విజయ్ ‘మాస్టర్’ మేనియా.. ఇండియాలో నెంబర్ వన్ టీజర్.. దళపతి దుమ్ములేపాడు!!

దళపతి విజయ్ మ్యానియా గురించి అందరికీ తెలిసిందే. కేవలం కోలీవుడ్‌లోనే కాదు మొత్తం సౌత్‌లో విజయ్ స్టార్డం వెలిగిపోతుంది. మలేషియా, బ్యాంకాక్, సింగపూర్ వంటి వివిద దేశాల్లో విజయ్ సత్తా చాటుతుంటాడు. ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ మాస్టర్ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సర్కార్, మెర్సెల్, విజిల్ వంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో మంచి ఊపులో ఉన్న విజయ్ మాస్టర్ సినిమాతో మళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు.

 కరోనాతో ఆలస్యం..

కరోనాతో ఆలస్యం..

ఖైదీ సినిమాతో లోకేష్ కనకరాజ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. అందుకే విజయ్ లాంటి హీరో పిలిచి మరీ చాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విజయ్‌తో ‘మాస్టర్' లాంటి అద్భుతైన సబ్జెక్ట్‌ను తీశాడు. విజయ్, విజయ్ సేతుపతి కాంబోలో ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా కరోనా, లాక్డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

దీపావళి స్పెషల్..

దీపావళి స్పెషల్..

మామూలుగా అయితే దీపావళి స్పెషల్‌గా మాస్టర్ సినిమాను రిలీజ్ చేయాల్సింది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఆకలిని తీర్చారు. మాస్టర్ టీజర్‌లో ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని మూమెంట్లు ఉన్నాయి. సగటు సినీ ప్రేక్షకుడు సైతం వావ్ అనిపించేలా ఎన్నో ఎలివేషన్ సీన్స్ ఉండటంతో టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

మొదటి టీజర్..

మొదటి టీజర్..

మాస్టర్ టీజర్ సోషల్ మీడియాలో నయా రికార్డులు స‌ృష్టిస్తోంది. 24 గంటల్లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ టీజర్, మోస్ట్ వ్యూయ్డ్ ఇండియన్ టీజర్.. కేటగిరీలో మాస్టర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మొత్తంగా ఈ టీజర్ 24 గంటల్లో 20 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి విజయ్ అభిమానులు తమ సత్తాను చాటారు.

Recommended Video

Vijay Sethupathi exits Muttiah Muralitharan biopic 800 | 800 The Film | Filmibeat Telugu
 వ్యూస్, లైక్స్..

వ్యూస్, లైక్స్..

మాస్టర్ టీజర్ నిమిషంలో.. 100K, మూడు నిమిషాల్లో 200K, ఏడు నిమిషాల్లో 300K, 12 నిమిషాల్లో 400K , పది హేను నిమిషాల్లో 500K, 78 నిమిషాల్లో 1Million వ్యూస్‌ను కొల్లగొట్టింది. మొత్తంగా 24 గంటల్లో 20 మిలియన్ల వ్యూస్, 1.85 మిలియన్ లైకులను కొల్లగొట్టింది. ఇలా మాస్టర్ టీజర్ సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X