హిందూ సంఘాల ఆగ్రహం: తెలుగు సీరియల్ టైటిల్ మార్పు

ఈ ధర్నాతో జీ తెలుగు కార్యాలయం వద్ద ఆందోలనకర పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దు మనిగింది. సైఫాబాద్ పోలీసుల సమక్షంలో జరిగిన చర్చల్లో సీరియల్ టైటిల్ మార్చేందుకు చానల్ యజమానులు హామీ ఇచ్చారని నేతలు తెలిపారు.
కాగా... తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా ఆందోళన కారులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల హిందూ దేవతలను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని, వెంటనే రామ్ గోపాల్ వర్మ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకుంటే అతన్ని అడ్డుకుంటామని ఆందోళన కారులు తెలిపారు.


Click it and Unblock the Notifications











