Veera Simha Reddy: బాలయ్య మూవీకి షాకింగ్ టీఆర్పీ.. ఇది ఎవరూ ఊహించరు భయ్యా
ఆరు పదుల వయసులోనూ రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ బడా హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' చిత్రంతో చాలా రోజుల తర్వాత హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకున్నారు.
దీంతో మరింత ఉత్సాహంగా దూసుకుపోతోన్నారు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి 'వీర సింహా రెడ్డి' అనే సినిమా చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అయింది.

సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఊహించని రీతలో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఈ సినిమా ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 69 కోట్లుకు పైగా షేర్‌ను వసూలు చేసింది.
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్లు షేర్‌తో పాటు రూ. 134 కోట్లు వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది. తద్వారా బాలయ్య కెరీర్‌లోనే టాప్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. ఆ తర్వాత 'వీర సింహా రెడ్డి' మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ భారీ వ్యూస్‌తో హవాను చూపించింది.
థియేటర్లు, ఓటీటీలో చాలా రోజుల పాటు ఓ రేంజ్‌లో సందడి చేసిన బాలయ్య 'వీర సింహా రెడ్డి' మూవీ.. ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు.
కానీ, ఊహించని విధంగా దీనికి స్పందన అంతగా రాలేదు. ఫలితంగా ఈ చిత్రానికి అర్బన్ ఏరియాలో 8.83 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 7.67 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. ఓటీటీ రోజుల్లో ఇది మంచి టీఆర్పీనే అయినా.. బాలయ్య రేంజ్‌కు తక్కువే అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన మాస్ చిత్రమే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











