళ్ల ఇంట్లో ఉంటావు అంటూ అనుపమను అంటుంది. అలాగే మనును చూస్తూ నీ తల్లి నీ కళ్లెదుటే ఉంటుంది, కానీ అమ్మ అని చెప్పవు, పిలవవు, నీ పుట్టుకకు కారణం అయిన నీ తండ్రి ఎవరో చెప్పవు అంటుంది.

Vasudhara Reminisces Rishi on Guppedantha Manasu June 4th 2024 Episode 1091

ఆ తర్వాత మహేంద్రతో మాట్లాడుతూ.. నీ భార్య చనిపోయిందని తాగుడుకు అలవాటు పడ్డావు. ఆ తర్వాత రిషి కనిపించకుండా పోగా వాడిని తిరిగి తీసుకు వస్తానంటావు.. కానీ మను, అనుపమలను పట్టించుకోవడానికి నీకు సమయం చాలట్లేదంటుంది. ఆ తర్వాత వసుతో మాట్లాడుతూ.. రిషి నా ప్రాణం, తను లేకపోతే నేను చచ్చిపోతానన్నావు ఇప్పుడేమో వాడిని మర్చిపోయావు.. ఇలాంటి మిమ్మల్ని అర్థం చేసుకోవాలా అంటుంది. ఇక వెళ్లండి అనగా.. సరేనని బయలు దేరుతారు. అప్పుడే శైలేంద్ర వచ్చి వారం రోజుల్లో రిషిని తీసుకు రాకపోతే కాలేజీ వదిలి వెళ్లిపోతావా అంటుంది. వెళ్తాననగా.. వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండు అంటాడు. దీంతో వసు శైలేంద్ర కాలర్ పట్టుకుని రిషి సార్ ను ఏం చేశావో చెప్పు అంటుంది. నువ్వే ఏదో చేశావు నాకు అనుమానంగా ఉందంటుంది. అప్పుడే దేవయాని కల్గజేసుకుని మమ్మల్ని అనుమానిస్తున్నావేంటనగా.. మీ గురించి నాకు తెలుసంటుంది.

Vasudhara Reminisces Rishi on Guppedantha Manasu June 4th 2024 Episode 1091

జగతి మేడమ్ ఆస్పత్రి నుంచి వచ్చాకా బాగానే ఉన్నారు కానీ సడెన్ గా చనిపోయారనగా.. శైలేంద్ర మేమేమైనా జ్యూస్ లో కలిపామంటున్నావా అంటుంది. మేమలా అనలేదే అనగా.. మీరే చేశారు కదా అంటుంది. అప్పుడే మహేంద్ర.. అదే కనుక నిజం అయితే నేను నీ ప్రాణాలు తీస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు. మీరు రావడమే మంచిది అయింది... రిషి, మను తండ్రిలతో పాటు జగతి చావుకు కారణం కూడా తెలుసుకుంటానంటాడు. ఇక వెళ్లండి అనగానే వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్రలను చూపిస్తారు. మనం వాళ్ల ఇంటికి వెళ్లి ఏం చేశామంటాడు. గెలిచామా, ఓడామా అనగా.. వారిని ఇబ్బంది పెట్టామని దేవయాని అంటుంది. రిషి గురించి మాట్లాడి వసును రెచ్చగొట్టాం, మరో వారం రోజుల్లో రిషిని ఎలాగూ తీసుకు రాలేదు కాబట్టి వసు వెళ్లిపోతుంది.. మరి ఎవరు గెలిచారని అనగా.. మనమే అంటాడు శైలేంద్ర.

Vasudhara Reminisces Rishi on Guppedantha Manasu June 4th 2024 Episode 1091

ఇక మను విషయానికి వద్దామని.. మను తండ్రిని మహేంద్ర తీసుకురాలేడు, ఒకవేళ తీసుకు వచ్చినా.. మను వాడి తండ్రిని చంపడమో, వాడి తండ్రే మనును చంపడమో చేస్తాడు.. ఇదే జరిగితే ఎవరో ఒకరు జైల్లో ఉంటారు దాని వల్ల మనకే లాభం కదా అంటాడు. అలాగే అనుపమ అక్కడ ఎందుకు ఉంటుందనగా.. వాళ్లు సమాధానం చెప్పలేరు అంటే వాళ్లు ఓడిపోయినట్లే కదా అంటుంది. ఇక నీకు క్లారిటీ వచ్చిందిగా ఎవరు గెలిచారో అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర.. దేవయాని కాళ్లు పట్టుకుంటాడు. నీ తెలివి అర్థం అయిందంటూ చెబుతాడు. ఇక నుంచి నువ్వు నన్నే ఫాలో అవ్వు అని అని చెప్పి.. మనకు ఫలితం దక్కాలని అంటుంది. ఆ ఎండీ పదవిని ఎలా చేజిక్కించుకోవాలో ఆలోచించాలి అంటుంది. అలాగే తనకు తెలియకుండా ఎలాంటి ప్లాన్ లు వేసినా తాను ఊరుకోనంటుంది.

Vasudhara Reminisces Rishi on Guppedantha Manasu June 4th 2024 Episode 1091

ఆ తర్వాత వసు రిషి ఫొటో చూస్తూ బాధ పడుతుంది. శైలేంద్ర అన్న మాటలను గుర్తు చేసుకుంటుంది. అలాగే మను తన తండ్రి గురించి తెలుసుకోవాలని, అనుపమ నిజం చెప్పకూడదని, మహేంద్ర అనుపమతో బంధం గురించి ఆలోచిస్తాడు. ఇలా ఒక్కొక్కరూ తమ బాధల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. రిషిని తీసుకు వస్తే చాలా సమస్యలు తొలగుతాయనుకుంటారు. ఇలా వసు రిషి ఫొటోను చూస్తూ ముద్దులు పెడుతుంది. ఇంతటితో సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X