బ్యాన్ చేసిన వీణా మాలిక్ షో మళ్లీ ప్రసారం
ముంబై : పాకిస్థాన్ భామ వీణామాలిక్ పాల్గొన్న మతపరమైన టీవీ కార్యక్రమం 'Astaghfar' పాకిస్థాన్ లోని హీరో టీవీలో రంజాన్ ప్రసారం కావాల్సి ఉండగా రద్దు చేసిన విషయం తెలిసిందే. గతంలో వీణా మాలిక్ ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇవ్వడం లాంటి పనులు చేయడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీకి వేలకొద్దీ ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సదరు టీవీ ఛానల్ ఆకార్యక్రమాన్ని రద్దు చేయక తప్పలేదు.
అయితే ఆ కార్యక్రమం మళ్లీ ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీణా మాలిక్ పబ్లిసిటీ విషయాలు చూసుకునే సంస్థ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ....ఆ కార్యక్రమం ప్రసారాన్ని అప్పుడు రద్దు చేసినప్పటికీ మళ్లీ ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ షో ప్రసారం చేయాలని డిమాండ్స్ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
తన షో మళ్లీ ప్రసారం కావడంపై వీణా మాలిక్ స్పందిస్తూ 'తన షో మళ్లీ ప్రసారం కావడం చాలా ఆనందంగా ఉందని, అల్లా దయ వల్లనే నా షో ప్రసారం అయ్యే అవకాశం వచ్చిందని' ఆనందం వ్యక్తం చేసింది. కాగా Astaghfar కార్యక్రమంలో వీణా మాలిక్ తాను గతంలో చేసిన తప్పులపై పశ్చాత్తాప పడింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు ఇప్పటికే ఇంటర్నెట్లో విడుదలయ్యాయి. త్వరలో ఈ కార్యక్రమం పాకిస్తాన్ హీరో ఛానల్ లో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications












