నీకు ఆడతనం ఎక్కువ.. కంటెస్టెంట్‌పై నోటిదూల.. కష్టాల్లో విష్ణు ప్రియ!

యాంకర్, యాక్టర్ విష్ణుప్రియ భీమినేనికి నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతారనేది పలు సందర్భాల్లో స్పష్టమైంది. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకపోయినప్పటికి.. నాలుక కంట్రోల్ తప్పి పలు రకాల కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురి అవ్వడం తెలిసిందే. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 8 (Bigg Boss Telugu 8) షోలో ఉన్న విష్ణుప్రియ మరోసారి తన తెలియని తనాన్ని బయటపెట్టుకొన్నారు. ఆమెకు తెచ్చిపెట్టిన కష్టాలు ఏమిటంటే?

విష్ణుప్రియ అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో పుష్కలంగా టాలెంట్ ఉన్న తెలుగు యాక్టర్. అయితే పలుసార్లు ఏం మాట్లాడాలో తెలియక ట్రోలింగ్ గురి అవుతుంటుంది. ఆమె బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి ముందు.. కోటి రూపాయలు ఇచ్చినా ఆ షోలోకి వెళ్లను. ప్రపంచమంత బయట ఉంటే.. ఓ ఇంటిలో నేను ఎందుకు ఉండాలి అని ఆమె అన్నారు. అయితే బిగ్‌బాస్ షోలోకి వచ్చిన తర్వాత ఆమెను భారీగా ట్రోల్ చేశారు.

Vishnu Priya Tough Slip with Feminine comments on Manikantha in Bigg Boss Telugu 8

ఇక బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లిన తర్వాత మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ మణికంఠతో పిచ్చపాటిగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా వాడి ఇబ్బందుల్లో పడింది. ఓ రోజు మణికంఠతో మాట్లాడుతూ.. నాలో ఫెమినిటీ (ఆడతనం) ఎక్కువ. మీరు అందంగా ఉంటారు. కానీ మీలో ఆ విషయం కంటే ఆడంగితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు.

అయితే అప్పుడే మణికంఠ తనను అలా అనడంపై మనస్తాపం చెందారు. విష్ణుప్రియ చేసిన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకొని.. ఆమెతో క్లోజ్ అయి.. ఆమె ఎలా మాట్లాడుతున్నది అనేది పరిశీలించాడు. ఆ తర్వాత నామినేషన్‌ బిగ్‌బాస్ తెలుగు 8 (Bigg Boss Telugu 8 Nominations)లో ఆ పాయింట్‌ను పట్టుకొని ఎలిమినేషన్ లిస్టులో పెట్టారు.

అయితే విష్ణుప్రియతో మాట్లాడుతూ.. మీరు నా గురించి వాడిన పదం నాకు నచ్చలేదు. నేషనల్ టెలివిజన్‌లో అలాంటి కామెంట్స్ చేస్తే తప్పుగా అర్ధం చేసుకొంటారు. మీకు ఆ పదం గురించి తెలుసా? నన్ను ఆ పదంతో అలా ఎలా అంటారు అంటూ ప్రశ్నించాడు. అందుకే నామినేట్ చేస్తున్నాను అంటూ కామెంట్ చేశాడు.

ఇదిలా ఉండగా, నా ఉద్దేశం నిన్ను కించపరచడం కాదు. నా నోటి నుంచి అది అలా వచ్చేసింది. అది నా తప్పే. అలా అనకుండా ఉండాల్సింది అని ఆమె అన్నారు. ఆ విషయంలో మణికంఠకు సారీ చెప్పింది. ఇక నుంచి అలాంటి పదాలు వాడుకుండా జాగ్రత్త పడుతానని ఆమె చెప్పారు.

బిగ్‌బాస్ తెలుగు 8 (Bigg Boss Telugu 8) షోలో తొలివారంలో బేబక్క, విష్ణు ప్రియ భీమినేని, మణికంఠ, పృథ్వీ రాజ్, సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ బాషా ఇంటిలో ఉండటానికి అర్హత లేదనే కారణంతో నామినేట్ చేశారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్‌లో 6 కంటెస్టెంట్లు ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ (బిగ్‌బాస్ తెలుగు 8 (Bigg Boss Telugu 8 Elimination) అవుతారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X