Bigg Boss Voting : షాకిచ్చేలా ఓటింగ్, లాస్ట్ మినిట్‌లో ఆమె ఔట్?.. ఫైనల్‌కు ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8లో భాగంగా మరికొద్దిగంటల్లో 14వ వారానికి ఎండ్ కార్డ్ పడనున్న సంగతి తెలిసిందే. టికెట్ టూ ఫినాలే టాస్క్‌లు హోరాహోరీగా జరుగుతుండగా.. టాస్క్‌లలో గెలిచిన వారికి ప్రేక్షకులను ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నాడు బిగ్‌బాస్. మరో వారం రోజులతో బిగ్‌బాస్ తెలుగు 8 విజేత ఎవరో తేలిపోనుంది . ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో పరిశీలిస్తే.

ప్రస్తుతం హౌస్‌లో ఉండి తాను ఇచ్చిన టాస్క్‌లలో గెలిచిన కంటెస్టెంట్స్‌కి ఓట్లు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నాడు బిగ్‌బాస్ . ఇప్పటికే నబీల్, ప్రేరణ, విష్ణుప్రియలు టాస్క్‌లలో గెలిచి ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించారు. శుక్రవారం నాడు ఓటు అప్పీట్ చేసుకునేందుకు నిఖిల్ - గౌతమ్‌లకి రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం ఎవరి టీ షర్ట్‌పై తక్కువ రంగు ఉంటుందో వారే గెలిచినట్లు. ఫిజికల్ గేమ్స్‌లో నిఖిల్- గౌతమ్‌లు ఎలా పోరాడతారో తెలిసిందే. దీనికి తగినట్లుగానే వీరిద్దరూ రెండు పులుల్లా పోరాడారు. గౌతమ్ టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ చివరికి విజయం నిఖిల్‌నే వరించింది.

Vishnu Priya and rohini are danger zone in 14th week voting in bigg boss telugu 8

గౌతమ్ పోరాటాన్ని చూసిన బిగ్‌బాస్ ప్రేక్షకులు గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌తోనూ ఇదే రంగు పడుద్ది టాస్క్‌లో ఓడిపోయిన దృశ్యాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక టాస్క్‌లో గెలిచిన నిఖిల్ ఇన్‌ఫినిటీ రూమ్‌కి వెళ్లి ప్రేక్షకులతో ఓటు అప్పీల్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు నన్ను హౌస్‌లో ఉంచినందుకు థ్యాంక్స్ చెప్పిన నిఖిల్.. ఇంకో రెండు వారాల్లో ఫలితం తేలబోతుందన్నాడు. గేమ్ ప్రాసెస్‌లో కొన్ని తప్పులు చేశానని.. అందుకు తనను క్షమించాలని , మీ నిఖిల్ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటాడని చెప్పాడు. తెలుగు ప్రజలు తనను గెలిపించాలని నిఖిల్ కోరాడు.

ఇక ఈ వారంతో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, తన్నుకోవడాలకు చెక్ పడనుంది. నెక్ట్స్ వీక్ మొత్తం ఇంటి సభ్యులకు వారి జర్నీని చూపించి, బిగ్‌బాస్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీతో ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే జరగబోతుండగా.. అప్పటి వరకు హౌస్‌లో ఎంతమంది మిగులుతారో చూడాలి.

Vishnu Priya and rohini are danger zone in 14th week voting in bigg boss telugu 8

ఇదిలాఉండగా .. బిగ్‌బాస్ తెలుగు 8లో 14వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే . అవినాష్ తప్పించి నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, రోహిణిలు నేరుగా నామినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను చూస్తే.. గౌతమ్ 23.52 శాతం ఓటింగ్‌తో తన నెంబర్‌వన్ ప్లేస్‌ని కొనసాగిస్తున్నాడు. తర్వాత నిఖిల్ (21 శాతం), నబీల్ ( 16 శాతం), ప్రేరణ (13 శాతం)తో సేఫ్ జోన్‌లో ఉన్నారు . అయితే అనూహ్యంగా టాప్ ప్లేస్‌లో ఉన్న విష్ణుప్రియ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ప్రస్తుతానికి విష్ణుప్రియ (12.67 శాతం), రోహిణి (12.14 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో నిలిచారు.

Vishnu Priya and rohini are danger zone in 14th week voting in bigg boss telugu 8

డేంజర్ జోన్‌లో నిలిచిన విష్ణుప్రియకు స్ట్రాంగ్ పీఆర్‌తో పాటు సోషల్ మీడియాలో భారీ మద్ధతు ఉండటంతో ఆమె గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిణి తొలిసారిగా నామినేషన్స్‌లో రాగా.. ఆమె ఈ వారం గట్టిగా పోరాడినప్పటికీ ఆటను ఇన్‌ఫ్లూయెన్స్ చేసే రేంజ్‌లో టాస్క్‌లు పడకపోవడంతో ఆమె ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అయితే ఫైనల్ నాటికి రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు (గౌతమ్, అవినాష్, రోహిణి) , ఓజీ క్లాన్ నుంచి (నిఖిల్, ప్రేరణ, నబీల్) ఉండాలని బిగ్‌బాస్ డిసైడ్ అయితే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X