Guppedantha Manasu March 28th: బావపై ప్రేమ కురిపిస్తున్న ఏంజల్.. తల్లీకొడుకుల్ని కలపబోతున్న వసు!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో మను అమ్మమ్మ మనసులో అనుపమ గురించి మాట్లాడుకుంటుంది. ఇక ఆ తర్వాత అనుపమ ఫోన్ చేయగా ఆమె మాట్లాడుతూ అక్కడ కంఫర్ట్ గా లేకపోతే ఇంటికి వచ్చెయ్ అంటుంది. నేను రాను అని, అక్కడి మనుషుల తీరు నాకు నచ్చదు అని చెబుతుంది. ఆ తర్వాత మను వచ్చాడా అనగా... రాలేడని అంటుంది. ఎక్కడ కూర్చొని బాధ పడుతున్నాడో, వాడు మనుషులకు తన బాధ చెప్పుకోవడం ఎప్పుడో మానేశాడని వివరిస్తుంది.
ఇదంతా జరిగాకా అనుపమ... ఆ దేవయాని వచ్చి మను తండ్రి ఎవరంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది, ఆ తర్వాత వసు, ఏంజెల్ వచ్చి ఆమెను పంపించేశారు, ఇక మహేంద్ర కూడా ఇలా అడుగుతూనే ఉన్నాడని చెబుతుంది. వాళ్లు అడగడంలో తప్పేముందని మను అమ్మమ్మ అంటుంది. అలాగే నీవు ఏం సమాధానం చెప్పావు అంటే నేనేం.. చెబుతానో నీకు తెలీదా అంటూ అనుపమ చెబుతుంది. మనుతో కలిసి ఉండమని ఒకటే చెబుతున్నారు, నేనెలా ఉండాలో నాకు తెలీదా అంటూ అనుపమ వివరిస్తుంది. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటూ అనగా... మనుయే సమస్యలు తీర్చాలని వచ్చాడని పేర్కొంటుంది.

ఇక అంతలోనే మహేంద్ర.. మనును తీసుకు వచ్చి మరీ అనుపమను పిలుస్తాడు. మను వచ్చాడా అని చెబుతాడు. ఎవరు వచ్చారు అని అనుపమ పెద్దమ్మ అడుగ్గా నాకు వినిపించలేదంటుంది. ఫోన్ లో ఉన్న నాకు వినిపించింది నీకు వినిపించలేదా అనగా.. అనుపమ వినిపించాలని రూలేమీ లేదు కదా అంటుంది. ఇక ఆ తర్వాత ఈఎన్టీ ఆస్పత్రికి వెళ్లు అని ఆమె ఫోన్ పెట్టేస్తుంది. మన, మహేంద్రలు సోఫాలో కూర్చుని ఉండగా.. మేడమ్ కోసం మెడిసిన్ తీసుకు వచ్చానని మను మహేంద్రకు ఓ కవర్ ఇస్తాడు. నువ్వ మాకు సాయం చేస్తున్నావు అన్నప్పుడే.. నీ తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్లు అని అనుకున్నానని... కానీ మా అనుపమ కొడుకువి అని తెలిసినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని వివరిస్తాడు.
అంతలోనే ఏంజెల్, వసులు రాగా.. ఏంజెల్ హాయ్ బావా అంటుంది. ఆయన అదోలా చూడగానే సారీ సారీ మనుగారు అంటుంది. మహేంద్ర కల్గజేసుకుని నువ్వు మనుని బావా అనే పిలువు.. తనేం అనుకోడు అంటూ చెబుతాడు. ఏంజెల్ కల్గజేసుకుని నేను ఈయనేదో అనుకుంటారని బావా అని పిలవకుండా ఉండట్లేదు, అత్తయ్య ఏం అనుకుంటుందో అని పిలవట్లేదని అంటుంది. అప్పుడే మను నేను వెళ్తాను అనగా.. మీ అమ్మకు ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్లు అంటే నేనివ్వలేనని మను చెబుతాడు. వసుధార ఎందుకు, మీ అమ్మను మీరే చూసుకోవాలి అని చెబుతుంది.
ఏంజెల్.. అత్తయ్య ఆ గదిలో ఉంది.. వెళ్లి ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటూ చెబుతుంది. వెంటనే వసు తల్లిప్రేమ గురించి చెబుతుంది. ఆమె ఎంతో చిరాకు, కోపంలో ఉన్నా బిడ్డను చూడగానే ఆ సమస్యలు అన్నీ మాయం అయి సంతోషంగా ఉంటారు అని చెప్పి తల్లి వద్దకు వెళ్లమంటారు. అలా మను ట్యాబ్లెట్స్ ఇచ్చేందుకు అనుపమ వద్దకు వెళ్తాడు. మను కోసం భోజనం తయారు చేయమని మహేంద్ర చెప్పగా.. ఇప్పటికే రెడీ చేశానంటుంది వసుధార. ఆ తర్వాత అనుపమ నీళ్లు తాగుతూ ఉండగా.. మను వెళ్లి ట్యాబ్లెట్స్ ఇస్తాడు. కూర్చోవచ్చా అని అడుగుతాడు. ఆమె సమాధానం చెప్పకపోయినా బెడ్ మీదే కూర్చుకుంటాడు.

అలా తల్లిని చూస్తూనే.. నొప్పి ఎలా ఉందని అడుగుతాడు. ఆ తర్వాత ఎందుకు వచ్చావు అని అనుపమ అనగా వెళ్లిపోతాను దూరంగా అని అంటాడు. మీకు ఇచ్చిన మాట కోసం మీకు దూరంగా వెళ్లిపోతాను అని చెబుతాడు. మీరు ఆరోజు అంత మాట అన్న తర్వాత కూడా వెళ్లకుండా ఉంటాననుకున్నారా.. కానీ మీకలా జరిగిందనే ఉన్నానని చెబుతాడు. అలాగే ఈ కాలేజీలో సమస్య ఉందని తెలిసి వచ్చానని అంటాడు. అది తీరాకా వెళ్లాలనే అనుకున్నాను.. కానీ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని వివరిస్తాడు.
ఆ తర్వాత మను కూడా పాతికేళ్లుగా.. నాక్కూడా సమాధానాలు లేక నరకం చూస్తున్నానని మను అనగా.. ఇంక చాలు ఆపు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అంటుంది. అంతలోనే అనుపమ వచ్చి ఎక్కడికి వెళ్తారు మేడమ్ అంటుంది. వసుతో పాటు మహేంద్ర లోపలికి వచ్చి.. మను ఇప్పుడు వెళ్లడు, భోజనం చేసిన తర్వాత వెళ్లాలనిపిస్తే వెళ్తాడు, ఉండాలనిపిస్తే ఇక్కడే ఉంటాడని అంటుంది. అసలు మనును ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు అనగా.. తాను చేసిన గాయం కంటే ఈ గాయం పెద్దదేమీ కాదని అంటుంది. ఆయన నా అనుమతి లేకుండా తనను నా వద్దకు ఎలా పంపించారని అంటుంది.
బిడ్డకు తల్లి వద్దకు వచ్చే స్వేచ్ఛ, హక్కు ఉంటుందని.. తనకు మీ ఒళ్లో పడుకునే స్వేచ్ఛ ఉందని వసు అంటుంది. అది కాదు వసు అని అనుపమ అనగా... లేదు మేడమ్ అంటూ వసు ఆపేస్తుంది. మను సొంతంగా బిజినెస్ చేస్తున్నా, ఎంత ఎదిగినా ఆయన మీ కొడుకే అని చెప్పగా మహేంద్ర వసును మెచ్చుకుంటాడు. అప్పుడే ఏంజెల్ అందరినీ రమ్మని పిలవగా అనుపమ నేను రానంటుంది. నేనుంటే తను తినదు అని చెబుతాడు. మను ఉన్నాడనే నీకు ఆకలి లేదా.. తనుంటే తినవా అనగా.. అదోలా చూస్తుంది. ఇంతటితో సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











