100 కోట్లు కొట్టిన సూపర్ హిట్ మూవీకి 0.99 రేటింగ్.. అది ఏ సినిమానో తెలుసా?
తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు టాలెంటెడ్ హీరో విశాల్. మొదటి నుంచీ హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా మూవీలు చేస్తోన్న అతడు.. చాలా కాలం సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది 'మార్క్ ఆంటోనీ' చేశాడు.
హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రమే 'మార్క్ ఆంటోని'. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ముఖ్యంగా ఈ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్టుతో రావడంతో ఆరంభంలోనే దీనిపై బజ్ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల అయింది.

విశాల్ హీరోగా నటించిన 'మార్క్ ఆంటోనీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన వచ్చింది. తెలుగులో కూడా మంచి టాకే వచ్చిన రెస్పాన్స్‌ను అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఫుల్ రన్‌లో ఈ చిత్రం రూ. 100 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తద్వారా విశాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఇది రికార్డు సాధించింది.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన 'మార్క్ ఆంటోనీ' సినిమాకు థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాంపైన కూడా మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ చిత్రం తెలుగు వెర్షన్ జీ తెలుగు చానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అయితే, ఊహించని విధంగా ఇక్కడి ప్రేక్షకులను దీనికి కోలుకోలేని షాక్‌ను ఇచ్చారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మార్క్ ఆంటోనీ' చిత్రానికి ఇటీవలే జీ తెలుగులో ప్రదర్శితం అయిన సమయంలో అర్బన్ ఏరియాలో 1.28రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 0.99 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. తద్వారా కోలీవుడ్ చరిత్రలో తెలుగులో చాలా తక్కువ రేటింగ్ సాధించిన చిత్రంగా 'మార్క్ ఆంటోనీ' నిలిచింది.
ఇదిలా ఉండగా.. తమిళ హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మార్క్ ఆంటోని' సినిమాలో రీతూ వర్మ, సునీల్, అభినయశ్రీ, సెల్వరాఘవన్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











