Vijay Devarakonda: ఆ ఫీలింగ్ లేదన్న విజయ్ దేవరకొండ... రౌడీ హీరోకు శ్రీముఖి పంచ్

హీరో విజయ్ దేవరకొండను మనం సిల్వర్ స్క్రీన్ పైనే చూశాం కదా.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేశారు. ఆయన స్టార్ మాలో ప్రసారం అయ్యే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఇక అక్కడి వారితో కలిసి విజయ్ రచ్చ చేశారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో విజయ్... అక్కడి వారితో సరదా సరదాగా గడిపారు. ఆ వివరాల్లోకి వెళితే...

బుల్లితెరపై సందడి చేస్తున్న నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ గ్రాండ్ ఫినాలేకు వచ్చేసింది. 11 వారాల పాటు ఉర్రూతలూగించిన ఈ షో.. రాబోయే వీకెండ్ లో ఫినాలే కోసం రంగం సిద్ధం అయింది. దీనికి సంబంధించిన ప్రోమోను సోమవారం స్టార్ మా ఛానెల్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ ప్రోమోలో విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఇక నెట్టింట ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Vijay Devarakonda Chief Guest of Neethone Dance Grand Finale and Promo Released August 21st

నీతోనే డ్యాన్స్ గ్రాండ్ ఫినాలే ప్రోమో 7 నిమిషాలకుపైగా ఉంది. దీనికి స్పెషల్ గెస్ట్ గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండ ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా చేసేందుకు బుల్లితెరపై సందడి చేశారు. అయితే ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి పంచ్ వేయడం ఆకట్టుకుంది.

ఇక ఈ ప్రోమోలో గ్రాండ్ ఫినాలేలోని డ్యాన్సర్లను ఎవరి పెళ్లెప్పుడైందో అడిగాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా మీ పెళ్లెప్పుడు అని విజయ్ ను శ్రీముఖి అడగ్గా... విజయ్ స్పందిస్తూ.. అందరితో మాట్లాడుతున్నా అంటాడు. అంటే అందరినీ చేసుకోలేరు కదా అంటూ పక్క నుంచి శ్రీముఖి పంచ్ వేస్తుంది. దీంతో అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వుతారు.

Vijay Devarakonda Chief Guest of Neethone Dance Grand Finale and Promo Released August 21st

ఇక విజయ్ ఈ ప్రోమోలో తన పెళ్లి గురించి స్పందించాడు. అందరూ తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నా తనకు ఆ ఫీలింగ్ లేదని విజయ్ చెప్పుకొచ్చాడు. మనవళ్లు కావాలని తన తల్లిదండ్రులు అడుగుతున్నారన్న విజయ్... వాళ్ల పోరు పడలేక వాళ్లనే మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినట్లు తెలిపారు. ఇక ఈ షోలో జడ్జి సదాతో విజయ్ ఫ్లర్ట్ చేశాడు. తాను ఎన్నో సినిమాలు చూశానని, తమ యూత్ లో మీరు షేక్ చేసెటోళ్లు అని సదాతో విజయ్ అనడంతో ఆమె సిగ్గుపడుతుంది.

ఇక నీతోనే డ్యాన్స్ గ్రాండ్ ఫినాలే మరింత గ్రాండ్ గా ముగియనుందని తెలుస్తోంది. ప్రోమో చూస్తుంటే.. ఒక్కో టీమ్ తమ డ్యాన్స్ తో ఇరగదీసింది. నటరాజ్ మాస్టర్, సందీప్, అమర్ ఇలా.. ఒక్క జంట తమ కళ్లు చెదిరే డ్యాన్స్ లతో ఇటు ప్రేక్షకులను, అటు జడ్జీలను ఆకర్షించింది. ఈ గ్రాండ్ ఫినాలేలో విజేత పేరును విజయ్ అనౌన్స్ చేయనున్నాడు. ఈ షో చూడాలంటే.. ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X