రాత్రంతా పార్టీ చేసుకుందాం రా..!! సుడిగాలి సుధీర్‌కి హాట్ యాంకర్ బంపర్ ఆఫర్

సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం జనాల్లో యమ క్రేజ్ ఉంది ఈ జబర్దస్త్ కుర్రోడికి. కమెడియన్‌గా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ సుడిగాడు అమాంతం ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. దీంతో ఆడియన్స్ మాత్రమే కాదు యాంకర్స్ కూడా ఈ జబర్దస్త్ పోరడి వెంటబడుతున్నారు. బుల్లితెరపై అతనిపై పంచేస్తూ, రొమాన్స్ చేస్తూ కిక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హాట్ యాంకర్ రాత్రంతా పార్టీ చేసుకుందాం రా.. అంటూ సుధీర్‌ని కాకాపట్టింది. వివరాల్లోకి పోతే..

సుడిగాలి సుధీర్‌ బుల్లితెర రచ్చ

సుడిగాలి సుధీర్‌ బుల్లితెర రచ్చ

ఎప్పుడైతే సుడిగాలి సుధీర్‌ బుల్లితెరపై అడుగుపెట్టాడో.. అప్పటి నుంచే ఇతగాడి రచ్చ మొదలైంది. తనదైన కామెడీ టైమింగ్‌తో జబర్దస్త్ పంచులేస్తూ అమ్మాయిల గుండెల్లో గుణపాలు దింపడం ఈ కుర్రోడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే బుల్లితెర నటీనటులందరిలో అందరిలో ఎక్కువ రచ్చ చేసే పోరాడిగా సుడిగాలి సుధీర్ పేరు తెచ్చుకున్నాడు.

రష్మీతో సుడిగాడి రొమాన్స్.. హుషారెత్తించే జోడీ

రష్మీతో సుడిగాడి రొమాన్స్.. హుషారెత్తించే జోడీ

ఇకపోతే యాంకర్ రష్మీతో సుడిగాలి సుధీర్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఈ జోడీ కనిపిస్తే చాలు ఆ ఊపే వేరు.. వాళ్ళిద్దరి రొమాన్స్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే ఈ ఇద్దరితో ప్రతీ పండగకు స్పెషల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ హుషారెత్తిస్తుంటారు ప్రోగ్రామ్ నిర్వాహకులు.

రాత్రికి పార్టీకి రావాలంటూ ఆఫర్ యాంకర్ ఆఫర్

రాత్రికి పార్టీకి రావాలంటూ ఆఫర్ యాంకర్ ఆఫర్

అయితే సుధీర్‌తో రష్మీ ఒక్కతే కాదు.. తాను కూడా రెచ్చిపోగలను అని నిరూపిస్తూ రంగం లోకి దిగింది మరో యాంకర్ విష్ణుప్రియ. పోవేపోరా కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ తో రచ్చ రచ్చ చేస్తోంది. అయితే ఈ ఫిబ్రవరి 15న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కోసం సుధీర్‌తో డాన్స్ చేసిన యాంకర్ విష్ణుప్రియ.. రాత్రికి పార్టీకి రావాలంటూ ఆఫర్ చేసింది.

యాంకర్ విష్ణుప్రియ స్పెషల్ కిక్

యాంకర్ విష్ణుప్రియ స్పెషల్ కిక్

అయితే అది నిజమైన పార్టీ కాదు లెండి!. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ''ఆజ్ మేరే ఘర్ మే పార్టీ హై తూ ఆజానా'' అంటూ తమన్నా మహేష్ బాబుకు ఎలాంటి ఆఫర్ ఇచ్చిందో.. ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ కూడా సుడిగాలి సుధీర్ కి అదే ఆఫర్ చేసింది.

విష్ణుప్రియతో రెచ్చిపోయిన సుధీర్

తాజాగా విడుదలైన పోవేపోరా కొత్త ప్రోమాలో విష్ణుప్రియతో కలిసి రెచ్చిపోయి పర్ఫామ్ చేశాడు సుడిగాలి సుధీర్. ఇద్దరూ కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని డ్యాంగ్ డ్యాంగ్ పాటకు ఇరగదీసే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

Three Monkeys Movie Teaser Launch By Victory Venkatesh
హీరో అయిన సుడిగాడు

హీరో అయిన సుడిగాడు

ఇకపోతే ఇటీవలే సుడిగాలి సుధీర్ వెండితెరపై కాలుమోపి హీరో అవతారమెత్తిన సంగతి తెలిసిందే. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో వెండితెర గడప తొక్కిన సుధీర్.. ప్రస్తుతం ఇటు బుల్లితెర, అటు వెండితెరపై సత్తా చాటుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X