For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘కార్తీక దీపం’ హీరోపై కమెడియన్ షాకింగ్ పోస్ట్: ఎంత పని చేశావ్ అంటూ.. ఊహించని విధంగా!

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రజాధరణను అందుకుంటూ దూసుకుపోతోన్న సీరియల్ 'కార్తీక దీపం'. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు మూడున్నరేళ్లుగా ఇది విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. రోజు రోజుకూ ఆసక్తిని పెంచుతూ దీన్ని రన్ చేస్తున్నారు. ఎన్నో మలుపులు.. ఊహించని ట్విస్టులతో సాగుతోన్న ఈ సీరియల్‌లో నిరుపమ్ పరిటాల హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అతడిపై టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిశోర్ షాకింగ్ పోస్ట్ చేశాడు. ఏకంగా బ్రహ్మానందం ఫొటోను వాడుతూ సెటైర్ వేశాడు. ఆ సంగతులు మీకోసం!

  Karthika Deepam fame Nirupam AKA Karthik Got gift from Chiranjeevi's Mother Anjana Devi
  ‘కార్తీక దీపం' సీరియల్ నేపథ్యం ఇదే

  ‘కార్తీక దీపం' సీరియల్ నేపథ్యం ఇదే

  ‘కరుతముత్తు' అనే మలయాళ సీరియల్‌కు రీమేక్‌గా వచ్చిందే ‘కార్తీక దీపం'. నల్లగా ఉన్న మహిళను పెళ్లి చేసుకున్న హీరో.. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను అనుమానించి వదిలేస్తాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఎలా కలిశారు అన్న నేపథ్యంతో ఈ సీరియల్ సాగుతోంది. కుటుంబ విలువలు పుష్కలంగా ఉన్న ‘కార్తీక దీపం' తెలుగులో నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది.

  మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ ప్రేమీ

  మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ ప్రేమీ

  ‘కార్తీక దీపం' సీరియల్ ఇంత సక్సెస్ అవడానికి అందులో హీరోయిన్‌గా చేస్తోన్న ప్రేమీ విశ్వనాథ్ ప్రధాన కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన హావభావాలతో ఆమె పలికే డైలాగులకు తెలుగు ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. ఫలితంగా ఆమె తమ కుటుంబ సభ్యురాలిగా మార్చేసుకున్నారు. దీంతో ప్రేమీ విశ్వనాథ్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.

  డాక్టర్ బాబు కూడా తక్కువేం కాదు

  డాక్టర్ బాబు కూడా తక్కువేం కాదు

  ఎందులోనైనా ఒకరి యాక్టింగ్ హైలైట్ అయిందంటే.. వాళ్ల పక్కన చేసే వాళ్లు కూడా అంతే స్థాయిలో మెప్పిస్తున్నారని అర్థం. దాన్ని నిజం చేస్తూ తన సత్తాను చాటుతున్నాడు ‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ పరిటాల. ఇందులో ప్రేమీ విశ్వనాథ్‌తో పోటీ పడి నటిస్తోన్న అతడు.. ప్రతి సీన్‌లోనూ అద్భుతమైన యాక్టింగ్‌తో మెప్పిస్తున్నాడు. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకున్నాడు.

  ఇండియాలోనే రికార్డు స్థాయి రేటింగ్

  ఇండియాలోనే రికార్డు స్థాయి రేటింగ్

  తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది ‘కార్తీక దీపం' సీరియల్. దీనికి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఫలితంగా టీఆర్పీ రేటింగ్ కూడా ఊహించని స్థాయిలో దక్కుతోంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ ఎన్నో సార్లు రికార్డు స్థాయి రేటింగ్‌ను సాధించింది. ఫలితంగా ఇండియాలోనే టాప్ సీరియల్‌గా నిలిచింది.

   ఆ ప్రేక్షకులే కాదు.. సెలెబ్రిటీలు సైతం

  ఆ ప్రేక్షకులే కాదు.. సెలెబ్రిటీలు సైతం

  ‘కార్తీక దీపం' సీరియల్ తెలుగులో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని సామాన్యులే కాదు.. సినీ సెలెబ్రిటీలు సైతం తిలకిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు బహిరంగంగానో.. సోషల్ మీడియా ద్వారానో వెల్లడించారు. ఇప్పటికే ఎంతో మంది ఈ సీరియల్‌ను ఉద్దేశించి కామెంట్లు కూడా చేశారు. దీంతో ‘కార్తీక దీపం'కు రెస్పాన్స్ పెరుగుతోంది.

  నిరుపమ్‌పై వెన్నెల కిశోర్ ఫన్నీ పోస్ట్

  నిరుపమ్‌పై వెన్నెల కిశోర్ ఫన్నీ పోస్ట్

  టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు వెన్నెల కిశోర్. తనదైన శైలి కామెడీతో కడుపుబ్బా నవ్వించే అతడు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఏదో ఒక అంశంపై ఫన్నీగా స్పందిస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ పరిటాలపై కిశోర్ ఊహించని పోస్ట్ చేశాడు.

  అది వాడుతూ... ఊహించని విధంగా

  అది వాడుతూ... ఊహించని విధంగా

  ‘కార్తీక దీపం' సీరియల్‌లో డాక్టర్ బాబు వల్ల తాను ప్రెగ్నెంట్ అయ్యానని మోనిత బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. దీంతో సీరియల్ కొత్త మలుపు తిరిగింది. దీన్ని ఉద్దేశించి వెన్నెల కిశోర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నిరుపమ్ ఫొటోను పోస్ట్ చేసి ‘ఎంత పని చేశావ్ డాక్టర్ బాబు' అంటూ ఫన్నీ పోస్ట్ చేశాడు. దీనికి బ్రహ్మానందం మీమ్‌ను కూడా జత చేశాడు. దీంతో ఇది వైరల్ అవుతోంది.

  English summary
  Karthika Deepam Is Top Serial in Telugu Television History. Now Tollywood Comedian Vennela Kishore Funny Post on Karthika Deepam Hero Nirupam Paritala.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X