Virupaksha: విరూపాక్ష సెన్సేషన్.. సాయి తేజ్ సినిమా మరో రికార్డు
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి పరిచయం అయినా తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ.. సుప్రీమ్ హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు సాయి ధరమ్ తేజ్. ఆ మధ్య వరుస హిట్లతో సందడి చేసిన అతడు.. 'రిపబ్లిక్'తో మళ్లీ వెనుక పడ్డాడు. దీనికితోడు యాక్సిడెంట్ అవడంతో యాక్టింగ్‌కు చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే 'విరూపాక్ష' అనే సినిమాను చేశాడు. హర్రర్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే 'విరూపాక్ష'. భయపెట్టే కథతో రూపొందిన ఈ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి. ఇలా ఈ చిత్రం హవాను చూపిస్తూ వచ్చింది. దీంతో ఫుల్ రన్‌లో ఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 49 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 100 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా నిర్మాతలకు రూ. 25 కోట్లు వరకూ లాభాలు వచ్చాయి. ఇక, ఓటీటీలోనూ ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

థియేటర్లు, ఓటీటీలో చాలా రోజుల పాటు సందడి చేసిన 'విరూపాక్ష' మూవీ.. ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఏకంగా అర్బన్ ఏరియాలో 11.68 టీఆర్పీ రేటింగ్ లభించింది. అలాగే, రూరల్ ప్లస్ అర్బన్‌లో కలిపి 10.03 రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన చిత్రాలు కూడా ఇంత ఎక్కువగా రేటింగ్‌ను రాబట్టలేకపోయాయి. దీనికితోడు ఓటీటీల హవా నడుస్తోన్న ఈరోజుల్లో ఇంత రేటింగ్ అంటే రికార్డే అనాలి.
ఇదిలా ఉండగా.. సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కలయికలో వచ్చిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











