విజయ్ దేవరకొండ ఇంటి నుంచే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సుమ.. లైగర్ గుట్టు కూడా తెలిసిపోయింది!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాంకర్ గా క్రేజ్ అందుకున్న సుమ దాదాపు సినిమా ఇండస్ట్రీలో అందరితోనూ ఫ్రెండ్లిగానే ఉంటారు. ఒకప్పుడు టీవీ షోలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ బిజీబిజీగా ఉండే సుమ లాక్ డౌన్ వలన కొన్నాళ్ళు వాటికి దురమయ్యింది. టీవీ షోలు మొదలైనప్పటికి ఇంకా ఈవెంట్స్ మాత్రం అంతగా స్టార్ట్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన సుమ ఒక కొత్త బిజినెస్ ను రౌడి స్టార్ తో లాంచ్ చేయించింది.

సుమ ఈవెంట్ లో ఉంటే..
యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎలాంటి షో చేసినా కూడా వీలైనంత ఎంటర్టైన్మెంట్ అందించడానికి చూస్తారు. ఇక సినిమా ఈవెంట్స్ లలో ఆమె ఉంటే చిత్ర యూనిట్ సబ్యులకు ఒక ధైర్యం కూడా ఉంటుంది. జనాలకు బోర్ కొట్టికచకుండా తనదైన మాటలతో ఆకట్టుకుంటోంది.

సొంతంగా కొత్త యూ ట్యూబ్ ఛానెల్
ఇక లాక్ డౌన్ అనంతరం సుమ యాంకరింగ్ కెరీర్ లో ఒక పెద్ద గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఆ మధ్య ఖాళీగా ఉండకుండా సుమక్క అనే ఒక యూ ట్యూబ్ ఛానెల్ తో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఛానెల్ ను సుమ మరొక సంస్థతో కలిసి కొనసాగించారు. అయితే ఈసారి సొంతంగా అలా యూ ట్యూబ్ ఛానెల్ ను క్రియేట్ చేసుకున్నారు.

విజయ్ దేవరకొండ ఇంట్లోనే లాంచ్..
సుమ యూ ట్యూబ్ ఛానెల్ కు సబ్‌స్క్రైబర్స్ పెరగాలని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కూల్ గా లాంచ్ చేయించారు. ఇక నుంచి వంట వీడియోలు, హెల్త్ టిప్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వీడియోలు సుమ ఛానెల్ లోనే వస్తాయట. విజయ్ దేవరకొండ మా బంగారు కొండ అంటూ మాటలతో పొగిడిన సుమ జాడీలో ఒక ప్రత్యేకమైన కానుక కూడా ఇచ్చింది.
విజయ్ కోసం మామిడిపండ్లు
విజయ్ దేవరకొండకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే సుమ వారి తోటలో సహజంగా పండించిన మామిడి పండ్లను విజయ్ కు ఇచ్చింది. ఇక వాటిని చూసి సంతోషించిన రౌడీ స్టార్ అందులో నుంచే ఒక మొబైల్ ఫోన్ ద్వారా సుమ కొత్త యూ ట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేశారు. అందుకు సుమ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

లైగర్ అప్డేట్..
అంతే కాకుండా విజయ్ దేవరకొండ ఈ ఛానెల్ ద్వారా లైగర్ కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాడు. దాదాపు 65% షూటింగ్ ఫినిష్ అయ్యిందని లార్జ్ స్కెల్ ఉన్న సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నట్లు చెప్పారు. మిగిలిన షూటింగ్ పార్ట్ కోసం బిగ్ సెట్స్ నిర్మించాలని వేల మంది వరకు అవసరం పడుతుంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయాలా వద్దా అనే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పాడు. ఒకవేళ స్టార్ట్ అయితే వీలైనంత తొందరగా ఫినిష్ చేస్తామని కూడా విజయ్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











