Guppedantha Manasu March 13th: వంద రిషిలను తీసుకు వచ్చి వసుకు సర్ ప్రైజ్.. మను ప్లాన్ అదిరిందిగా!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో వసుధార మనుకు సారీ చెబుతుంది. తాను ఎదుర్కున్న పరిస్థితుల ప్రభావం వల్లే తాను అందర్నీ నమ్మలేకపోతున్నానని.. అందుకే మిమ్మల్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నానని అంటుంది. అక్కడే ఉన్న మహేంద్ర.. అందుకే ఎవర్నీ తొందరగా జడ్డ్ చేయకూడదు వసు... నిజానిజాలు తెలిసే వరకు ఆగాలి అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత మను నాకు మీరు చెప్పే సారీలు ఏం వద్ద అంటూ చెబుతాడు. ఆ తర్వాత మీరు నాతో రండి మేడమ్.. గిల్ట్ ఫీల్ పోతుందని అంటాడు.
ఏం చేయబోతున్నారో చెప్పండి అప్పుడే వస్తాను.. నాకు నచ్చేది అయితే వస్తాను, లేదంటే రానంటూ వివరిస్తుంది. కానీ మీరు రావాలి మీకు నచ్చని పని అస్సలే చేయము అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత మహేంద్ర కూడా చెప్పగా అంతా కలిసి వస్తారు. ముఖ్యంగా వసుకు కళ్లకు గంతలు కట్టి మరీ తీసుకు వస్తారు. అక్కడకు వచ్చి గంతలు విప్పగానే.. రిషఇ మాస్కులు వేసుకున్న విద్యార్థులు కనిపపిస్తారు. వాళ్లందరినీ చూసి వసు తెగ సంబురపడిపోతుంది. వాళ్లంతా హ్యాపీ బర్త్ డే వసు మేడమ్ అంటూ కేకలు వేస్తారు.

అక్కడే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ చూసి వసు తెగ సంతోష పడిపోతుంది. అప్పుడే రాజీవ్ రిషి మాస్క్ వేసుకుని మరీ వస్తాడు. ఇది మాత్రం నా ప్లాన్ యే మేడమ్ అంటూ మను చెబుతాడు. ముఖ్యంగా రిషి సార్ లేకుండా ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోను అన్నారు కదా.. అందుకే ఇలా ప్లాన్ చేశానంటూ మను చెబుతాడు. మీకు నచ్చకపోతే కాలేజీ వదిలి వెళ్లిపోతానంటూ వివరిస్తాడు. ఆ తర్వాత వాళ్ల పెద్ద మామయ్య మాట్లాడుతూ... నీ సంతోషం కోసమే మేమంతా ఇలా చేశాం.. రిషి కనిపించకుండా పోయినప్పటి నుంచి కన్నీళ్లే తప్ప నీ మొహంలో ఆనందం చూడలేదు.. అందుకే ఇలా చేశామంటాడు.
ఆ తర్వాత ఏంజెల్ మాట్లాడుతూ.. నాకు వేరే పని ఉన్నా మీకోసం వచ్చానంటూ వివరిస్తుంది. ఆ తర్వాత ధరణి మీరు కూడా ఈ మాస్క్ పెట్టుకోండని అడగ్గా.. ఛీ అంటాడు శైలేంద్ర. ఈ పార్టీ సెలబ్రేషన్స్ లో మీ హస్తం కూడా ఏమైనా ఉందా అనగా.. నోర్ముయ్ అంటాడు. ఆ తర్వాత వసు ధరణి చేతిలోని మాస్క్ తీసుకుని రిషి ఫొటోను తదేకంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మను మాట్లాడుతూ... కాలేజీ గురించి వివరిస్తాడు. ముఖ్యంగా ఈ కాలేజీని ఇంత బాగా నడిపిస్తున్న వారిలో ముందు ఫణీంద్ర గారు, ఆ తర్వాత మహేంద్ర గారు, జగతి గారు, రిషి గారు, ఇప్పుడు వసుగారు ముందుంటున్నారని చెప్పారు.
ఈ మధ్య కాలేజీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోగా.. వసుధార మాత్రం తన ఓర్పుతో కాలేజీని మరింత అద్భుతంగా తీసుకు వస్తుందంటూ చెబుతాడు. ఆ తర్వాత ఏవీ ప్లే చేస్తానని అనగా.. దేవయాణి ఇదంతా అవసరమా కేక్ కట్ చేసి వెళ్లిపోతే అయిపోతుంది కదా అంటూ అనగా.. ఫణీంద్ర ఏం దేవయాని కేక్ తినడానికే వచ్చావా అంటూ అడుగుతాడు. ఆ తర్వాత రాజీవ్.. నా మరదలును ఇంప్రెస్ చేయడానికి చాలానే కష్టపడుతున్నాడనంటూ అనుకుంటాడు. ఆ తర్వాత ఏవీలో విద్యార్థులు బైట్స్ ప్లే చేసి వసు, రిషిల గప్పతనాన్ని చెప్పిస్తారు.
ఆ తర్వాత ఏంజెల్ మాట్లాడుతూ.. వసు, రిషిలు తమ కాలేజీకి వచ్చాకే తమ కాలేజీ బాగయిందని చెబుతుంది. ఆ తర్వాత ఫణీంద్ర బాట్ ప్లే చేస్తారు. రిషి కంటే బాగా వసు కాలేజీని నడుపుతుందంటూ వివరిస్తాడు. ఆ తర్వాత మహేంద్ర మాట్లాడుతూ.. రిషి లేక వసు చాలా బాధలో ఉందని.. వారిద్దరూ త్వరలో కలిస్తే నా జీవితానికి అంతే చాలంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర మాటలు చూపిస్తారు. స్టూడెంట్ స్థాయి నుంచి ఎండీ స్థాయికి వచ్చిన వసు చాలా గ్రేట్ అంటూ శైలేంద్ర చెప్పడం చూసి అంతా షాక్ అవుతారు. ముఖ్యంగా ధరణి అయితే మీరేనా ఇదంతా మాట్లిడిందంటూ అడుగుతాడు.
ఆ తర్వాత విద్యార్థులు.. రిషి సార్ కచ్చితంగా వస్తారు, మేడమ్ హాయిగా ఉంటేనే కాలేజీ బాగుంటుందని.. అలా తన జీవితం కూడా బాగు పడుతుందంటూ చెప్పుకొస్తారు. ఆ తర్వాత దేవయాని గారు మీరు వసు గురించి మాట్లాడతారా అంటూ అనగా.. వద్దు అంటుంది. ఆ తర్వాత స్క్రీన్ పై రిషి ఫొటో పెట్టి.. వసు కేక్ కట్ చేయాలని చెప్పగా కుటుంబ సభ్యులు అంతా వస్తారు. ఇలా వసు అందరి మధ్య కేక్ కట్ చేయగా.. అంతా హ్యాపీ బర్త్ డే చెబుతారు. ఆ తర్వాత మను కేకే తినిపించగా.. ఆమె కూడా అతడికి తనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











