బిగ్ బాస్ సెట్ నుంచి వీడియో లీక్: నాగార్జున వెంట ఇద్దరు కంటెస్టెంట్లు.. ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం ప్రారంభం అయింది. అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ ఎపిసోడ్‌ను అక్కినేని నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ చేస్తున్నారు. మాజీ కంటెస్టెంట్లు అందరూ దీనికి హాజరవడంతో పాటు ప్రదర్శన కూడా ఇచ్చారు. ఆ తర్వాత సినీ తారల ఆటపాటలతో స్టేజ్ ఊగిపోతోంది. ఇప్పటికే హీరోయిన్లు మెహ్రీన్, ప్రణీత డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.
బిగ్ బాస్ ట్రోఫీ కోసం ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్‌లు పోటీ పడ్డారు. వీరిలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. గ్రాండ్ ఫినాలే గెస్టుగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, మోహ్రీన్ హౌస్‌లోకి ప్రవేశించారు. కంటెస్టెంట్లు అందరితో ఆటలు ఆడించిన ఆయన.. చివర్లలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న దేత్తడి హారికను ఎలిమినేట్ చేశారు. క్రెయిన్ ద్వారా ఆమెను హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో షోలో నలుగురు మిగిలారు.

ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్లిన లక్ష్మీ రాయ్.. ఆరియానా గ్లోరీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. దీంతో ఆమెను వెంట తీసుకుని వచ్చింది. దీంతో హౌస్‌లో ముగ్గురు మగ కంటెస్టెంట్లు అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మిగిలారు. వీరి నుంచి సోహెల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో అఖిల్ సార్థక్, అభిజీత్‌ను హోస్ట్ అక్కినేని నాగార్జున స్టేజ్ మీదకు తీసుకొస్తున్నాడు. ఇక, వీళ్లిద్దరిలో విజేతను మెగాస్టార్ చిరంజీవి ప్రకటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











