డబుల్ ధమాకా ప్లాన్ చేసిన బిగ్ బాస్: ఈ సీజన్‌లో ఇద్దరు హాట్ యాంకర్లతో రచ్చ!
తెలుగులో ఇప్పటి వరకు ప్రసారం అయిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' కొంత ప్రత్యేకమనే చెప్పాలి. సరికొత్త థీమ్‌తో వచ్చిన ఈ షో తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో ప్రజాదరణను అందుకుంది. అందుకే మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ను సైతం సంపాదించుకుంది. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో... నాలుగో దానిని కూడా ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో డబుల్ ధమాకా ఉండబోతున్నట్లు తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
Recommended Video

హడావిడి లేకున్నా హాట్ టాపిక్
హిందీ సహా పలు భాషల్లో ఎప్పటి నుంచో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం అవుతోంది. తెలుగులో మాత్రం మూడేళ్ల క్రితమే ఇది ప్రారంభం అయింది. ఇది మొదలయ్యే సమయంలో ఏమాత్రం అంచనాలు లేవు. అందుకే హడావిడి లేకుండానే మొదటి సీజన్ స్టార్ట్ అయింది. ఇక, మూడో సీజన్ నాటికి పలు వివాదాల కారణంగా ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

మూడు సీజన్లు.. ఒకదానికి మించి మరోటి
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి దానిని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. అందులో యాక్టర్ శివ బాలాజీ విజేతగా నిలిచాడు. నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌ను కౌశల్ మందా గెలుపొందాడు. ఇక, అక్కినేని నాగార్జున సారథ్యంలో నడిచిన మూడో దానిలో రాహుల్ సిప్లీగంజ్ ట్రోఫీని గెలుచుకున్నాడు.

టెలివిజన్ రికార్డులు బద్దలు.. కారణం వీళ్లే
ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగులో ప్రారంభం అయింది బిగ్ బాస్ షో. కానీ, మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్ వల్ల ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. మధ్యలో వివాదాల కారణంగానూ టీఆర్పీ భారీగా వచ్చింది. ఇక, నాగ్ హోస్ట్ చేసిన మూడో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ టెలివిజన్ చరిత్రలోనే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించి సంచలనం సృష్టించింది.

అధికారిక ప్రకటన.. టీజర్‌కు భారీ స్పందన
మూడు సీజన్లు పూర్తయిన బిగ్ బాస్... తర్వాతి దానిని త్వరలోనే ప్రారంభించబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి సమయంలో నాలుగో సీజన్‌పై స్టార్ మా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఓ టీజర్‌ను కూడా వదిలింది. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.

ఫోటోలు బయటకు.. హోస్ట్ ఎవరో క్లారిటీ
నాలుగో సీజన్‌కు సంబంధించి తెరపైకి వచ్చిన ఊహాగానాల్లో ఎక్కువ శాతం హోస్ట్ గురించే ఉన్నాయి. దీనికి మరో హీరో హోస్ట్ చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, తాజాగా అక్కినేని నాగార్జున షూటింగ్‌లో పాల్గొన్నట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వదిలాడు. దీంతో నాలుగో సీజన్‌ను ఆయనే హోస్ట్ చేయబోతున్నాడని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

డబుల్ ధమాకా ప్లాన్ చేసిన బిగ్ బాస్
కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ -4లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సీజన్‌లో ఇద్దరు హాట్ యాంకర్లు పాల్గొనబోతున్నారట. వాళ్లెవరో కాదు... ‘పోవే పోరా' ఫేం విష్ణు ప్రియ, ‘రాఖీ' ఫేం మంజూష అని టాక్.

ఇద్దరు హాట్ యాంకర్లతో రచ్చ.!
ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న యాంకర్లలో విష్ణు ప్రియ, మంజూష ఇద్దరూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లే. అందుకే వీళ్లిద్దరినీ ఈ సీజన్ కోసం తీసుకున్నారని సమాచారం. ఈ ఇద్దరు యాంకర్లు అల్లరితో రచ్చ రచ్చ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇక, వీళ్లతో పాటు పూనమ్ బజ్వా, హేమచంద్ర, నందూ, రఘు మాస్టర్, మంగ్లీ తదితరులు ఇందులో పాల్గొంటారని వినికిడి.


Click it and Unblock the Notifications











