మా అమ్మను దారుణంగా వదిలేశాడు.. మా నాన్న అంటే.. షాకింగ్‌గా విష్ణుప్రియ.. గంగవ్వ కంటతడి!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్నది. ఇంటిలో సభ్యుల మధ్య ఎమోషన్స్, ఏడుపులు, వినోదం, అల్లరి లాంటి అంశాలతో మిక్స్‌డ్‌‌గా ముందుకెళ్తున్నది. ఇంటి సభ్యులు కొన్నిసార్లు తన ఎమోషన్స్‌ను తన సహచర కంటెస్టెంట్లతో పంచుకొన్నారు. అయితే తన జీవితంలో జరిగిన విషాద సన్నివేశాన్ని చెబుతుండగా గంగవ్వ విని కంటతడి పెట్టుకొని విలపించింది. అసలు విష్ణుప్రియ చెప్పిన జీవితపు కథ ఏమిటంటే?

బిగ్‌బాస్ తెలుగులో టాప్ కంటెస్టెంట్‌లలో విష్ణు ప్రియ భీమినేని ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమె సమయస్పూర్తి, ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్నది. వినోదంతోపాటు టాస్క్‌లో వీరనారిగా పెర్పార్మెన్స్ ఇస్తున్నది. తొలి రెండు వారాల్లోనే ఇంటిలో చివరి వరకు కొనసాగడానికి అర్హత ఉందనే ఫీలింగ్‌ను, సంకేతాలను పంపించింది.

Vishnu Priya parents breakup Story Gangavva broke down in Bigg Boss Telugu 8 House

ఇంటిలో కేవలం ఆటకు, వినోదానికి పరిమితం కాలేదు. మరో టాప్ కంటెస్టెంట్‌తో రొమాంటిక్ కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నది. పృథ్వీతో సున్నితమైన రొమాన్స్‌ను పండిస్తూ షోలో గిలిగింతలు పెడుతున్నది. ఆమె నడిపిస్తున్న లవ్ ట్రాక్ సరదాగా సాగిపోతున్నది. అలా అన్ని రకాలుగా కంటెంట్‌ను క్రియేట్ చేస్తూ ముందుకెళ్తున్నది.

ఇలా తనదైన శైలిలో సాగిపోతున్న విష్ణుప్రియ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన తల్లిదండ్రుల బ్రేకప్ గురించి పంచుకొంటూ ఇతరులను భావోద్వేగానికి గురి చేసింది. తన తల్లిని మా చిన్నతనంలోనే నాన్న వదిలేశాడు. మరో వ్యక్తిని పెళ్లి చేసి సంసారం పెట్టాడు. మా అమ్మ ఒంటరిగా మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అందుకే మా అమ్మ అంటే చాలా ఇష్టం అని అన్నారు.

Vishnu Priya parents breakup Story Gangavva broke down in Bigg Boss Telugu 8 House

అయితే మా అమ్మకు అన్యాయం చేసినప్పటికీ.. మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయన మమ్మల్ని వదిలేసిపోయినప్పటికీ.. నేను ఆయనపై కోపం పెంచుకోలేదు. ఆయనతో ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటాను. ఆయన పట్టించుకోకున్నా.. మేమంత మా కాళ్లపై మేము నిలబడి సొంతంగా ఎదిగాం. మా అమ్మ మాత్రం మమ్మల్ని ఎలాంటి లోటు లేకుండా పెంచింది అని చెప్పారు.

విష్ణుప్రియ తన జీవితంలో జరిగిన సంఘటను చెప్పినప్పుడు పక్కనే ఉన్న గంగవ్వ కంటతడి పెట్టుకొంటూ జీవితంలో ఎన్ని కష్టాలను ఎదురించి సొంతంగా ఎదిగింది అని అన్నారు. అవ్వ కంటతడి పెట్టుకోవడంతో ఆమె కంగారుపడిపోయింది. వెంటనే గంగమ్మను వెళ్లి ఓదార్చింది. ఈ సన్నివేశం అందర్నీ ఎమోషనల్‌ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X