బిగ్ బాస్ తెలుగు 3: ఆ హీరో ఒప్పుకుంటే రౌడీలు షోను కంట్రోల్ చేస్తారా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విషయంలో నిర్వాహకులు చాలా కష్టపడుతున్నారు. ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ ఉన్న స్టార్ అయితే తప్ప షో టీఆర్పీ రేటింగ్స్ పెరిగే అవకాశాలు లేక పోవడంతో అందుకు తగిన హీరోను హోస్ట్‌గా ఒప్పించడానికి మల్లగుల్లాలు పడుతున్నారు.
మొదటి సీజన్ సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేసి హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రావడానికి కారణమైన యంగ్ టైగర్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ... 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ వల్ల తారక్ నో చెప్పారు. రెండో సీజన్ హోస్ట్ చేసిన నాని మరోసారి నా వల్ల కాదంటూ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.

సీనియర్ స్టార్ల వైపు మొగ్గు చూపడం లేదా?
గతంలో తెలుగులో ప్రసారమైన కొన్నిరియాల్టీ షోలను చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ స్టార్లు హోస్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ లాంటి షోలకు అలాంటి సీనియర్ స్టార్లు సూటవ్వరనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారట.

తెరపైకి విజయ్ దేవరకొండ పేరు
తాజాగా ‘బిగ్ బాస్ 3' విషయంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. అతడిని ఎలాగైనా ఒప్పించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. అయితే విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇంకా ఎలాంటి అంగీకారం తెలుపలేదని టాక్.

విజయ్ ఒప్పుకుంటే రౌడీలే షోను కంట్రోల్ చేస్తారేమో?
విజయ్ దేవరకొండకు యువతలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అభిమానులను ముద్దుగా రౌడీస్ అని పిలుచుకుంటాడు. అతడి ‘రౌడీ' బ్రాండ్ లాంచ్ అయ్యాక రౌడీ అనే పదానికి అర్థమే మారిపోయింది. విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 3 హోస్ట్ వస్తే.... రౌడీలుగా పిలవబడే అతడి ఫ్యాన్స్ కంట్రోల్‌లోకి షో వెళుతుందేమో?

గత సీజన్‌ను కంట్రోల్ చేసిన కౌశల్ ఆర్మీ
‘బిగ్ బాస్ తెలుగు 2' రియాల్టీ షోను పూర్తిగా కౌశల్ ఆర్మీ కంట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. వీక్లీ ఎలిమినేసన్లతో పాటు విజేత వరకు కౌశల్ ఆర్మీ ప్రభావం బాగా కనబడింది. ‘బిగ్ బాస్ 3' విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











