బిగ్‌బాస్3 హోస్ట్‌పై వెంకటేష్ క్లారిటీ.. విక్టరీ ఏమన్నారంటే..
తెలుగు టెలివిజన్ రంగంలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకొన్న బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్3 సీజన్‌కు సంబంధించిన హడావిడి అప్పుడే మొదలైంది. మూడో సీజన్‌కు హోస్ట్ ఎవరనే చర్చ మీడియాలో విస్తృతంగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో తాను హోస్ట్‌గా మారుతున్నట్టు వస్తున్న వార్తలపై విక్టరీ వెంకటేష్ ఎలా స్పందించాడంటే..

బిగ్‌బాస్ మూడో సీజన్‌కు హోస్ట్‌గా
బిగ్‌బాస్1 షోకు రియాలిటీ షోకు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే మూడో సీజన్ నుంచి తప్పుకొంటున్నట్టు నాని ప్రకటించిన నేపథ్యంలో తర్వాత హోస్ట్ ఎవరనే విషయం చర్చనీయాంశమైంది. బిగ్‌బాస్2 ఫైనల్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన వెంకటేష్ మూడో సీజన్‌కు హోస్ట్ అనే మాట వినిపించింది.

ఎఫ్2 మూవీ ప్రమోషన్‌తో
ప్రస్తుతం ఎఫ్2 సినిమా ప్రమోషన్‌లో వెంకటేష్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి నటించారు. అలాగే తమన్నా, మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్లు. ఈ సినిమా ప్రమోషన్ సందర్బంగా బిగ్‌బాస్2 హోస్ట్ వ్యవహారంపై వెంకటేష్ స్పందించారు.

హోస్ట్‌గా నన్ను అడుగలేదని
బిగ్‌బాస్3 షోకు హోస్ట్‌గా వ్యవహరించమని మా టెలివిజన్ వాళ్లు నన్ను ఇప్పటి వరకు సంప్రదించలేదు. నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వస్తున్న వార్తల్లో నిజం లేదు. రూమర్ వచ్చిందంటే దానిని రూమర్‌గానే పరిగణించాలి అని వెంకటేష్ పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా?
అలాగే బిగ్‌బాస్3 షోకు హోస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పరిశీలనలో ఉందనే మాట కూడా వినిపిస్తున్నది. అయితే ఇలాంటి వార్తల్లో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే చిరంజీవిని సంప్రదించారా? లేదా అనే విషయం బయటకు రావాల్సి ఉంది. అప్పటి వరకు ఎలాంటి వార్త వచ్చిన ఊహగానంగానే భావించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











