twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాకు హాఫ్ కిలోమీటర్ దూరంలో.. ఏం తోచట్లే అంటోన్న వెన్నెల కిషోర్

    |

    ప్రస్తుతం కరోనా ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ, అందులోనూ హైద్రాబాద్‌లో పరిస్థితి చేజారినట్టే కనిపిస్తోంది. రోజురోజుకు వేలల్లో కరోనా కేసుల బయట పడుతున్నాయి. కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది కానీ తగ్గడమే లేదు. రాష్ట్రంలోని కేసులన్నింటిలో పోల్చితే హైద్రాబాద్‌లోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో వెన్నెల కిషోర్ అయోమయంలో పడ్డట్టు కనిపిస్తోంది.

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వెన్నెల కిషోర్ ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందిస్తాడు. వెండితెరపై సెటైర్ వేసినట్టుగానే.. సోషల్ మీడియాలోనూ పంచ్‌లు వేస్తుంటాడు. తాజాగా వెన్నెల కిషోర్ వేసిన సెటైర్, చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను అందరూ వాడాలని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వెన్నెల కిషోర్ కూడా ఆరోగ్య సేతు యాప్‌ను వాడుతున్నాడు. అయితే తాజాగా కరోనా అప్ డేట్స్ చూస్తే వెన్నెల కిషోర్‌కు దిమ్మతిరిగినట్టు తెలుస్తోంది.

    Vennela Kishore About Aarogya Setu And Corona Virus

    ఆరోగ్య సేతు యాప్‌లోనే డేటా ప్రకారం.. గడిచిన 28 రోజుల్లో ఆరోగ్య సేతు యాప్ వాడుతున్న వారిలో ఏడుగురు కరోనా బారిన పడ్డారట. అది కూడా వెన్నెల కిషోర్ ఉంటున్న ప్రాంతానికి అర కిలో మీటర్ దూరంలోనే అంటా. అయితే ఈ విషయంలోనే వెన్నెల కిషోర్ అయోమయానికి గురవుతున్నాడట, ఏం చేయాలో తోచట్లే అంటూ తన దైన శైలిలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ హల్చల్ చేస్తుంది. దీన్ని బట్టే హైద్రాబాద్‌లో కరోనా ఏ స్టేజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    English summary
    Vennela Kishore About Aarogya Setu And Corona Virus. he Is Afraid of Corona virus. Aroun 500 meter Thera are 7 corona cases with in 28 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X