నీవు నీతులా? జబర్దస్త్ సంగతేంటి? అనసూయపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్.. పాత వీడియోతో బండారం బయటకు
యాంకర్, యాక్టర్ అనసూయ మరోసారి వివాదంలో కూరుకుపోయారు. లైగర్ సినిమా తర్వాత మరోసారి విజయ్ దేవరకొండను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ట్విట్ చేయడం వివాదంగా మారింది. గతంలో జరిగిన సంఘటనలను, విజయ్‌తో ఉన్న వ్యక్తిగత అభిప్రాయ బేధాలను మరోసారి బయటపెట్టుకొన్నది. దాంతో అనసూయపై నెటిజన్లు, విజయ్ దేవరకొండ అభిమానులు ఎలా ట్రోల్ చేశారంటే..

అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ సమయంలో
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ చేత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చెప్పించిన బూతు డైలాగ్స్‌ను అనసూయ అభ్యంతరం చెప్పింది. అలాంటి పదాలు సినిమాల్లో ఎలా వాడుతారు. ఒక అమ్మను అలా తిట్టడం బాగాలేదు. మహిళల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయి అంటూ అనసూయ అర్జున్ రెడ్డి విడుదల సమయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

విజయ్ దేవరకొండ క్లారిటీ
అయితే అనసూయ భరద్వాజ్ అభిప్రాయాలపై విజయ్ దేవరకొండ ఓ టెలివిజన్ ఛానెల్ ఇంటర్వ్యూలో స్పందించారు. ఎవరికి సంబంధించినా.. నాతో ఎలాంటి రిలేషన్ ఉన్న అమ్మాయిని తిట్టినా, వేధించినా ప్రతీ ఒక్కరి నుంచి అలాంటి బూతు మాటలు వస్తాయి. ఆ మాటను వాడటంలో తప్పు లేదనేది నా అభిప్రాయం అని విజయ్ దేవరకొండ తన క్లారిటీని ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమాలో అనసూయకు ఓ మంచి పాత్రను కూడా ఇవ్వడంతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడిందనుకొన్నారు.

లైగర్ రిలీజ్ తర్వాత అనసూయ
అయితే లైగర్ సినిమా రిలీజ్ తర్వాత తన మరోసారి ఆ వివాదాన్ని బయటకు తీసి.. విజయ్ దేవరకొండతో కెలికిందనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతున్నది. లైగర్ మూవీ డిజాస్టర్ టాక్ రిపోర్టులు మీడియాలో వస్తున్న నేపథ్యంలో అనసూయ తన పైత్యాని ట్వీట్ రూపంలో బయటపెట్టారు. 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!' అని ట్వీట్ చేశారు.
విజయ్‌పై అక్కసు ఎందుకు అంటూ
అనసూయ ట్వీట్‌పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ స్పందిస్తూ.. 'ఏమన్నాడు విజయ్ నిన్ను..? ఎందుకంత అక్కసు..? ఇండస్ట్రీలో ఉన్న మీకు మీరే సపోర్ట్ చేసుకోకపోతే ఇంకా బయటి వాళ్ళు ఎలా చేస్తారు.. అసలే కరోనా వల్ల ఇండస్ట్రీలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా అందరూ ఇబ్బంది పడ్డారు, పడుతున్నారు.. నువ్ విజయ్ గురించి మాట్లాడితే గురివింద గింజ అని వాళ్ళు అనలేరా?' అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు
అనసూయ వీడియోను షేర్ చేసి
అయితే అనసూయను మరో నెటిజన్ ట్రోల్ చేస్తూ.. ఆమె హోస్ట్ చేసిన జాక్‌పాట్ అనే షోకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో.. కిక్ అంటే మందుతోనే వస్తుందా? అనసూయతో రాదా అంటూ వయ్యారంగా ఫోజు పెట్టింది. దాంతో ఓ కమెడియన్.. నీది లేస్తుంది? నాది పడుకొంటుంది అంటూ కామెంట్ చేశాడు. దాంతో అనసూయ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు అంటూ కామెంట్ చేసింది.
జబర్దస్త్‌కు యాంకరింగ్ చేస్తూ
మరో నెటిజన్ ఘాటుగా స్పందిస్తూ.. డబ్బు తీసుకొని మహిళలపై బూతులు మాట్లాడే షోకు యాంకర్‌గా వ్యవహరించే నీవు..మాకు నీతులు చెప్పనక్కర్లేదు. మీరు మాకు జానం పంచనక్కర్లేదు. అక్కడ బూతులను ఎంజాయ్ చేయడం.. ఇక్కడ జానం గురించి మాట్లాడటంలో బుద్ది ఉందా అనసూయ అంటూ నెటిజన్ ఘాటుగా స్పందించారు.

నీవు నీతులు చెప్పడం దారుణం
జబర్దస్త్ షో నడిచేందే బూతులు, డబుల్ మీనింగ్ జోక్స్, బాడీ షేమింగ్ డైలాగ్‌తో, అలాంటి షోకు చాలా సంవత్సరాలు యాంకర్‌గా ఉన్న నువ్వు.. ఇప్పుడు నీవు నీతులు చెప్పడం దారుణం అంటూ కామెంట్ చేశారు. ఒక సినిమాను సినిమాగా చూడవు. నీ డ్రస్సులను కామెంట్ చేయొద్దు. మూవీలో డైలాగ్ చెప్పిన దానిని బట్టి ఒకడి క్యారెక్టర్ డిసైడ్ చేస్తావు. వాడు నాశనం కావాలని కర్మ సిద్దాంతం చెబుతావా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











