అందులో మునిగి ఆనందించండి.. విష్ణు ప్రియ అందాలను చూస్తే మత్తెక్కాల్సిందే
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది విష్ణు ప్రియ. తనదైన శైలిలో యాంకరింగ్‌లో ముద్ర వేసుకుంది. ఆమె గొంతు, ఆమె ముక్కుపై షోలో సుడిగాలి సుధీర్, ఆది రకరకాల పంచ్‌లు వేస్తుంటారు. పోవే పోరా కార్యక్రమంతో విష్ణు ప్రియ యూత్‌లో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో హల్చల్ చేస్తూ ఉంటుంది. టిక్ టాక్ వీడియోలు, హాట్ హాట్ ఫోటోలతో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా యోగాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇది నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది.

బుల్లితెరపై క్రేజ్..
సుమ, శ్రీ ముఖి, అనసూయ, రష్మీ, వర్షిణి వంటివారు యాంకరింగ్‌లో దూసుకుపోతున్న సమయంలోనూ విష్ణు ప్రియ తన మార్క్‌ను సృష్టించుకుంది. సుడిగాలి సుధీర్‌తో విష్ణు ప్రియ చేసే అల్లరి, వారి కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. వీరిద్దరి క్రేజ్‌తోనే పోవేపోరా అనే కార్యక్రమం రన్ అవుతోంది.

శ్రీముఖితో దోస్తానా..
యాంకర్ శ్రీముఖి, విష్ణు ప్రియ ఇద్దరూ ప్రాణ స్నేహితురాళ్లు. ఎక్కడికి వెకేషన్‌కు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తారు. వీరి గ్యాంగ్ చేసే రచ్చ మామూలుగా ఉండదర. ఈ ఇద్దరు కలిసి చేసే టిక్ టాక్‌లు, డ్యాన్సులు తెగ వైరల్ అవుతుంటాయి. ఇద్దరూ డ్యాన్స్‌లో ఇరగ్గొట్టేయడంతో ఈ ద్వయానికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.

హాట్ ఫోటోలతో రచ్చ..
విష్ణు ప్రియ నిత్యం హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్టూమ్స్‌తో అభిమానుల ఆకట్టుకునేలా ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఇక తన గ్యాంగ్‌తో చేసే రచ్చ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వీకెండ్ వస్తే చాలు అందరూ ఒక్కచోటుకు చేరుకుని హంగామా చేస్తారు.
Recommended Video

యోగాతో మత్తెక్కిస్తూ..
విష్ణు ప్రియ యోగ గొప్పదనాన్ని వివరిస్తూ.. ‘నీ అంతరాత్మ గురించి తెలుసుకో.. యోగా అనేది నీ అంతరాత్మ గురించి తెలుసుకోవడానికే. నీ ప్రపంచాన్ని నలుదిశలా వ్యాపింపచెయ్.. నీ శక్తి నీకే తెలుస్తుంది. నీ లోపలే అది ఉందని నీకు తెలుసు.. అందులో మునుగు.. ఆనందాన్ని ఫీల్ అవ్వు' అంటూ యోగా చేసిన వీడియోను షేర్ చేసింది. ఇక అందులో విష్ణు ప్రియ నడుము తెగ హైలెట్ అయింది.


Click it and Unblock the Notifications











