వేణు స్వామి ఎలాంటివాడంటే ? బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

Vishnu Priya: టాలీవుడ్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీ షోల ద్వారా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన 'పోవే పోరా' గేమ్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. ఆ షోనే ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారిందని చెప్పొచ్చు. అదే క్రేజ్‌తో ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో స్టార్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ తర్వాత మళ్లీ టీవీ షోలపై ఫోకస్ పెట్టిన విష్ణు ప్రియ, యాంకర్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తోంది. అలాంటి ఈమె తాజాగా వేణు స్వామి(Venu Swami) గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

విష్ణు ప్రియ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా యాంకర్ వర్ష హోస్ట్ గా వ్వహరిస్తున్న 'కిస్సిక్ టాక్స్' అనే షోలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలను ఓపెన్‌గా పంచుకున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, బ్రేకప్, మానసిక కష్టాలు, అలాగే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షోలో విష్ణు ప్రియ తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ... 'నచ్చిన వాడు పెళ్లికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమే' అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Vishnu Priya Gets Emotional Reveals Shocking Truth About Life Struggles and Venu Swami s Support

అంతేకాదు.. తన జీవితంలో ఎదురైన ఇబ్బందులు, మార్ఫింగ్ వీడియోల వల్ల ఎదుర్కొన్న అవమానాలు తనను ఎంతగా కుంగదీశాయో చెప్పుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఆ సమయంలో ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది' అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం మాత్రం వేణు స్వామి గురించి విష్ణు ప్రియ చేసిన కామెంట్స్. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా పేరొందిన వేణు స్వామి గురించి ఇటీవలి కాలంలో అనేక వివాదాలు, విమర్శలు రావడం తెలిసిందే. జ్యోతిష్యం తప్పిందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం, కేసులు ఫైల్ చేయడం వంటి అంశాలు కూడా ఆయన పేరు చుట్టూ తిరుగుతున్నాయి.

అలాంటి వేణు స్వామి గురించి విష్ణు ప్రియ మాట్లాడుతూ.. 'నిజంగా ఆయన అలాంటి వాడని నేను అనుకోలేదు' అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తన తల్లి మరణానికి సంబంధించిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ విష్ణు ప్రియ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'మా అమ్మ 42 ఏళ్ల వయసులోనే చనిపోయింది. ఆమెకు డయాబెటిస్ ఉండేది. నిత్యం మందులు వాడాల్సిన పరిస్థితి. కానీ, ఒక దశలో చేతిలో డబ్బులు లేక మందులు కూడా కొనలేని స్థితికి వచ్చాం. అమ్మ మెడికల్ చెకప్ కూడా చేయించుకునేది కాదు. చివరికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు గానీ పరిస్థితి తీవ్రత మాకు తెలియలేదు' అని ఆమె చెప్పారు.

ఆ సమయంలో అమ్మను హాస్పిటల్‌లో చేర్పించగా, మూడు రోజులకంటే ఎక్కువ బ్రతకదని డాక్టర్లు చెప్పారని, అప్పటికే జీవితం అయిపోయిందనుకున్నామని చెప్పుకొచ్చారు. 'హాస్పిటల్ బిల్లులు లక్షల్లో వచ్చాయి. ఎవరికీ అప్పు అడగకుండా ఉండాలని ప్రయత్నించాను. కానీ అమ్మ కోసం తప్పనిసరిగా వేణు స్వామికి ఫోన్ చేసి నా పరిస్థితి చెప్పాను. వెంటనే ఆయన డబ్బులు అరేంజ్ చేసి సహాయం చేశారు' అని తెలిపారు. వేణు స్వామి చేసిన ఆ సహాయాన్ని గుర్తు చేసుకుంటూ, 'మూడు రోజుల్లో చనిపోవాల్సిన అమ్మ ఏడాది పాటు బ్రతికిందంటే.. అది వేణు స్వామి చేసిన సహాయమే. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతారు. కానీ నిజంగా ఆయనను తెలిసిన వాళ్లు మాత్రం తప్పుగా మాట్లాడరు. ఎవరికైనా అవసరం వస్తే ముందుగా నిలిచే వ్యక్తి వేణు స్వామి' అంటూ ప్రశంసలు కురిపించింది విష్ణు ప్రియ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X