Bigg Boss Voting : డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ .. రోహిణి ఔట్, మరో కంటెస్టెంట్ ఎవరు?
బిగ్‌బాస్ తెలుగు 8లో భాగంగా మరికొద్దిగంటల్లో 14వ వారానికి ఎండ్ కార్డ్ పడనున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరుగుతుండగా.. టాప్ 5లోకి ఎవరు వెళ్లబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. 14వ వారం రోహిణి ఎలిమినేట్ కాగా.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున షాకిచ్చాడు. దీంతో ఆ ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వివరాల్లోకి వెళితే..
ఊహించినట్లుగానే 14వ వారం కంటెస్టెంట్స్‌కి, ప్రేక్షకులకి ఊహించని షాకులిస్తున్నాడు బిగ్‌బాస్. చివరి వారం హౌస్‌లో కండీషన్ చాలా టఫ్‌గానే ఉంటుందని గత సీజన్‌లు ఫాలో అయినవారికి తెలిసిందే. ఖచ్చితంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా అనుకున్నారు. దీనికి తగినట్లుగానే నాగార్జున ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. బిగ్‌బాస్ తెలుగు 8లో 14వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే . అవినాష్ తప్పించి నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, రోహిణిలు నేరుగా నామినేట్ అయ్యారు.

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న వారందరి కటౌట్‌లను గార్డెన్ ఏరియాలో పెట్టించిన నాగ్.. అవినాష్ ఫినాలేలో అడుగుపెట్టడంతో అతనిని తప్పించారు. ఇక్కడున్న వారిలో ఎవరి కటౌట్ కింద పడిపోతుందో వారు ఎలిమినేట్ అయినట్లని నాగ్ ప్రకటించాడు. ఇంతలో అవినాష్‌ని పిలిచి ఎవరు ఎలిమినేట్ అవుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావని అడగ్గా.. బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ రోహిణి పేరు చెబుతాడు. అతను చెప్పినట్లుగానే రోహిణి కటౌట్ కిందపడిపోవడంతో అంతా షాక్ అయ్యారు.
రోహిణి ఎలిమినేటయి బయటకు వస్తుండగా.. హౌస్ మేట్స్ అంతా స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం విశేషం. బహుశా ఇలా జరగడం బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి . స్టేజ్ మీదకు వెళ్లాక తన జర్నీ చూసి ఎమోషనలైంది రోహిణి. నువ్వు విన్నర్‌లా వెళ్తున్నావని నాగ్ సైతం ఆమెను పొగిడారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించడంతో హౌస్‌మేట్స్, ప్రేక్షకులు షాకయ్యారు. ఆల్రెడీ రోహిణి వెళ్లిపోయింది కాబట్టి.. ఆదివారం ఎలిమినేటయ్యే రెండో వ్యక్తి ఎవరు? అనే డిస్కషన్ నడుస్తోంది.
ఈ వారం నామినేట్ అయిన ఆరుగురిలో రోహిణి ఎలిమినేట్ కాగా.. ఇంకా నిఖిల్, నబిల్, విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ ఉన్నారు. వీరిలో నిఖిల్- గౌతమ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా.. వీరిద్దరూ ఖచ్చితంగా గ్రాండ్ ఫినాలేలో అడుగుపెడతారు. మిగిలిన వారిలో నబీల్, ప్రేరణలు కూడా స్ట్రాంగ్ ప్లేయర్లే . ఇక ఏటొచ్చి విష్ణుప్రియపైనే అందరకీ డౌట్. ఈ వారం ఓటింగ్‌లో రోహిణి - విష్ణుప్రియలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. విష్ణు కంటే ఆటలు, డిస్కషన్స్ , ఎంటర్‌టైన్మెంట్ కేటగిరీలలో రోహిణి బెటర్. అలాంటి ఆమెనే పంపేశారు కాబట్టి.. ఈ వారం విష్ణుప్రియ వెళ్లిపోతారా? లేదంటే ఆమెను గ్రాండ్ ఫినాలేకు పంపి నబీల్, ప్రేరణలలో ఒకరిని బలి చేస్తారా అనే డిస్కషన్ నడుస్తోంది. దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్‌పై అందరి చూపు నెలకొంది.


Click it and Unblock the Notifications











