twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌కి పోటిగా మరో రియాలిటీ షో.. విజయ్ దేవరకొండ హోస్ట్.. నిజమెంత?

    |

    కరోనా వైరస్ దెబ్బకి న్యూస్ ఛానెల్స్ పరిస్థితి బాగానే ఉన్నా కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారింది. వేసిన సినిమానే మళ్ళీ మళ్ళీ ప్రసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరస్ ధాటికి కొత్తగా ఏం చేయడానికి వీలు పడటం లేదు. ఇకపోతే త్వరలో బిగ్ బాస్ షో రానుంది. అది స్టార్ట్ అయితే స్టార్ మాకు తిరుగుండదు. మిగతా ఛానెల్స్ టీఆర్పీ విషయంలో మరింత పోటీ ఎదుర్కోక తప్పదు.

    బ్యాక్ గ్రౌండ్ వర్క్..

    బ్యాక్ గ్రౌండ్ వర్క్..

    ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ సీజన్ కోసం ఓ వర్గం ఆడియేన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కంటెస్టెంట్ ఎవరనే రూమర్స్ రోజుకోటి వైరల్ అవుతోంది. ఇక హోస్టింగ్ ఎవరు చేస్తారనే విషయం కూడా అభిమానుల్లో ఎంతగానో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం షోకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    పోటీగా మరో షో..

    పోటీగా మరో షో..

    ఇక బిగ్ బాస్ షో మొదలైతే మిగతా ఛానెల్స్ లో కాస్త టెన్షన్ మొదలవ్వడం పక్కా. అందుకే ఆ షోకి పోటీని ఇవ్వాలని ఏదో ఒక విదంగా ప్రయత్నాలు చేయాలని కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ప్లాన్స్ వేస్తున్నాయి. ఇక జీ తెలుగులో కూడా రియాలిటీ షోకి ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం. టాప్ మోస్ట్ యాంకర్స్ తో పాటు ఒక స్టార్ హీరో కూడా ఆ షోలో హోస్ట్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

    విజయ్ అంటే.. కష్టమే?

    విజయ్ అంటే.. కష్టమే?

    మరొక ఆశ్చర్యపరిచే రూమర్ ఏమిటంటే.. బిగ్ బాస్ షోకి దాదాపు నాగార్జున హోస్ట్ అని ఫిక్స్ అవ్వగా.. జీ తెలుగులో స్టార్ట్ కాబోయే కొత్త రియాలిటీ షోకి విజయ్ దేవరకొండను అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. నిజంగా ఇది నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే విజయ్ ఇప్పటికే బిజీ షెడ్యూల్స్ తో ఉన్నాడు. ఆయన వద్ద డేట్స్ లేవని కొంతమంది కథలు చెప్పడానికి కూడా రావడం లేదు.

    వెయిట్ చేయాల్సిందే..

    వెయిట్ చేయాల్సిందే..

    ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాలను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో బిగ్ బాస్ 4 హోస్ట్ లిస్ట్ లో విజయ్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

    English summary
    While the news channels' condition is good for coronavirus attacks, the situation for some entertainment channels is much worse. The film was to be aired again and again. What's new in the virus is not allowing it. If not, the Bigg Boss Show is coming soon. The rest of the channels should be more competitive in terms of TRP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X