బ్రేకప్ తర్వాత కూడా బాయ్‌ఫ్రెండ్స్‌తో అలాంటి రిలేషన్‌షిప్.. విష్ణు ప్రియ బోల్డ్‌గా

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya). టెలివిజన్ షోలు, యాంకరింగ్ కార్యక్రమాలతో మంచి క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు.. తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, యాంకరింగ్ కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది విష్ణుప్రియ. ఈ అమ్మడు తరచూ గ్లామర్ ఫోటోలు, వీడియోలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విష్ణుప్రియ మరోసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియకు "మీరు గతంలో రిలేషన్‌షిప్‌లో ఉండి బ్రేకప్ అయ్యారు. ఇప్పుడు మీరు మరింత పాపులర్ అయ్యాక మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ లేదా మాజీ ప్రేమికులు మళ్లీ మిమ్మల్ని సంప్రదించారా? వారితో ఇప్పటికీ టచ్‌లో ఉన్నారా?" అనే ప్రశ్న ఎదురైంది. దీనికి విష్ణుప్రియ ఎంతో ఓపెన్‌గా సమాధానం ఇచ్చింది. "బ్రేకప్ అయిన తర్వాత కూడా నా మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో నేను స్నేహంగా ఉంటాను. నిజానికి వాళ్లు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ కారణంగానే నేను వారిని ప్రేమించాను. రిలేషన్‌షిప్ ముగిసిందని వారిని నా జీవితంలో నుంచి పూర్తిగా దూరం పెట్టలేదు" అని చెప్పింది.

Vishnu Priya Opens Up on Ex-Boyfriends Breakups and Why She Still Loves Them After Separation

అంతేకాదు, "వాళ్లకు ఇప్పుడు నా మీద ఆ ఫీలింగ్ ఉండకపోవచ్చు. కానీ నేను మాత్రం వాళ్లను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమ అనేది ఒక్కసారిగా మాయమైపోయే భావోద్వేగం కాదు. ఒక వ్యక్తిని ప్రేమించాం అంటే అతనిలో ఎన్నో మంచి లక్షణాలు మనకు నచ్చి ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా మారిపోవు" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ప్రేమ ఎందుకు విఫలమవుతుందో వివరిస్తూ విష్ణుప్రియ ఆసక్తికర ఉదాహరణ కూడా చెప్పింది. "ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి. ఒక చిన్న విషయం వల్ల లేదా కొన్ని అభిప్రాయ భేదాల వల్ల రిలేషన్‌షిప్ ముగిసిపోవచ్చు. అందుకే ఆ వ్యక్తి మొత్తం చెడ్డవాడని కాదు. ఒక కూరను ఇద్దరం కలిసి వండుకోలేకపోయామని చెప్పినట్లే. ఆ విషయంలో మాత్రమే మేము దూరమయ్యాం. మిగతా ఎన్నో విషయాల్లో అతను నాకు ఇప్పటికీ నచ్చుతాడు" అని తెలిపింది.

మాజీ ప్రేమికుల గురించి మాట్లాడిన విష్ణుప్రియ, "వాళ్లందరినీ నేను ఇప్పటికీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లాగే భావిస్తాను. జీవితంలో వాళ్ల స్థానాన్ని పూర్తిగా తొలగించలేదు. నా జీవిత ప్రయాణంలో వారు ఒక ముఖ్యమైన భాగం" అని చెప్పింది. విష్ణుప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

మరోవైపు.. విష్ణు ప్రియ ఇటీవల ' నా బాడీ కౌంట్ 5' అంటూ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పదానికి వేర్వేరు అర్థాలు ఉండే అవకాశం ఉండటంతో, విష్ణుప్రియ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో కూడా పలు విషయాలపై విష్ణుప్రియ నేరుగా స్పందించి వార్తల్లో నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X