అలా నిన్ను చూడలేకపోతున్నాం... విష్ణుప్రియపై జబర్దస్త్ నటుడు షాకింగ్ కామెంట్స్
ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా సెలబ్రిటీలు భారీగా సంపాదిస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ పేరిట, హాట్, బోల్డ్ కంటెంట్‌ను షేర్ చేస్తుండటంతో సెలబ్రిటీలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తెలుగునాట పాపులర్ యాంకర్‌గా ఉన్న విష్ణుప్రియ కూడా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో భారీగా సంపాదిస్తున్నారు. అయితే డోస్ పెరగడంతో ఆమెపై కసులు పెట్టే వరకు వ్యవహారం వెళ్లింది. ఈ వివాదం తర్వాత ఆమె ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్లు కూడా పెరిగి విష్ణుప్రియకు ప్రయోజనం చేకూరుతోంది.
ప్రస్తుతం మాజీ మంత్రి రోజా హోస్ట్‌గా జీ తెలుగులో ప్రసారమవుతున్న ఫ్యామిలీ అసెంబ్లీ షోలో పాల్గొంటున్నారు విష్ణుప్రియ. ఈ షోలో ఆమె సబ్‌స్క్రిప్షన్‌ను అడ్డుపెట్టుకుని విష్ణుప్రియను ఆడేసుకుంటున్నారు. గత ఎపిసోడ్‌లో జర్నలిస్ట్ జాఫర్.. విష్ణుప్రియపై పంచ్‌లు విసిరాడు. ఈ వారం కూడా విష్ణుప్రియను ఇదే అంశంపై టార్గెట్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫ్యామిలీ ఎపిసోడ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఫ్యామిలీ అసెంబ్లీ ప్రోమో ప్రారంభంలోనే పంచ్ ప్రసాద్ తన భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడంతోనే విష్ణుప్రియ వైపు ప్రసాద్ వెళ్లడంతో ఎప్పుడెప్పుడు అటుపక్కకి వెళ్దామా ఉన్నాడని రోజా పంచ్ వేయగానే అతని భార్య సీరియస్ అవుతుంది. దాంతో ఆ మాత్రం ఎఫెక్షన్ ఉంటుందని ప్రసాద్ చెప్పగా దేనికీ అని విష్ణుప్రియ షాక్ అవుతుంది. సబ్‌స్క్రైబర్‌ని రా మరిచిపోయావా అని పంచ్ విసురుతాడు ప్రసాద్. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్ కపుల్ ఎంట్రీ ఇచ్చి పాపతో ఆడుకుంటారు.
పాపని కిస్ పెట్టమని విష్ణుప్రియ అడగ్గా.. నన్ను పెట్టమంటావా అంటూ ప్రసాద్ లేచి వెళ్లబోతాడు. అనంతరం సెలబ్రిటీ జంట సుష్మా కిరణ్- రవికిరణ్‌లు మాస్ డ్యాన్స్‌లో స్టేజ్ మీదకు అడుగుపెడతారు. కపుల్స్‌గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఎలా అది రోజా ప్రశ్నిస్తుంది. నేను వేరే సీరియల్‌లో ఉంటా, ఆయన వేరే సీరియల్‌లో ఉంటాడని సుష్మా చెబుతుంది. అయితే ఇక్కడికి రాకుండా సీరియల్‌కే వెళ్లుంటే బాగుండేదని రోజ్ పంచ్ వేయడంతో అంతా నవ్వేస్తారు.
తర్వాత చీరలు కట్టుకునే టాస్క్ ఇవ్వగా సుష్మా కిరణ్- రవికిరణ్, పంచ్ ప్రసాద్ అతని భార్య, మరో సెలబ్రిటీ జంట చీరలు కట్టుకుంటారు. పెళ్లయినప్పటి నుంచి చీరలు కొనివ్వడం లేదని అన్నావు కదా తీసుకో అంటూ భార్య మీదకి చీరలు విసిరేస్తాడు. అలాగే నువ్వు కూడా తీసుకో చూడలేక చస్తున్నాం అంటూ విష్ణుప్రియ మీద చీరలు విసురుతాడు పంచ్ ప్రసాద్. దీంతో ఏం రిప్లయ్ ఇవ్వాలో తెలియక విష్ణుప్రియ తలపట్టుకుంటుంది.
ఆ వెంటనే రోజా పంచాయతీ పెడుతుంది. సీరియల్ వాళ్లని పెళ్లి చేసుకోకూడదని ఓ నటి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆ వెంటనే డాక్టర్ గారు మీరు ఏమైనా చెబుతారా అని రోజా అడగ్గా.. ఓ పావుకిలో జిలేబీ చెబుదాం అంటాడు టేస్టీ తేజా. నీ బదులు ఓ గేదెను పెంచుకుంటే పాల బిల్లు అయినా కలిసొచ్చేదని రోజా పంచ్ విసురుతుంది. ఆ మాట వినగానే మీరు నిజంగా నన్ను తిడుతున్నట్లుగా ఉందని టేస్టీ తేజ నవ్విస్తాడు. ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ఈ మొగుడు పెళ్లాల పంచాయతీని రోజా ఎలా తీర్చారో తెలియాలంటే ఈ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఫ్యామిలీ అసెంబ్లీ షో చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications



