Venu Swamy: హీరో అవ్వాల్సిన పల్లవి ప్రశాంత్ జీరో.. కారణాలు చెప్పిన వేణు స్వామి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే విభిన్నంగా సాగినప్పటికీ... వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సీజన్ విజేతగా నిల్చిన పల్లవి ప్రశాంత్... పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్... కాస్త సైలెంట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి.. పల్లవి ప్రశాంత్ విషయంపై స్పందించారు. ప్రశాంత్ విన్నర్ అవ్వడం... ఆ తర్వాత జీరో అవ్వడం... ఎందుకో కారణాలు చెప్పుకువచ్చాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
బుల్లితెరపై అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న షోల్లో బిగ్ బాస్ ఒకటి. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ షో.. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఏడవ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇక డిసెంబర్ 17న జరుపుకున్న గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈసీజన్ విన్నర్ గా ఓ రైతు బిడ్డ అవ్వడం.. అది కూడా కామన్ మ్యాన్ కు ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

అయితే బిగ్ బాస్ విజేతగా గెలిచిన పల్లవి ప్రశాంత్.. ఒకే ఒక్కరోజులో హీరో కావాల్సిన వాడు.. జీరోగా మారిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక ఫ్లాట్ ఫాం. మనిషికి సెలబ్రెటీ స్టేటస్ రావాడనికి ఇది ఉపయోగపడుతుంది. మరి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి.. టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ దానిని కాపాడుకోలేకపోయాడు. ఒకే ఒక్కరోజులో సీన్ రివర్స్ అయ్యింది.
తాజాగా ఈ విషయంపై ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి స్పందించాడు. వేణు స్వామి సెలబ్రెటీల జాతకం చెబుతూ ఉంటారనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన పలు విషయాలపై మాట్లాడారు. అందులో భాగంగానే పల్లవిప్రశాంత్ ఎలా జీరో అయ్యారో చెప్పుకవచ్చారు. వేణు స్వామి ఆ వీడియోలో... సెలబ్రెటీ కావడం ఈజీ.. కానీ ఆ స్టార్ డమ్ ను కాపాడుకోవడం కష్టం అంటూ వెల్లడించారు.

వేణు స్వామి మాట్లాడుతూ.. పల్లవి ప్రశాంత్... బిగ్ బాస్ విజేతగా నిలిచి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. విన్ అయ్యాక సెలబ్రెటీ స్టేటస్ వచ్చింది. కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు. దానికి కారణం... బిగ్ బాస్ ట్రోపీ గెలిచిన అనంతరం ర్యాలీ తీయొద్దని డీసీపీ.. పల్లవి ప్రశాంత్ కు దండం పెట్టి మరీ చెప్పాడు. ఆయన ఆ మాట విని ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పల్లవి ప్రశాంత్.. వచ్చిన స్టార్ డమ్ ను కాపాడుకోలేకపోయాడు. అందుకే ఈరోజు ఆయనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక వేణు స్వామి చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవును నిజమేనంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద బయటకు వచ్చారు.


Click it and Unblock the Notifications











