సమంత ఐటెమ్ సాంగ్ తో విష్ణు ప్రియా హాట్ డ్యాన్స్.. చిన్న స్కర్ట్ లో ఘాటైన స్టెప్పులు!
ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం బుల్లితెరపై ప్రోగ్రాంలలో మాటలతో ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ వారిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం యాంకర్స్ అంటే కేవలం మాటలతో మెప్పించేవారు మాత్రమే కాదు. గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఆ విషయంలో హాట్ యాంకర్స్ లిస్టులో విష్ణు ప్రియ కూడా టాప్ లిస్టులో లో ఉన్నారు అని చెప్పవచ్చు. విష్ణు ప్రియ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత ఆమె మరొక హాట్ డాన్స్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అనే చెప్పాలి.

ఖాళీగా ఉండకుండా..
విష్ణు ప్రియా కేవలం యాంకర్ గానే కాకుండా వెండితెరపై కూడా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్యకాలంలో ఈటీవీ ప్లస్ లో వచ్చిన పోవే పోరా షో ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వివిధ రకాల రియాలిటీ షోలలో కూడా తనదైన శైలిలో యాంకరింగ్ చేసి మంచి క్రేజ్ అందుకుంది. ఖాళీగా ఉండకుండా ఇండస్ట్రీలో ఏదో ఒక పనితో ఆమె బిజీగా దర్శనమిస్తోంది.

ఘాటైన స్టెప్పులతో
కేవలం యాంకరింగ్ తోనే కాకుండా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుకుంటోంది. ఆమె ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే విడుదల అవుతూ ఉంటాయి. అంతే కాకుండా మధ్యమధ్యలో గ్లామర్ షోను ప్రజెంట్ చేస్తూ ఘాటైన వీడియోలతో కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఆమె మరొక సారి పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ లో ఘాటైన స్టెప్పులతో ఎంతగానో ఆకర్షించింది.
పుష్ప సాంగ్ వైరల్
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమాలోని సమంత ఐటమ్ సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఉ అంటావా ఉ ఊ అంటావా అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక థియేటర్స్ లో సినిమాలో పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థం అయింది. ఈ పాటను మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహన్ పాడగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రచించారు.

హాట్ స్టెప్పులు వేసిన విష్ణు ప్రియ
ఈ పాటలో మాధుర్యం ఎంత ఉన్నా కూడా సమంత వేసిన స్టెప్పులు మరింత కిక్కు ఇచ్చింది అనే చెప్పాలి. ఇక ఆ స్టైల్ లో మరికొంతమంది గ్లామర్ బ్యూటీలు కూడా డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. తెలుగు టెలివిజన్ యాంకర్ విష్ణు ప్రియ కూడా తన హాట్ స్టెప్పులతో కుర్రాళ్లను మరింత షాక్ కు గురి చేసింది. సాధారణంగా ఆమె డాన్స్ చేస్తేనే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఇలాంటి పాటకు ఘాటైన స్టెప్పులు వేస్తే మరింత హాట్ ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు

చిన్న స్కర్ట్ లో విష్ణు ప్రియా
ఒక చిన్న స్కర్ట్ లో విష్ణు ప్రియా ఒరిజినల్ స్టెప్పులకు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం హావభావాలతోనే కాకుండా అందంతో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇటీవల కాలంలో వైరల్ అయిన విష్ణు ప్రియ బెస్ట్ వీడియోలలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా ఇటీవల భారీ స్థాయిలో పెరిగింది.


Click it and Unblock the Notifications











