Vishnu Priya: సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. నా ఫేసు పెట్టి అలాంటి వీడియో చేశారు

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya)తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఒకప్పుడు టెలివిజన్‌లో వరుస షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు, ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూత్‌లో విష్ణుప్రియకు మంచి క్రేజ్ ఏర్పడింది. గతంలో గ్లామర్ ఫోటోషూట్‌లతో నెట్టింట హీట్ పెంచిన ఆమె, ఇటీవ‌ల మాత్రం తన దృష్టిని ఆధ్యాత్మికత వైపు మళ్లించినట్టు కనిపిస్తోంది. భక్తి, దైవచింతన, సాంప్రదాయ జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విష్ణు ప్రియ మార్పు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న విష్ణు ప్రియ.. ఒక్క సారి సూసైడ్ చేసుకోవాలని భావించానని తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

యూత్‌కి గ్లామర్ యాంకర్‌గా, సోషల్ మీడియాలో హాట్ అండ్ హ్యాపెనింగ్ స్టార్‌గా పేరుగాంచింది విష్ణుప్రియ. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ భామ చిన్న వయసులోనే కష్టాలు ఎదుర్కొని, భగవద్గీత శ్లోకాలు నేర్పుతూ జీవితం కొనసాగించింది. తరువాత సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందింది. ఆ తరువాత "పోవే పోరా" షోతో సుడిగాలి సుధీర్‌తో కలిసి సూపర్ పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో బిగ్ బాస్ 8 పాల్గొనడం, అక్కడ పృథ్వీతో ప్రేమాయణం కొనసాగించడం అంత హాట్ టాపిక్ గా మారింది. అయితే.. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఆధ్యాత్మికత వైపు మళ్లిన విష్ణుప్రియ, బుల్లితెరకు గుడ్‌బై చెప్పిందా? లేక తాత్కాలిక విరామమా? అనేది చర్చనీయమే.

Vishnu Priya Gets Emotional on Kissik Talks With Varsha Reveals Pain of Fake Video Leak

యాంకర్ విష్ణుప్రియ తాజాగా జబర్దస్త్ ఫేమ్ వర్షా (Varsha) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కిస్సిక్ టాక్స్' షోకి గెస్టుగా వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విష్ణు ప్రియ తన జీవితంలోని ఎన్నో తెలియని నిజాలను బయటపెట్టింది. ఆ ఎపిసోడ్‌లో విష్ణుప్రియ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రోమో ప్రారంభంలో విష్ణు ప్రియకు స్వాగతం చెబుతూ.. 'బేసిక్‌గా మీరంతా అందమైన అమ్మాయిని చూసుంటారు.. కానీ అందమే అమ్మాయి అయితే ఎలా ఉంటుందో చూస్తారా.. అదే విష్ణుప్రియ'అని వర్ష అనగానే..' రేయ్ వద్దురా వద్దు చెప్పకపోయినా ఫర్లేదు.'అంటూ విష్ణుప్రియ నవ్వుకుంది. "ఎప్పుడూ లేనంత పద్ధతిగా వచ్చావ్.. లవ్‌లో పడ్డావా?" అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నావ్..?'అని వర్ష అడిగితే అంతలేదు అంటూ నవ్వుకుంది విష్ణు.

ఆ తరువాత విష్ణుప్రియ సిగ్గుపడుతూ "శివుడు లాంటి బ్యాలెన్స్‌డ్ పర్సన్ రావాలి" అని సమాధానం చెప్పింది. వెంటనే వర్షా "అంటే పృథ్వీరాజ్ లాగా?" అని అడగగా, దీంతో విష్ణు తడబాటుగా నవ్వింది. ఆమె సమాధానాలు చూస్తే పృథ్వీరాజ్ శెట్టి (Prithvi Raj Shetty) పట్ల ఉన్న బంధం ఇంకా ఆమె మనసులో మిగిలి ఉందన్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. తదుపరి విష్ణు మాట్లాడుతూ.. "అందరూ అనుకున్నట్లే వస్తే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే సన్యాసం తీసుకుంటాను. నా మనసులో ఒకరే ఉన్నాడు. అతను రాకపోతే నా జీవితం ఇలాగే సాగుతుంది." అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. దీంతో షోలోని వారంతా షాకయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో విష్ణుప్రియ- పృథ్వీరాజ్ శెట్టిల ప్రేమాయణం అందరికీ తెలిసిన విషయమే.

అనంతరం విష్ణు ప్రియ తాను యాంకరింగ్ నుంచి వెనక్కి తగ్గిన కారణాన్ని కూడా వెల్లడించింది. విష్ణుప్రియ "పోవే పోరా" షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకున్న విషయం తెలిసిందే.. సుడిగాలి సుధీర్‌తో జంటగా ఆమెకు ఏర్పడిన కెమిస్ట్రీకి యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. కానీ కొద్దికాలానికే ఆమె యాంకరింగ్ నుంచి దూరమైంది. ఈ అంశంపై వర్షా ప్రశ్నించగా.. "నాకు యాంకరింగ్ అంతగా రాదు. కో-యాంకర్ ఉంటే బాగుంటుంది. మొదట్లో చాలామంది సహకరించలేదు. ఇతర ఛానెల్స్‌కి చెందిన యాంకర్లు కూడా కుళ్లు చూపారు." ఆ మాటలతో విష్ణుప్రియ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న పోటీ, అసూయ, ఒత్తిడి అన్నీ బయటపడ్డాయి.

'నీ లైఫ్‌లో నిన్ను ఎక్కువగా హర్ట్ చేసిన విషయం ఏది?' అని వర్ష ప్రశ్నించగా.. విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యింది. "నా ఫేస్‌ను వాడి ఒక మార్ఫ్‌డ్ అశ్లీల వీడియో తయారు చేశారు. ఆ వీడియోని వాట్సాప్‌లో డాక్యుమెంట్‌లా ఫార్వార్డ్ చేశారు. చాలామంది నమ్మి అది నేనే అనుకున్నారు. ఎవరూ అది ఫేక్ అని నమ్మలేదు. నా ఫేస్‌బుక్ అకౌంట్ కూడా హ్యాక్ చేసి అశ్లీల పోస్టులు చేశారు. మా ఊరిలో ఉన్న తాతయ్య నా అమ్మకి ఫోన్ చేసి 'విష్ణుప్రియ ఎందుకు అలా పోస్టులు పెడుతుంది?' అని అడిగారు." అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా విష్ణు ఎమోషనల్ గా మాట్లాడుతూ.. "ఎక్కడికెళ్లినా అబ్బాయిల డిస్కషన్ అదే ఆ వీడియో గురించే. నేను మానసికంగా బాగా దెబ్బతిన్నా. మా అమ్మ పెంపకం వల్లనే ఆ దుస్థితిని తట్టుకోగలిగాను. లేని పక్షంలో నేను అప్పటికే సూసైడ్ చేసుకునేదాన్ని." అని చెప్పి షోలోని అందరినీ కదిలించింది.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విష్ణుప్రియకు సపోర్ట్ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ "ఇలాంటి అవమానాలు ఎదురైనా నిలబడటం గొప్ప విషయం", "విష్ణు నిజంగా బ్రేవ్ ఉమెన్", "ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అమ్మాయిలకు ఇది స్ఫూర్తి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. విష్ణుప్రియ తన సోషల్ మీడియా అకౌంట్‌లో "కొన్ని రోజులు హిమాలయాలే నా ఇల్లు" అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె "సన్యాసం తీసుకుంటుందా?" అనేది కూడా చర్చనీయంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X