రజనీకాంత్ లో దైవ భక్తికి కారణమిదే.. ఆ ఘటనతో మార్పు.. బయట పెట్టిన సీనియర్ నటి

టాలీవుడ్ సీనియర్ నటి వై విజయ తెలుగు ప్రేక్షకుల్లో ఎంతగానో గుర్తింపు దక్కించుకుంది. రికార్డు స్థాయి సినిమాల్లో నటించి అలరించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే తాజాగా వై విజయ జబర్దస్త్ వర్ష 'కిస్సిక్ టాక్స్' షోకు హాజరైంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్, విక్టరీ వెంకటేశ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వారి ఆధ్యాత్మిక మార్గాల గురించి ఇలా మాట్లాడింది..

క్లాసికల్ డ్యాన్సర్ గా మొదలై..
సీనియర్ నటి వై విజయ టాలీవుడ్ లో 1965 నుంచి యాక్టివ్ గా ఉంటోంది. తొలుత క్లాసికల్ డ్యాన్సర్ గా కెరీయర్ ను ప్రారంభించింది. రాయలసీమకు చెందిన ఆమె కడపలో పుట్టి పెరిగింది. చిన్న వయస్సులోనే డ్యాన్సర్ గా 'నిండు హృదయాలు' అనే చిత్రంలో అవకాశం అందుకుంది. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది.

Venkatesh Daggubati Follows Superstar Rajinikanth way

రికార్డు స్థాయి సినిమాల్లో నటించి..
1965 నుంచి 2021 వరకు సీనియ్ నటి వై విజయ 50 ఏళ్ల పాటు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఆమె కెరీయల్ లో మొత్తం 1400కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. తొలుత డ్యాన్సర్ గా, హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్, నెగెటివ్ రోల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించింది. విక్టరీ వెంటేశ్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 వంటి చిత్రాల్లో కీలక పాత్రలో మెరిసింది. ఎఫ్3లో ఆమె చివరిగా వెండితెరపై కనిపించింది.

రజనీకాంత్ ధైవ భక్తికి కారణం..
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి వై విజయ మాట్లాడుతూ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసింది. రజనీకాంత్ కెరీయర్ తొలినాళ్లలో భారీ సక్సెస్ ను అందుకున్న తొలి సందర్భంలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారంట. ఒకేసారి స్టార్డమ్ రావడంతో ఆ సక్సెస్ ను అలాగే కొనసాగించడం కోసం ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారని చెప్పింది. మొదటిసారిగా జీవితంలో వచ్చిన సక్సెస్ ను కోట్లాది ప్రజలను ఆకర్షించుకుంటూనే ఉండటం కోసం క్రియా యోగా చేస్తూ ఉంటాని, ప్రశాంతమైన జీవితం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నారని చెప్పింది.

రజనీకాంత్ ను ఫాలో అవుతున్న వెంకటేశ్..
సూపర్ స్టార్ రజనీకాంత్ పరమహంస యోగానంద సూత్రాలను పాటిస్తూ ఉంటారు. ఇక విక్టరీ వెంకటేశ్ కూడా తన కెరియర్ లో వచ్చిన ఫస్ట్ సక్సెస్ తర్వాత కాస్తా భయపడ్డారని, ఎంత సంతోషం ఉన్నా.. ఆ సక్సెస్ ను హ్యాండిల్ చేయడం కష్టంగానే ఉంటుందని, మళ్లీ అలాగే కొనసాగించడం వారికి సవాల్ గా మారుతుందని చెప్పుకొచ్చింది. ఇక విక్టరీ వెంకటేశ్ కూడా ఆధ్యాత్మిక బాటను అనుసరిస్తున్నారని, ఆయన స్థాయిలో కాకపోయినా.. రమణ మహార్షి పుస్తకాలను చదువుతూ ఉంటారని చెప్పుకొచ్చింది. ఎఫ్2 చిత్రం సెట్స్ లోనూ ఆ పుస్తకాలే చదువుతూ కనిపించారని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X