Bigg Boss Telugu 8: ఏ కంటెస్టెంట్ కి టాప్ రెమ్యునరేషన్ అంటే? వారానికి ఎన్ని లక్షలంటే?

తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. ఒకే ఇంట్లో కొంతమంది సెలెబ్రెటీలు కొట్టుకుచచ్చే గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ కి మన తెలుగు ఆడియెన్స్ లో ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్ ఆదరణ ఉంది. అలా ప్రతి ఏడాది సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించే స్టార్ మా వాళ్ళు మొత్తం 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఫైనల్ గా 8వ సీజన్లోకి అడుగు పెట్టారు.

మరి గత ఆదివారం మొదలైన ఈ సీజన్లో కూడా కొంచెం తెలిసిన వల్లనే తీసుకొచ్చారు. దీనితో ప్రస్తుతం డీసెంట్ బజ్ ఈసారి నెలకొంది. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ వెళ్ళాలి అంటే డెఫినెట్ గా వారికి భారీ రెమ్యునరేషన్ లు తప్పనిసరి. ఇలా ఎవరి ఫేమ్ ని బట్టి వారికి మంచి రెమ్యునరేషన్ లు ముట్టజెపుతారు.

vishnu priya dhee fame nainika remunerations leaked for bigg boss 8 telugu

ఇలా ఈసారి హౌస్ లో అనుకున్నట్టుగానే హాట్ యాంకర్ విష్ణు ప్రియా అందరికంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేందుకు లాస్ట్ మినిట్ చర్చలు అంతా కూడా ఈ రెమ్యునరేషన్ దగ్గరే జరిగాయి అని టాక్ ఉంది. సో ఇలా చివరికి మంచి నెంబర్ దగ్గరే విష్ణు ప్రియకి రేటు కట్టారట.

కాగా ఇలా విష్ణు ప్రియా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు వారానికి మూడున్నర లక్షల చొప్పున ఛార్జ్ చేస్తుంది అని వినికిడి. అలాగే అనుకున్న రోజులు కంటే ఎక్కువ రోజులు విష్ణు ప్రియా కానీ కొనసాగితే మరింత రెమ్యునరేషన్ కూడా ఇస్తారట.. ఇక ఈమె హైయెస్ట్ కాగా రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తన ప్రేయసి లావణ్య కాంట్రవర్సీలో న్యూస్ ఛానెల్స్ ముందుకు వచ్చి వైరల్ గా మారిన శేఖర్ బాషా 2.3 లక్షలు వారానికి అందుకుంటున్నాడట.

vishnu priya dhee fame nainika remunerations leaked for bigg boss 8 telugu

ఇది కొంచెం ఆశ్చర్యమే అని చెప్పాలి. ఇక ఢీ డాన్స్ షోలో మంచి ఫేమ్ ని తెచ్చుకున్న యంగ్ డాన్సర్ నైనికా వారానికి రెండున్నర లక్షలు మేర ఛార్జ్ చేస్తున్నట్టుగా టాక్. ఇలా కొంచెం నోటెడ్ ఫేస్ లకి బిగ్ బాస్ వారికి తగ్గ రెమ్యునరేషన్ లనే అందిస్తున్నారని ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. కాగా ఈసారి కూడా బిగ్ బాస్ షోని కింగ్ నాగార్జునే హోస్ట్ గా చేస్తుండగా ఈసారి డ్రామా మొదటి వారం నుంచే మొదలయిపోయింది అని షో ఫాలోవర్స్ అంటున్నారు.

ఇక ముందు రోజుల్లో ఎవరి దశ ఎలా తిరుగుతుందో చూడాలి మరి. ఇక ఈ షో కొన్ని గంటలు వ్యవధి వరకు డైలీ స్టార్ మా లో ప్రసారం అయితే 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చేయవచ్చు. మరి ఈ షో పట్ల మరింత ఆసక్తి ఉన్న వారు ఇందులో కూడా చూస్తుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X