నేనూ విష్ణుప్రియకి 399 రూపాయలు కట్టా... బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ తన క్రియేటర్ల కోసం తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో ఎంతో మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రెటీలకు కాసుల పంట పండిస్తోంది. ఎక్స్‌క్లూజిక్ కంటెంట్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పేరుతో కొందరు సెలబ్రిటీలు లక్షల్లో సంపాదిస్తున్నారు. కొందరు హీరోయిన్లు, లేడీ ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ స్కిన్ షోకి వేదికగా మార్చుకున్నారు. బోల్డ్ ఫోటోలు, అశ్లీలమైన వీడియోలను ఆన్‌లైన్‌లోకి వదులుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఈ వికృత ట్రెండ్‌లోకి దిగుతున్నారు. దీని కారణంగా యావరేజ్‌న ఒక్కో ఇన్‌ఫ్లూయెన్సర్ నెలకు 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

ఎక్స్‌క్లూజివ్‌గా కొందరికే ఇలాంటి కంటెంట్ ఇస్తున్నామని సెలబ్రిటీలు కవర్ చేసుకుంటున్నా.. కొందరు వీటిని స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్లతో పేరుతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో సెలబ్రిటీల పరువు గంగలో కలుస్తోంది. ఈ పోకడలపై సాంప్రదాయవాదులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నారు. యువత, పిల్లలపై ఇది దుష్ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారాలతో కొందరు సెలబ్రిటీలపై కేసులు కూడా నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

Vishnu Priya Faces Funny Punches Over Rs 399 Instagram Subscription in Family Assembly Promo

తెలుగు విషయానికి వస్తే స్టార్ యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ, అషురెడ్డి, శ్రీరెడ్డి తదితర సెలబ్రిటీలు ఈ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌తో బాగా సంపాదిస్తున్నారు. అయితే విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటోలు అభ్యంతరకరంగా ఉండటంతో ఆమెపై కేసులు పెట్టే వరకు విషయం వెళ్లింది. అయితే ఈ వివాదంతో విష్ణుప్రియ, ఆమె షేర్ చేస్తోన్న కంటెంట్ వార్తల్లో నిలవడంతో ఈ బ్యూటీకి వరంగా మారింది. ఈ వివాదానికి ముందు ఆమెకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2 వేల లోపే ఉండేది. ఎప్పుడైతే ఈ విషయం బయటికి వచ్చిందో అప్పుడే దీని గురించి నెటిజన్లలో ఆసక్తి పెరిగి.. 399 రూపాయలు కట్టి విష్ణుప్రియ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం పోటీపడ్డారు. దాంతో ఆమె సబ్‌స్క్రైబర్లు 5000 వరకు చేరుకున్నారు. దాంతో విష్ణుప్రియ సంపాదన కూడా పెరిగింది.

తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న ఫ్యామిలీ అసెంబ్లీ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన విష్ణుప్రియకు ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ గురించి చురకలు ఎదురయ్యాయి. విష్ణుప్రియను చీరలో చూసిన జడ్జి ఆర్కే రోజా.. మీరెవరు అని అడుగుతుంది. నేను విష్ణుప్రియని అని చెప్పగా.. విష్ణుప్రియ చీరకట్టుకుని వచ్చిందంటే అని ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత టేస్టీ తేజ- యష్మీగౌడలు ఎంట్రీ ఇస్తారు. తేజ కూడా మీరెవరు అని అడగ్గా.. నేను విష్ణుప్రియ అంటుంది. నా కళ్లు నన్ను మోసం చేయవు, ఎందుకంటే ఈ అమ్మాయికి నేను ట్రూలీ సబ్‌స్క్రైబర్‌ని 399 రూపాయలు కట్టా. అక్కడ ఇలా ఉండదే అంటూ టేస్టీ తేజ కామెంట్ చేయడంతో విష్ణుప్రియ సిగ్గుపడుతుంది.

ఆ వెంటనే అర్జున్ కళ్యాణ్ - శ్రీసత్యలు వస్తారు. ఈ అమ్మాయికి తెల్లగా ఉంటుందని పొగరెక్కువ అంటాడు అర్జున్. మిడిల్ క్రాఫ్ తీసుకుంటావని నీకు పొగరులేదా అని కౌంటర్ వేస్తుంది శ్రీసత్య. పవన్ కళ్యాణ్ స్టైల్ అని అర్జున్ చెప్పగా.. బయట కొడతారని వార్నింగ్ ఇస్తుంది సత్య. తర్వాత జర్నలిస్ట్ జాఫర్ వచ్చి.. బద్ధ శత్రువులని పిలిచారేంటీ అని ఆశ్చర్యపోతాడు. అందరినీ కూర్చోబెట్టి జాఫర్ పంచాయతీ తీరుస్తుండగా.. నను షాకిద్దామని అనుకుంటే విష్ణుప్రియ నాకు షాకిచ్చింది. మీరు ఇంత అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందని చెబుతాడు. మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు.. ఫ్లర్ట్ చేయడానికి కాదని రోజా పంచ్ విసురుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 399 రూపాయల సబ్‌స్క్రిప్షన్ వ్యవహారంతో విష్ణుప్రియను అంతా ఆడేసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: vishnu priya rk roja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X